సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అభిమానులకు కాస్త షాక్ కలిగించే అంశం ఇది. ఆయన అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం చెన్నైలోని ఒక ప్రముఖ ఆసుపత్రి (Apollo Hospital)లో చికిత్స పొందుతున్నారు. అసలు రజనీకి ఏమైంది? ఆయన ఎందుకు ఆసుపత్రిలో చేరారు? రజని ఆరోగ్యం గురించి లతా రజనీకాంత్ ఇచ్చిన అప్డేట్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు!
Rajinikanth Hospitalised: రజనీకాంత్ ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెన్నై అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సూపర్ స్టార్ తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఓ హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి ఆసుపత్రి వర్గాలు.
రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి బావుంది - సతీమణి లత
ఆసుపత్రి వర్గాలతో పాటు సూపర్ స్టార్ రజనీ సతీమణి లతా రజనీకాంత్ (Latha Rajinikanth) సైతం తన భర్త ఆరోగ్య పరిస్థితి మీద స్పందించారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఆవిడ తెలిపారు. అందువల్ల, అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎటువంటి అపోహలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
అపోలో ఆసుపత్రి వర్గాలు రజనీకి పలు టెస్టులు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడు రజనీకాంత్ వయస్సు 73 సంవత్సరాలు. ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఆ వయసు ఉన్న వ్యక్తులకు కొన్ని సమస్యలు రావడం సహజం. వయసు రీత్యా వచ్చే ఆరోగ్య పరిస్థితి తప్ప ఆయనకు ఏమీ కాలేదని తమిళ చలన చిత్ర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
విజయదశమికి థియేటర్లలో సందడి చేయనున్న రజనీకాంత్!
Rajinikanth Upcoming Movie: రజనీకాంత్ కొత్త సినిమా పది రోజులలో థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఆయన కథానాయకుడిగా 'జై భీమ్' సినిమా తీసిన టీఈ జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'వేట్టయాన్' (Vettaiyan Movie). ఆయన సరసన మలయాళ కథానాయిక మంజు వారియర్ నటించారు. ఈ సినిమా అక్టోబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది.
Also Read: థియేటర్లలోకి ఈ వారం సందడి - ఒక్క శుక్రవారమే 8 తెలుగు సినిమాలు, ఇంకా...
'జైలర్' తర్వాత రజనీకాంత్ సోలో హీరోగా నటించిన సినిమా కావడంతో 'వేట్టయాన్' మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించారు. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి విలన్ రోల్ చేయగా... రితికా సింగ్, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.