Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today October 1st: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: రైడ్ నుంచి జానుని కాపాడిన మిత్ర.. ఆ విషయంలో తల్లినే అనుమానించిన వివేక్!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode జానుని మిత్ర, లక్ష్మీలు క్షేమంగా ఇంట్లోకి తీసుకురావడం దేవయాని ఇదంతా చేసిందని వివేక్ అనుమానించడంతో ఇవాళ్టి ఎపిసోడ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జాను కావాలనే రైడ్‌లో దొరికేలా దేవయాని ప్లాన్ చేస్తుంది. పోలీసులు జానుని ప్రశ్నిస్తే జాను తనకి ఓ అన్‌ నౌన్ నెంబరు నుంచి కాల్ వచ్చి హోటల్‌కి రమ్మంటే వచ్చానని జరిగిందంతా చెప్తుంది. అర్థం చేసుకున్న పోలీస్ జానుకి డిటెల్స్ అడిగి నువ్వు ఎవరి తాలూక అని అడుగుతారు. దాంతో జాను మిత్ర గారి తాలూక అంటే పోలీస్ నమ్మరు. ఇక జాను నెంబరు చెప్పడంతో పోలీస్ మిత్రతో మాట్లాడి విషయం చెప్తారు. జాను తప్పుడు కేసులో ఇరుక్కుందని చెప్పడంతో మిత్ర షాక్ అయిపోతాడు.

Continues below advertisement

మరోవైపు దేవయాని, మనీషాలు మీడియా ఇంకా లోపలికి వెళ్లలేదని అనుకుంటారు. మీడియా వచ్చి గోల గోల చేస్తుందనుకుంటే ఇక్కడే ఉంది ఏంటా అసలు లోపలేం జరుగుతుందా అని అనుకుంటారు. మరోవైపు జయదేవ్, అరవిందలు లక్ష్మీని పిలిచి దీక్షితులు గారు ఫోన్ చేసి అందరూ సంతోషంగా ఉంటామని చెప్పారని అంటారు. అప్పుడే వివేక్ కంగారుగా అక్కడికి వస్తాడు. ఎందుకు టెన్షన్‌గా ఉన్నావని జయదేవ్ అడుగుతాడు. వివేక్ తడబడతాడు. లక్ష్మీ కంగారు పడి కన్నీళ్ల పెట్టుకుంటుంది. ఏమైంది ఏదైనా సమస్య అని అడుగుతుంది అరవింద.

లక్ష్మీ: జాను ఇందాక టెన్షన్‌గా బయటకు వెళ్లింది అత్తయ్య ఏమైంది అని అడిగినా ఏం చెప్పలేదు. వచ్చి చెప్తా అని పరుగులు తీసింది నాకు టెన్షన్‌గా ఉంది.
వివేక్: తన ఫ్రెండ్స్‌ని కూడా అడిగా పెద్దమ్మ ఎవరూ తెలీదన్నారు.
జయదేవ్: అసలేం జరిగింది. 
అరవింద: జాను ఏమైనట్లు.
మిత్ర: లక్ష్మీ నాతో రా. 
అరవింద: జాను కనిపించడం లేదంటరా. 

మిత్ర ఎవరికీ సమాధానం చెప్పకుండా లక్ష్మీని తీసుకొని హోటల్ దగ్గరకు వెళ్తాడు. మరోవైపు జాను ఏడుస్తుంటుంది. మనీషా, దేవయానిలు చూసి ఏదో మ్యానేజ్ చేస్తున్నారని అనుకుంటారు. దేవయాని మీడియాకి కాల్ చేసి లోపలికి వెళ్లడం లేదేంటని అడుగుతుంది. దేవయాని ఒత్తిడితో మీడియా లోపలికి వెళ్లాలని గోల గోల చేస్తారు. జాను లక్ష్మీకి కాల్ చేసి ఏడుస్తుంది. లక్ష్మీ చాలా కంగారు పడుతుంది. ఎక్కడున్నారని జాను అడిగితే నేను, వివేక్, మిత్ర గారు వస్తున్నామని చెప్తుంది. ఇక మిత్ర ఫోన్ తీసుకొని దగ్గర్లోనే ఉన్నామని చెప్తారు. వివేక్ కూడా ఏమైందని కంగారు పడతాడు. ఇక మిత్ర వాళ్లు రావడం దేవయానిలు చూసి షాక్ అయిపోతారు. వాళ్ల కంట పడకుండా దాక్కుంటారు. 

మిత్ర వాళ్లు లోపలికి వెళ్తారు. జానుని అలా గదిలో చూసి షాక్ అయిపోతారు. జాను లక్ష్మీని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది. జానుని ఎవరో ట్రాప్ చేశారని పోలీసులు చెప్తారు. ఇక ఇంటికి వెళ్లాలని మిత్ర చెప్పడంతో పోలీసులు వేరే దారి నుంచి వాళ్లని పంపేస్తారు. ప్లాన్ ఫెయిల్ అయినందుకు మనీషా, దేవయానిలు తెగ ఫీలవుతారు. అందరూ ఇంటికి వెళ్తారు. ఏడుస్తున్న జానుని చూసి ఏమైందని అందరూ అడుగుతారు. పెళ్లి కావాల్సిన ఆడపిల్లవి అలాంటి చోటుకు ఎందుకు వెళ్లావని మీడియా నిన్ను చూసుంటే నీ గురించి చెడుగా వార్తలు వచ్చేవని చెప్తావా కొట్టాలా అని లక్ష్మీ అంటే మిత్ర లక్ష్మీని ఆపుతాడు. లక్ష్మీ ఏడుస్తుంది. 

లక్ష్మీ: అసలు మీరు లేకపోతే తన గతి ఏమై ఉండేది.
అరవింద: ఏడవకుండా అసలేం జరిగిందో చెప్పు.
జాను: ఇందాక నాకు ఓ ఫోన్ వచ్చిందని జాను జరిగిందంతా చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. దేవయాని, మనీషా కూడా వస్తారు. 
వివేక్: ఇది ఎవరో కావాలనే చేశారన్నయ్యా. ప్లాన్ చేసి జానుని ఇరికించాలి అనుకున్నారు. 
మిత్ర: ఎవరు ఎలా ప్లాన్ చేసినా సక్సెస్ అవ్వలేదు కదా రిలాక్స్ అవ్వండి.
మనీషా: ఏంటి నన్ను చూస్తున్నావ్ దీనికి నాకు ఏం సంబంధం లేదు. నువ్వు మాత్రమే నా టార్గెట్ నీ చెల్లి కాదు.
వివేక్: ఇది కచ్చితంగా ఇంట్లో వాళ్ల పనే.
దేవయాని: అంటే ఏంట్రా నీ ఉద్దేశం నోటికి వచ్చినట్లు మాట్లాడితే పళ్లు రాలగొడతాను.

అసలు మీరు ఎక్కడికి వెళ్లారని జయదేవ్ దేవయానిని అడుగుతారు. దానిని దేవయాని జాను వెళ్లిన హోటల్‌కే వెళ్లామని అంటుంది. తప్పు ఎవరూ చేశారో తెలుసుకొని మాట్లాడమని నిందలు వేస్తే బాగోదని అంటారు. ఇక వివేక్ అరవిందతో ఇదంతా మా అమ్మ చేస్తే ఎందుకు ఏం అనలేదు అని వివేక్ అడిగితే ఇది మీ అమ్మ చేసినా ఏమైనా చేయాల్సింది నువ్వే అని అంటారు. ప్రేమించింది నువ్వే పరిష్కరించాల్సింది నువ్వే అని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సత్యని చంపేద్దామని తండ్రితో చెప్పిన రుద్ర.. ఇక సత్య, క్రిష్‌లకు ముహూర్తం లేనట్లే?

Continues below advertisement
Sponsored Links by Taboola