Suma Adda Latest Episode Promo: సుమ కనకాల అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. ముఖ్యంగా ప్రతి శనివారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఈటీవీలో ఆవిడ వినోదం కోసం ఎదురు చూసే  వీక్షకులకు! ఇక నుంచి శనివారం రాత్రి టీవీలో సుమ కనకాల (Suma Kanakala) కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే... మరో కామెడీ షో 'జబర్దస్త్' ఆ సమయానికి టెలికాస్ట్ చెయ్యాలని ఈటీవీ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో సుమ షో టెలికాస్ట్ డే మారింది. ఆ విషయాన్ని లేటెస్ట్ 'సుమ అడ్డా' ప్రోమోలో కన్ఫర్మ్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే... 


ఇప్పటి నుంచి మంగళవారం రాత్రి 'సుమ అడ్డా'!
ఒకటి రెండు కాదు... లాస్ట్ 14 ఇయర్స్ నుంచి ప్రతి శనివారం రాత్రి సుమ హోస్ట్ చేస్తున్న షోలు శనివారం రాత్రి టెలికాస్ట్ అవుతూ వస్తున్నాయి. షో పేరు మారొచ్చు కానీ సుమ యాంకరింగ్ మాత్రం మారలేదు. ఆవిడ అందించే వినోదం మారలేదు. ఇప్పుడు ఆవిడ హోస్ట్ చేస్తున్న 'సుమ అడ్డా' షో టెలికాస్ట్ డే మారింది. ఇప్పటి నుంచి మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఆవిడ షో టెలికాస్ట్ కానుంది.


ఎందుకీ మార్పు? అంటే... శనివారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు 'జబర్దస్త్'ను టెలికాస్ట్ చెయ్యాలని ఈటీవీ అనుకోవడమే. ఇంతకు ముందు గురు, శుక్ర వారాల్లో రాత్రి 9.30 గంటలకు 'జబర్దస్త్' వచ్చేది. గురువారం 'జబర్దస్త్' అయితే శుక్రవారం 'ఎక్స్ట్రా జబర్దస్త్' వచ్చేది. ఇప్పుడు 'ఎక్స్ట్రా' తీసేసి శుక్ర, శని వారాల్లో 'జబర్దస్త్' వస్తుంది. అందుకని, శనివారం నుంచి మంగళవారం రాత్రికి 'సుమ అడ్డా' షిఫ్ట్ అయ్యింది.



'సుమ అడ్డా'లో సందడి చేసిన 'లవ్ మీ' టీమ్
ఈటీవీలో ఈ మంగళవారం (జూన్ 4వ తేదీన) ప్రసారం కానున్న 'సుమ అడ్డా' షోలో 'లవ్ మీ' సినిమా హీరో హీరోయిన్లు ఆశిష్, వైష్ణవి చైతన్యతో పాటు ఆ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన రవికృష్ణ, సిమ్రాన్ చౌదరి సైతం సందడి చెయ్యనున్నారు. సాధారణంగా సినిమా విడుదలకు ముందు ఇటువంటి ప్రమోషన్స్ చేస్తారు. కానీ, మూవీ రిలీజ్ తర్వాత ఈ ప్రమోషన్ జరుగుతుండటం విశేషం.


Also Read: 'ఢీ' నుంచి బాపు బొమ్మ అవుట్ - జడ్జి సీటులోకి కొత్తగా వచ్చిన హీరోయిన్ ఎవరంటే?



సుమక్కకు పంచ్ వేసిన 'బేబీ' వైష్ణవి చైతన్య!స్టార్ హీరోలపై అలవోకగా పంచ్ డైలాగ్స్ వెయ్యడం సుమ స్టైల్. అటువంటి సుమక్క మీద హీరోయిన్ వైష్ణవి చైతన్య పంచ్ వేసింది. అందుకు నోరెళ్లబెట్టడం సుమ వంతు అయ్యింది. 'వందల సంవత్సరాలు అనగానే దెయ్యాలు అంటే అవి రాత్రి తిరుగుతాయి' అని సుమ కనకాల అనగానే... 'ఎందుకంటే? అవి పొద్దున్న అంతా షోల్లో బిజీగా ఉంటాయి' అని వైష్ణవి చైతన్య అన్నది. సుమను ఆంటీ అంటూ రవికృష్ణ కామెడీ చేశాడు. మరిన్ని నవ్వుల కోసం టీవీలో షో చూడాలి.


Also Read'జబర్దస్త్'లో స్మాల్ ఛేంజ్ - జడ్జ్ సీటు నుంచి ఇంద్రజ అవుట్, అసలు కారణం అదేనా?