chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode : లక్ష్మీ.. మిత్ర ఇంటి దగ్గరకు ముసుగు వేసుకొని వస్తుంది. గతంలో తాను ఆ ఇంటి దగ్గర గడిపిన రోజుల్ని గుర్తు చేసుకుంటుంది. ఇక లక్ష్మీ తన అత్తయ్యని చూస్తుంది. ఆవిడ కూడా లక్ష్మీని చూడబోయే సరికి సెక్యూరిటీ వచ్చి లక్ష్మీతో మాట్లాడుతాడు. దీంతో లక్ష్మీ అత్తయ్యకు కనిపించకుండా ముసుగు వేసుకుంటుంది. ఇంతలో మనీషా వచ్చి లక్ష్మీని తీసుకొస్తుంది. మిత్ర తల్లి ఎవరు అని లక్ష్మీని అడిగితే మెహందీ డిజైన్స్ వేసే ఆమె అని మనీషా చెప్తుంది. 


లక్ష్మీ మిత్ర ఇంటిలో అడుగు పెడుతూ తమ పెళ్లి రోజు అడుగు పెట్టడం గుర్తు చేసుకుంటుంది. అన్ని గుర్తు చేసుకొని ఉంటే మనీషా అత్తారింటిలా కుడి కాలు పెట్టి రావాలి అనుకుంటున్నావా అని అడుగుతుంది. ఇక లక్ష్మీ ఎవరి ఇంట్లో అడుగు పెట్టినా మంచి జరగాలి అని కుడి కాలు పెడతాను అని అంటుంది. ఇక మనీషా మెహందీ డిజైన్స్ చూపించమని అడుగుతుంది. 


మరోవైపు లక్కీ జున్నూకి ఇళ్లంతా చూపిస్తుంది. ఇక అక్కడ ఓ గదిలోకి వెళ్లాలి అని జున్ను అంటే లక్కీ వద్దని చెప్తుంది. తన తండ్రి మిత్ర తిడతాడు అని అంటుంది. అయినా జున్ను బలవంతంగా లక్కీని ఆ గదిలోకి తీసుకెళ్తాడు. ఆ గదిలో మిత్ర, లక్ష్మీల పెళ్లి ఫొటో ఉంటుంది.జున్ను ఆ ఫొటో తీసే టైంకి మిత్ర వచ్చి ఆ ఫొటో తీసుకొంటాడు. ఆ గదిలోకి వచ్చినందుకు లక్కీని మిత్ర తిడతాడు. లక్కీని చెడగొడుతున్నావు అని జున్నుని తిడతాడు మిత్ర. మరోసారి ఆ గది వైపు రావొద్దని అంటాడు. జున్నూ ఫీలై వెళ్లిపోతాడు. ఇక లక్కీ కూడా జున్ను వెనకాలే వెళ్తుంది. మిత్ర ఆ గదిని పర్మినెంట్‌గా మూసేయాలి అని అనుకుంటాడు.


మరోవైపు మనీషా లక్ష్మీకి డిజైన్స్ అడుగుతుంది. లక్ష్మీ తీసుకురాలేదు అని చెప్తుంది. మనీషా షాకైపోతుంది. లక్ష్మీ ఏదో ఒకటి చెప్పి మ్యానేజ్ చేయాలని అంటుంది. ఫోన్‌లో మెహందీ డిజైన్స్ తీసి మనీషాకి చూపిస్తుంది. మరోవైపు మిత్ర కిందకి వస్తాడు. లక్ష్మీ మిత్రని చూసి ఎమోషనల్ అవుతుంది. మిత్ర రావడం రావడమే లక్ష్మీ ఉన్న రూమ్‌ని శాశ్వతంగా మూసేయమని ఆ గది ఉందని అందరూ మర్చిపోవాలి అని చెప్తాడు. పిల్లలు ఆ రూమ్‌లోకి వెళ్లారని ప్రతీ సారి చెప్పలేను అని అంటాడు. ఆ గది మూయకపోతే తన మనస్శాంతి పోతుందని అంటాడు. మిత్ర తల్లి మాత్రం ఒప్పుకోదు. 


లక్ష్మీ ఉన్న గదిలోని గుర్తులు తమకు తీపి జ్ఞాపకాలు అని అంటుంది. లక్ష్మీ గురించి తప్పుగా మాట్లాడొద్దని అని అంటుంది. మనీషా కూడా లక్ష్మీ గురించి మాట్లాడితే ఆమెను తిడుతుంది. అత్త మాటలకు లక్ష్మీ ఎమోషనల్ అవుతుంది. దేవయాని కూడా వచ్చి లక్ష్మీ వెళ్లిపోయినా మనస్శాంతి లేకుండా చేసిందని అంటుంది. దేవయానిని కూడా మిత్ర తల్లి సీరియస్ అవుతుంది. దీంతో మిత్ర అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు. ఇక మిత్ర తల్లి పిల్లల్ని మిత్ర ఏమన్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. జున్నునీ లక్కీ ఓదార్చుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తి కరంగా మారుతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రామ్‌కి గుండెపోటు.. పోటీల్లో విజయం సాధించిన సీత.. మధు పీడ పోయినట్లేనా!