Seethe Ramudi Katnam Today Episode : సీత కళ్లలో కారం పడటంతో కళ్లు తెరవలేకపోతుంది. పోటీలకు మాస్టారు ఇచ్చిన టైం అయిపోతుందని విద్యాదేవి రామ్ దగ్గరకు వెళ్తుంది. సీత జీవన్మరణ సమస్యతో పోరాడుతుందని నువ్వు ఇక్కడ తాపీగా ఎలా ఉండగలుగుతున్నావని రామ్‌ని నిలదీస్తుంది. రామ్ తాపీగా లేనని నరాలు తెగిపోతున్నాయని సీత ఓడిపోవడం తనకి ఇష్టం లేదని అంటాడు. సీతకు సపోర్ట్ చేయకుండా ఎలా పోతే నాకు ఏంటి అని వదిలేశావ్ చూడు నాకు నచ్చలేదు అని అంటుంది. రామ్‌ని మోటివేట్ చేస్తుంది. సీత పరిస్థితి చెప్తుంది. రామ్ షాక్ అయిపోతాడు. 


విద్యాదేవి: సీత ఉషని ఓడించింది. ప్రీతితో పోటీ పడిన టైంలో ఇలా జరిగింది. సీతకు నువ్వు ఆశీర్వాదం కూడా ఇవ్వలేదు అని బాధపడింది. ఇలాంటి టైంలో సీతకి నీ సపోర్ట్ చాలా అవసరం. ఇప్పుడు సీతను కాపాడాల్సింది నువ్వే. ఇప్పుడు కూడా నువ్వు సీతకు దూరంగా ఉంటే ఈ దూరం శాశ్వతం అవుతుంది. సీత ఎప్పటికీ నీకు దగ్గర అవదు. కుంటి సాకుతో సీతని దూరం చేసుకుంటావో ధైర్యం చెప్పి గెలిపించుకుంటావో ఆలోచించుకో ఎక్కవ టైం లేదు రామ్.


మహాలక్ష్మి వాళ్లు సీత ఓడిపోవడం ఖాయమని మాట్లాడుకుంటారు. ఇక మధుమిత మనసులో సీత కళ్లు  ఎప్పుడో మూసుకుపోయాయని అప్పుడు దాని కళ్లు తెరుచుకోవాలని అనుకున్నానని ఇప్పుడు మాత్రం కళ్లు తెరవకూడదని మధు అనుకుంటుంది. ఇక మాస్టార్, నట్టూ ఇద్దరూ పోటీలు ఉత్కంఠగా ఉన్నాయని అనుకుంటారు. మరోవైపు రామ్ సీత దగ్గరకు వస్తాడు. సీత చాలా సంతోషంగా ఫీలవుతుంది కానీ చూడలేకపోతుంది. దీంతో రామ్ కావాలనే తనకు గుండె నొప్పి వచ్చిందని గుండె పట్టుకొని విలవిల్లాడుతాడు. దాంతో సీత కళ్లు తెరిచేస్తుంది. రామ్ సీతతో సీత నువ్వు కళ్లు తెరిచావు అని సంతోష పడతాడు. దాంతో సీత పోటీలకు సిద్ధమవుతుంది. 


మరోవైపు ప్రీతి విన్ అయినట్లు ప్రకటించమని మహాలక్ష్మీ వాళ్లు అంటారు. ఇంతలో సీత ఎంట్రీ ఇస్తుంది. మళ్లీ రెండో రౌండ్ ప్రారంభమవుతుంది. ప్రీతి మధ్యలో ఆగిపోతుంది. సీత గెలుస్తుంది. సీత అద్భుతంగా డ్యాన్స్ చేసిందని మువ్వాహాస్ మాస్టార్ పొగుడుతాడు. అందరూ సీతకు కంగ్రాట్స్ చెప్తారు. ఇక మహాలక్ష్మి అర్చన వాళ్లు ప్రీతిని పైకి లేపుతారు. విద్యాదేవి మాస్టార్‌కు కృతజ్ఞతలు చెప్తుంది. మధు కోపంతో గదిలోకి వెళ్లిపోతుంది. మహా అండ్ బ్యాచ్ మొత్తం కోపంతో రగిలిపోతారు. ఇక రాజ్యం సీతకు హరతి ఇస్తుంటే సీత తీసుకొని విద్యాదేవికి హారతి ఇస్తుంది. 


సీత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి గెలిచాను అని చెప్తుంది. అందరూ సంతోషిస్తారు. ఇక శివకృష్ణ ఫ్యామిలీ మొత్తం సీతని పొగిడి మధుని తిడతారు. మధు మీద జాలి చూపించకుండా ఇంటి నుంచి తరిమేయమని అంటారు. సీత తన అక్కని అలా అనొద్దని ఇద్దరం మీకు ఒకటే అని అంటుంది. మధుకి మనం తప్ప ఇంకెవరూ లేరు అని చెప్తుంది. మధు జీవితాన్ని బాగు చేయాలని అంటుంది. అందుకు ఓ నిర్ణయం తీసుకున్నాను అని సీత అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపబోయిన బాబ్జీ – మనోహరికి వార్నింగ్ ఇచ్చిన అరుంధతి