Bullets Found in Actor Karunas Hand Luggage: తమిళ నటుడు, కమెడియన్‌, మాజీ ఎమ్మెల్యే కరుణాస్‌ బ్యాగులో పెద్ద సంఖ్యలో బుల్లెట్‌ బయటపడటం సంచలనం రేపుతుంది. జూన్‌ 2న ఉదయం ఆయన చెన్నై విమానాశ్రయంలో ఆయన బ్యాగు తనిఖీ చేయగా దాదాపు 40 బుల్లెట్లు బయటపడ్డాయి. కాగా ఆదివారం ఉదయం కరుణాస్‌ తిరుచ్చి వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి వచ్చారు. ఈ క్రమంలో అక్కడ అధికారులు తనిఖీ నిర్వహించగా ఆయన బ్యాగులో పెద్ద సంఖ్యలలో బుల్లెట్లను గుర్తించారు.


దీనిపై కరుణాస్‌ను విమానాశ్రయ అధికారులు ప్రశ్నించడంతో తన వద్ద ఉన్న లైసెన్డ్స్‌ తుపాకి ఉందని, ఈ బుల్లెట్లు దానికి సంబంధించినవే అని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆ గన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్‌ని కూడా ఆయన అధికారులకు చూపించారట.  అయితే ఆ పాత్రలు పరిశీలించిన అధికారులు ఆయనను విమానం ఎక్కేందుకు అంగీకరించలేదు. ఎయిర్‌పోర్టు నుంచి ఆయనను తిరిగి వెళ్లిపోయేందుకు అనుమతించారు. కానీ, ఆయనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని విమానాశ్రయ పోలీసులు వెల్లడించారు. కాగా గతంలో కరుణాస్‌ అన్నాడిఎంకే ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరువాడనై నియోజకవర్గంలో  2016 నుంచి 2021 వరకు శాసనసభ్యుడిగా కూడా కొనసాగారు.  


Also Read: అమ్మ ఎప్పుడూ నేను నటిని కావాలని కోరుకోలేదు - నన్ను ఆ ప్రోఫెషన్‌లో చూడాలనుకుంది, జాన్వీ కపూర్‌ కామెంట్స్‌