Guppedanta Manasu  Serial Today Episode: ధరణి వచ్చి దేవయానిని తిట్టి నువ్వు వసుధారను అవమానించేందుకే పూజ చేయించావని నాకు ముందే తెలుసు అందుకే నేను వసుధారకు కూడా తాంబూలం  ఇచ్చానని చెప్తుంది దీంతో దేవయాని షాక్‌ అవుతుంది. శైలేంద్ర గిల్టీగా ఫీలవుతుంటాడు. నీ పిచ్చి ఐడియాలతో  వసుధార బాధపడిందో లేదో కానీ ధరణి ముందు మన పరువు పోయింది అంటాడు. దీంతో కోపంగా శైలేంద్రను తనతో రమ్మని అంతా చూపిస్తానని తీసుకెళ్తుంది దేవయాని. మరోవైపు వసుధార ఇంటికి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది.

అనుపమ: వసుధార ఏమైంది ఎందుకు ఆ కన్నీళ్లు..?

మహేంద్ర: వసుధార ఆ కన్నీళ్లు ఏంటి?

వసు: లేదు మామయ్యా ఏం కాలేదు..

మహేంద్ర: నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే నా గుండె తరుక్కుపోతుంది. చెప్పమ్మా ఏం జరిగిందక్కడ.

వసు: ఏం లేదు మామయ్యా మీరు కంగారు పడకండి.

మహేంద్ర: లేదమ్మా అక్కడ ఏదో జరిగింది. వదిన గారో శైలేంద్రనో ఏదో చేసి ఉంటారు.

అంటూ మహేంద్ర ధరణికి ఫోన్‌ చేసి వసుధార పూజ దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి ఏడుస్తూ ఉంది అక్కడ ఏం జరిగిందని అడుగుతాడు. దీంతో ధరణి అక్కడ జరిగింది మొత్తం చెప్తుంది. దీంతో మహేంద్ర కోపంగా వాళ్లను తిడతాడు. ఇప్పుడే అక్కడకు వెళ్లి వాళ్లను కడిగేస్తానని మహేంద్ర వెళ్లబోతుంటే అనుపమ ఆపుతుంది. ఇంతలో అక్కడికి దేవయాని, శైలేంద్ర వస్తారు.

మహేంద్ర: ఎందుకు వచ్చారు?

దేవయాని: ఎందుకొచ్చారంటే ఎం చెప్పాలి. మీరు పూజకు వస్తారని చాలా స్వీట్లు చేయించాను కానీ నువ్వు, అనుపమ రాలేదు.

శైలేంద్ర: మీరు రాకపోయినా మేము మీ నోరు తీపి చేయడానికి మేమొస్తే ఇలా మాట్లాడతారేంటి బాబాయ్

దేవయాని: ఎందుకు మహేంద్ర మీరు మమ్మల్ని శత్రువుల్లా చూస్తారు?

అనగానే మహేంద్ర మీరు మాకు శత్రువులే అంటాడు. దీంతో శైలేంద్ర, దేవయాని షాక్‌ అవుతారు.  సరే నువ్వు ఎలాగైనా మాట్లాడు కానీ రిషి ఎక్కడున్నాడు. నీకు రిషి కనిపించడం లేదన్న బాధ ఉందా? ఆ మను ఎప్పుడైతే వచ్చాడో కానీ నువ్వు రిషిని పూర్తిగా మర్చిపోయావు అంటుంది దేవయాని. దీంతో మేము రిషి కోసం ఎంత వెతుకుతున్నామో నీకు తెలుసా? అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో అసలు ఇదంతా ఎందుకు చెప్పు సింపుల్‌గా రిషి లేడని ఒప్పేసుకోండి అంటుంది దేవయాని.

వసు: రిషి సార్‌ ఉన్నారు.

దేవయాని: ఉంటే ఎక్కడున్నారు. ఇంకా వారం రోజుల టైం మాత్రమే ఉంది. ఈలోపు తనని తీసుకొస్తావా? చెప్పు తీసుకొస్తావా?

వసు: తీసుకొస్తాను..

దేవయాని: తీసుకురాకపోతే..

వసు: తీసుకొస్తానని చెప్తున్నాను కదా మేడం కచ్చితంగా రిషి సార్‌ను తీసుకొస్తాను.

దేవయాని: ఒకవేళ రిషిని తీసుకురాకపోతే నువ్వు అన్న మాట మీద నిలబడతావా? చెప్పు నిలబడతావా?

వసు: నిలబడతాను..

దేవయాని: అసలు నువ్వు ఇచ్చిన మాట గుర్తుందా? నీకు చెప్పు గుర్తుందా?

వసు: గుర్తుంది.. రిషి సార్‌ను తీసుకురాకపోతే నేను కాలేజీని వదిలి దూరంగా వెళ్లిపోతాను.

దేవయాని: అబ్బా ఇచ్చిన మాట బాగానే గుర్తు ఉంది. నువ్వేం అంటావు మహేంద్ర..

మహేంద్ర: వసుధారకు అంత నమ్మకం ఉన్నప్పుడు నేను ఇంకేం మాట్లాడను.. తన మాటే నా మాట..

అనుపమ: మహేంద్ర అలా అంటావేంటి?

అనగానే నువ్వుండు అనుపమ నీ దగ్గరకే వస్తున్నాను అంటూ అనుపమ ఎవరు? ఇన్నాళ్లు ఇక్కడ ఎందుకు ఉందని ప్రశ్నిస్తుంది దేవయాని. తను నా ఫ్రెండ్‌ అని మహేంద్ర చెప్పగానే దేవయాని, అనుపమను నీలాంటి అడదాన్ని ఎంమంటారో తెలుసా? అని ఏదో అనబోతుంటే ఇంతలో మను అక్కడకు వచ్చి దేవయానిని తిడతాడు. ఏ హక్కుతో మీ అమ్మా ఈ ఇంట్లో ఉందని శైలేంద్ర అడగడంతో.. మా పర్సనల్‌ విషయాలు మీకెందుకు అంటాడు మను. ఇంతలో దేవయాని కల్పించుకుని నీకు మీ అమ్మకు ఉన్న గొడవేంటో ప్రపంచం మొత్తం తెలుసు నువ్వింకా దీన్ని పర్సనల్‌ గొడవ అంటావేంటి? అనడంతో మను షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌అయిపోతుంది.  

ALSO READ: నటుడి బ్యాగులో బుల్లెట్ల కలకలం - తనిఖీల్లో బయటపడ్డ 40 బుల్లెట్లు