Pranitha Subhash out of Dhee Show: బుల్లితెర వీక్షకులకు ప్రతి వారం అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో పాటు వినోదం పంచే కార్యక్రమాల్లో 'ఢీ' కూడా ఒకటి. తెలుగులో డాన్స్ రియాలిటీ షోల్లో (Dance Reality Shows In Telugu) కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఇటీవల 'ఢీ సెలబ్రిటీ స్పెషల్' సీజన్ ముగిసింది. ఈ వారం నుంచి 'ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2' స్టార్ట్ కానుంది. అయితే, దీని నుంచి బాపు బొమ్మ ప్రణీతా సుభాష్ అవుట్ అయ్యింది. ఆవిడ ప్లేసులో జడ్జిగా వచ్చిన కొత్త హీరోయిన్ ఎవరంటే... 


బాపు బొమ్మ బదులు యాపిల్ బ్యూటీ
Hansika In Dhee Show: 'ఢీ సెలబ్రిటీ స్పెషల్'లో బాపు బొమ్మ ప్రణీతా సుభాష్ జడ్జి సీటులో సందడి చేసింది. ముద్దు ముద్దు మాటలతో క్యూట్‌గా చెప్పే జడ్జిమెంట్ టీవీ ఆడియన్స్ మనసు దోచుకుంది. అయితే, ఇకపై 'ఢీ సెలబ్రిటీ స్పెషల్'లో ప్రస్తుతానికి అయితే ఆమె కనిపించే అవకాశం లేదు. ప్రణీతా సుభాష్ బదులు యాపిల్ బ్యూటీ హన్సికను తీసుకు వచ్చారు.



'ఢీ సెలబ్రిటీ స్పెషల్' సీజన్ 2 ప్రోమోను లేటెస్టుగా రిలీజ్ చేశారు. అందులో హన్సిక జడ్జి అనే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. 'ఢీ'లో కొన్ని సీజన్లుగా శేఖర్ మాస్టర్ జడ్జి సీటులో కంటిన్యూ అవుతూ వస్తున్నారు. ఢీ షోలో డ్యాన్సర్, తర్వాత డ్యాన్స్ మాస్టర్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన... ఆ తర్వాత జడ్జి అయ్యారు. హన్సికను ఆయన ఒక డౌట్ అడిగారు.


'హన్సిక... ఒక డౌట్! నువ్వు గుడ్ జడ్జా? బ్యాడ్ జడ్జా?' అని శేఖర్ మాస్టర్ అడిగితే... 'ఇప్పుడు చూడు' అని హన్సిక సమాధానం ఇచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దేశముదురు' సినిమాతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హన్సిక ఎంట్రీ ఇచ్చింది. అందులో ఆవిడ హీరోయిన్. తెలుగులో ఆమెకు ఫస్ట్ ఫిల్మ్ కూడా అదే. ఆ తర్వాత యంగ్ స్టార్ హీరోలతో పలు సినిమాలు చేశారు.


Also Read: 'జబర్దస్త్'లో స్మాల్ ఛేంజ్ - జడ్జ్ సీటు నుంచి ఇంద్రజ అవుట్, అసలు కారణం అదేనా?



తెలుగులో ఒకప్పుడు బిజీ హీరోయిన్ అయిన హన్సిక టాలీవుడ్ నుంచి వున్నట్టుండి ఆవిడ మాయం అయింది. తమిళంలో వరుస ఆఫర్లు రావడం, అక్కడ ఆమెను జూనియర్ ఖుష్బూ అంటూ కొలవడం, ఏకంగా గుడి కట్టేయడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ అయ్యింది. పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ టీవీ షో 'ఢీ'తో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు వస్తోంది. మెల్లగా టీవీలో బిజీ అవుతుంది ఏమో చూడాలి. జూనియర్ ఖుష్బూ కంటే ముందు ఒరిజినల్ ఖుష్బూ టీవీకి వచ్చారు. ఆవిడ 'జబర్దస్త్'లో జడ్జిగా చేస్తున్న సంగతి తెలిసిందే.


Also Readయాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు



ఒక నుంచి రెండు రోజులు 'ఢీ' వినోదం!
ఇప్పటి వరకు బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మాత్రమే 'ఢీ సెలబ్రిటీ స్పెషల్' షో టెలికాస్ట్ అయ్యేది. ఇక నుంచి బుధవారంతో పాటు గురువారం రాత్రి కూడా ఆ షో టెలికాస్ట్ కానుంది. ఢీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2లో సందడి చేసే కంటెస్టెంట్లు ఎవరో త్వరలో తెలియనుంది.