Satyabhama Serial Today Episode సత్య క్రిష్‌ ఒకరికి ఒకరు తినిపించుకుంటారు. క్రిష్‌ ప్లేట్ తీసుకునే టైంలో సత్య క్రిష్ చేతికున్న గాయం చూస్తుంది. క్రిష్ చేయి పట్టుకని చేతికున్న రుమాలు విప్పి చూస్తుంది. షాక్ అయిపోతుంది. ఏడుస్తుంది. క్రిష్‌ ఏం కాలేదని దానికి ఎందుకు అంత కన్నీళ్లని అంటుంది. ఏమైందని అడిగితే తండ్రి కోసం వెళ్లిన గొడవలో ఇలా జరిగిందని అంటాడు. సత్య క్రిష్‌ చేతికి ఫస్ట్‌ఎయిడ్ చేస్తుంది. 


సత్య: నేను నీ మీద అరుస్తాను అది కోపంతో కాదు నీ మీదున్న ప్రేమతో. ఒకప్పుడు నేను నిన్ను ఏడిపించాను. ఇప్పుడు నేను ఏడుస్తున్నాను. అది నీకు ఏమవుతుందా అనే భయంతో. నీకు చాలా పనులు ఉండొచ్చు నా గురించి ఆలోచించే తీరిక ఉండకపోవచ్చు. కానీ నాకు నీ గురించి ఆలోచించడం మాత్రమే పని. ఆ పనికి నాకు వస్తున్న జీతం ఏంటో తెలుసా కనీళ్లు ఎప్పటికీ తెలుసుకుంటావ్. నువ్వు లేని జీవితం నాకు చీకటే క్రిష్ ఎలా బతకగలను.
క్రిష్: సత్య అలాంటి పరిస్థితి రానివ్వను. అస్సలు రానివ్వను. ప్రేమగా చూసే కళ్లకి ప్రేమతో కనీళ్లు కార్చిన కళ్లకి తేడా నాకు తెలుసు అనుభవించాను. (సత్య క్రిష్‌ని హగ్ చేసుకొని ఏడుస్తుంది)


హర్ష: మైత్రి బాధ పడుతుంటే.. మైత్రి నేను అన్నింటికీ సిద్ధపడే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. 
మైత్రి: అన్నింటికీ అంటే.
హర్ష: అందరికీ సమాధానం చెప్పడానికి. 
మైత్రి: నీ కాపురం గురించి ఆలోచించుకున్నావా.
హర్ష: దానికే కాదు. ఒకప్పటి నందిని వేరు ఈ నందిని వేరు. ఒకప్పటి నందినికి కోపం వస్తే వదిలేసి వెళ్లిపోయేది ఇప్పటి నందిని కోపంతో కాపురం వదులు కోదు. ఇది సరిపోదా నా కాన్ఫిడెంట్‌కి. అయినా నేను వచ్చింది నా గురించి చెప్పడానికి కాదు నీ గురించి చెప్పడానికి. నీ లైఫ్‌ సెటిల్ అయితే నాకు ప్రశాంతత. మా కొలిగ్ ఓ సంబంధం చెప్పాడు మాట్లాడాలి అనుకుంటున్నా.
మైత్రి: ఇప్పుడు నా మనసు పెళ్లికి సిద్ధంగా లేదు.
హర్ష: అలా కాదు మైత్రి ఇప్పుడు నీకు ఓ ఫ్యామిలీ సపోర్ట్ ఓ తోడు ఉండాలి.
మైత్రి: కానీ.
నందిని: ఈ ఇళ్లు వదిలి వెళ్లడం నీకు ఇష్టం లేదు అంతే కదా.
హర్ష: నందిని ఇది నీకు అవసరం లేని విషయం నువ్వు వెళ్లు.
నందిని: నా మొగుడు ఇన్వాల్వ్ అయిన విషయం నాకు సంబంధం లేదు ఎందుకు. నేను ఇక్కడే ఉంటాను నువ్వు నీ దోస్త్‌తో మాట్లాడు. నకరాలు చేస్తుంది నకరాలు.  
హర్ష: నందిని నన్ను ఇరిటేట్ చేయకు.
మైత్రి: హర్ష ఆ సంబంధం మాట్లాడి పెళ్లి చూపులకు రమ్మని చెప్పు. నా బాధని తట్టి బయటకు రాలేకపోతున్నా అంతే కానీ వేరే ఏం లేదు నీ చేతుల మీదుగా నా పెళ్లి జరిపించుదువు గానీ సరేనా నందిని.


ఉదయం సత్య కాఫీ తీసుకొని క్రిష్‌ దగ్గరకు వస్తుంది. క్రిష్‌ సత్యతో నాకు వేడి వేడి కాఫీ వద్దు వేడి వేడి ముద్దు కావాలని సత్య దగ్గరకు వెళ్తాడు. సత్య సిగ్గు పడుతుంది. ఇంతలో జయమ్మ అక్కడికి వచ్చి కోపంగా చూస్తుంది. క్రిష్ ఏంటే ముసలి ఆ చూపు కళ్లు మూసుకో అని అంటాడు. ఇక జయమ్మ చూస్తున్న పంచాంగం చూసిన క్రిష్ ఏంటి అలా చూస్తున్నావ్ అని అడుగుతాడు. దానికి జయమ్మ నీ శోభనం గురించి ముహూర్తం అని చూస్తున్నా అని అంటాడు. నీ ముహూర్తాలు అయినప్పటికీ నాకు శోభనం నీ వయసులో అవుతుందని కర్ర పట్టుకొని జయమ్మని పరుగులు పెట్టిస్తాడు. 


జయమ్మ: నువ్వేం చేసిన సరే ముహూర్తాలు పెట్టాల్సిందే శోభనం జరగాల్సిందే.
క్రిష్‌: చూసినావా చూసినావా ముసలి దాని మొండితనం. అయిపోయింది ఇవాళ నా చేతిలో. నా మాట వినమని చెప్పు సత్య
సత్య: మీ మనవడు ఎలాగూ తగ్గడు మీరు అయినా తగ్గొచ్చు కదా బామ్మ.
జయమ్మ: నీ మొగుడికి నువ్వు చెప్పొచ్చు కదా సర్లే నువ్వ చెప్పావ్ కదా నీ మాట వింటున్నా ముహూర్తాలతో సంబంధం లేదు నీ బాధ మీరు పడండి.
క్రిష్: నా బంగారు బామ్మ థ్యాంక్స్. ఆడపిల్ల పుడితే నీ పేరే పెట్టుకుంటా.
సత్య: మీ బామ్మ ఒప్పుకుంటే సరిపోదు ఈ సత్యభామ కూడా ఒప్పుకోవాలి. నా పుట్టిన రోజు ఎప్పుడో తెలుసుకోవాలి అన్నా ఏమైంది.
క్రిష్: నిజంగానే చెప్పావా. ఈ రోజు శోభనం అయిపోగానే ఆ పని లోనే ఉంటే రేపటి నుంచి. అసలీ శోభనం ఏంటో కానీ చికెన్ షాప్‌లో చికెన్ ముక్క కోసం చూసిన కుక్క బతుకు అయింది నా బతుకు. సరే తెలుసుకుంటాలే. 


సత్య క్రిష్‌కి క్లూ ఇస్తుంది. మా తెలుగు టీచర్ వయసులో సగం అని దానికి క్రిష్ అందరు పెళ్లాలు ఇంతేనా అని తిట్టుకుంటాడు. తన మాస్టర్‌తో జాగ్రత్త అని చెప్తుంది. మరోవైపు అదంతా మహదేవయ్య, రుద్ర చూస్తారు. వాళ్లని చూసిన సత్య వెటకారంగా చూడటంతో వాళ్లు వెళ్లిపోతారు. సత్య చూపుని తలచుకొని మహదేవయ్య రగిలిపోతాడు. సత్య క్రిష్‌ని చిన్న చిన్నగా తనవైపునకు తిప్పుకుంటుందని సత్యని వదిలేస్తే క్రిష్‌ని మనమీదకే బాణంలా వదులుతుందని ఇవన్నీ ఎందుకు సత్యని లేపేద్దామి అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. 


Also Read: అమ్మాయి గారు సీరియల్: శ్వేతతో తనకు పెళ్లని రూపతో చెప్పిన రాజు.. హారతి ఇంట్లో మందారం, ఇద్దరి పెళ్లాల మధ్య చిక్కుకున్న దీపక్!