Trinayani Today Episode : గంటలమ్మ మరోసారి విశాల్ ఇంటి దగ్గరకు వస్తుంది. వల్లభ గంటలమ్మని చూసి షాక్ అవుతాడు. తాను పిలవకుండా ఎందుకు వచ్చావని అడుగుతాడు. దానికి గంటలమ్మ ఆత్మల వాసన వస్తుందని అందుకే వచ్చానని అంటుంది. మరోవైపు గాయత్రీ దేవి ఆత్మ మరోసారి బయటకు వచ్చి గంటలమ్మ పని పడతాను అని చెప్తుంది. వల్లభ దగ్గరకు సుమన వస్తుంది. సుమన గంటలమ్మని చూసి షాక్ అవుతుంది. 


సుమన: ఈవిడ మళ్లీ ఎందుకు వచ్చింది.


గంటలమ్మ: మీ పెద్దత్తయ్య ఆత్మ ఇక్కడే సంచరిస్తుంది. ఆత్మ ఇక్కడే ఉండాలా.. ఉండకూడదా..


సుమన: పట్టికెళ్లిపో మా అక్క ఆశయం నీరుగారిపోవాలి.


గాయత్రీదేవి: నయని పరుగున వస్తుంటే.. నయని..


నయని: అమ్మగారు వచ్చారా అమ్మగారు నా కడుపు కోత వల్ల అయిన గాయాన్ని తగ్గించకుండానే వెళ్లిపోతారా అమ్మగారు. 


గాయత్రీదేవి: నయని నువ్వు నన్ను వదిలిపెట్టనప్పుడు నేను నిన్ను వదిలి ఎలా వెళ్తాను చెప్పు. విధి విధానాల ప్రకారం నేను కొన్ని విషయాలు చెప్పకూడదు. పునర్జన్మ ఎత్తిన తర్వాత మళ్లీ ఆత్మగా కనిపించడం అసాధ్యం కానీ  దుష్టశక్తి అంతం చూడటానికి విశాలాక్షి అమ్మవారికి గత జన్మలో నేను చేసుకున్న పుణ్యం ఇది. 


నయని: పునర్జన్మలో పసి బిడ్డగా మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి అమ్మగారు. మిమల్ని నేను నా పొత్తిళ్లలోకి తీసుకుంటాను.


గాయత్రీదేవి: పరోక్షంగా ఒక విషయం చెప్తాను. నువ్వు అర్థం చేసుకుంటే సరే. అర్థం చేసుకోకపోయినా ఒక ప్రాణాన్ని కాపాడిన దానివి అవుతావు. నీ బిడ్డ గాయత్రీని బంధించి ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికి గంటలమ్మ ఇంటికి వచ్చింది. 


గంటలమ్మ: ఆత్మ ముందు నుంచి ఇక్కడే ఉందిరా.


సుమన: అలా అయితే మా అక్కకి ఎప్పుడో ఆత్మ కనిపించాలి కదా. 


మరోవైపు హాసిని కూడా గంటలమ్మని చూస్తుంది. అందరిని కిందకి పిలుస్తుంది. అందరూ కిందకి వచ్చి గంటలమ్మని చూసి షాక్ అవుతారు. గాయత్రీదేవి నయనితో హాసిని గంటలమ్మని చూసిందని అందుకే అరిచిందని చెప్తుంది. నయని తన బిడ్డని కాపాడుకుంటాను అని గాయత్రీదేవితో చెప్తుంది. 


గాయత్రీదేవి: నయని నీ బిడ్డ గాయత్రీని తీసుకెళ్లడానికే వచ్చింది. 


నయని: నేను ఎలా ఊరుకుంటాను.


గాయత్రీదేవి: నువ్వు ఊరుకోవాలి. నేను ఆత్మగా నీకు కనిపిస్తున్నాను అని నువ్వు ఎవరికీ చెప్పకూడదు. నేను ఎక్కడా కనిపించడం లేదు అని నువ్వు చెప్పాలి. అప్పుడు గంటలమ్మ ఆహం దెబ్బతింటుంది. అందరూ తిరగబడతారు.


నయని: అర్థమైంది అమ్మగారు. నేను ముందు వెళ్తాను. అమ్మగారు వచ్చారు అని షాకు చెప్తే ఇలాంటి మంత్ర గత్తెలను ఇంట్లోకి రానిస్తారా.


ఇంతలో గాయత్రీదేవి కిందకి దిగుతుంది. గంటలమ్మ షాక్ అయి ఆత్మను చూస్తుంది. అందరూ ఏమైందని అడిగితే సుమన ఆత్మ కనిపించిందేమో అని అంటుంది. నయని మాత్రం అక్కడ ఎవరూ లేరు అని అంటుంది. 


గంటలమ్మ: ఏయ్ త్రినేత్రంతో చూసే నువ్వు అబద్ధం చెప్పకు. గాయత్రీ దేవి ఆత్మ నీ పక్కనే నిల్చొంది కదా.


నయని: భ్రమ పడుతున్నావా గంటలమ్మ.. అమ్మగారు వస్తే నాతో మాట్లాడుతారు. 


గంటలమ్మ: ముగ్గు వేస్తాను ఎక్కడ పిండి. స్వాధీన రేఖ వేసి వచ్చిన గాయత్రీదేవి ఆత్మను అందులో ఉంచి బంధించి తీసుకెళ్తాను. 


గాయత్రీదేవి: నేను వచ్చింది మీ కోసం గంటలమ్మ బంధించే వెళ్లిపోవడానికి కాదు నయని. 


గంటలమ్మ: మాట్లాడింది చూశారా. నయని అంది విన్నారా.


అందరూ షాక్ అయిపోతారు. నయనికి కనిపిస్తున్నా లేదు అని అబద్ధం చెప్తుందని గంటలమ్మ అంటుంది. నేను చెప్పొద్దు అని చెప్పాను అని గాయత్రీదేవి అంటుంది. అది విన్న గంటలమ్మ నయనికి తన అత్తే చొప్పొద్దని చెప్పిందని అందుకే నయని చెప్పడం లేదు అని అంటుంది. ఇక విక్రాంత్ అందరూ ఆవిడకు డబ్బులు ఇచ్చి పంపేయ్ మని అంటాడు. తన తల్లి ఆత్మను బంధించి తీసుకెళ్తాను అంటే మేం ఒప్పుకోను అని విశాల్ అంటాడు. 


ఇక సుమన తన అక్క అబద్ధం చెప్తుందా నిజం చెప్తుందా తేల్చేస్తాను అని అంటుంది. ఎలా అని అందరూ అడిగితే గాయత్రీనో గానవినో తీసుకొచ్చి వాళ్ల మీద ప్రమాణం చేయమని చెప్తే నిజం చెప్తుందని అంటుంది. సుమన వెళ్లడంతో గాయత్రీదేవి పాపని తీసుకొస్తే ప్రమాదమని సుమనను ఆపమని గాయత్రీదేవి చెప్తుంది. దాంతో నయని గంటలమ్మ చేతిలో మంత్ర దండం విసిరి సుమనను కొడుతుంది. దీంతో సుమన కళ్లు తిరిగి పడిపోతుంది. ఇక గాయత్రీదేవి నయనితో గంటలమ్మ మెడలో గంట తీసి దూరంగా దొరకకుండా పడేయమని చెప్తుంది. దాంతో నయని గంట తీసుకొని పారిపోతుంది.


ఇక ఉదయం ఉలూచి పాప ఏడుస్తుంది. దురంధర ఎత్తుకొని ఆడిస్తుంటుంది. ఇంతలో పెద్ద బొట్టమ్మ ఇంటికి వస్తుంది. పెద్ద బొట్టమ్మ ఇంట్లో ఉన్న పాప ఉలూచి కాదు అని తెలుసుకుంటుందేమో అని గురువుగారు కూడా హడావుడిగా ఇంటికి వస్తారు. ఉలూచి దగ్గరకు పెద్దబొట్టమ్మ వెళ్లే సరికి సుమన వచ్చి ఆపేస్తుంది. పాపని తీసుకొని గదిలోకి వెళ్లిపోమని విశాల్ సుమనకు చెప్తాడు. గురువుగారు కూడా వచ్చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: 'నాగ పంచమి' సీరియల్: వైశాలి నాగాంశ అని మోక్షతో చెప్పేసిన పంచమి.. ఘనాని చితక్కొట్టిన ఫాల్గుణి!