Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode సరయు, మనీషా వాళ్లు కలుసుకొని లక్ష్మీ ఇదంతా చేసిందని శత్రువు అయినా దానికి సెల్యూట్ చేయాలని అనిపిస్తుందని మనీషా అంటుంది. దాన్ని ఎలా అయినా దెబ్బ కొట్టాలని సరయు అంటుంది. లక్ష్మీని సరిగా అంచనా వేయకపోవడం వల్లే ఇదంతా జరిగిందని మనీషా అంటుంది. లక్ష్మీ కన్న కూతురు అయిన లక్కీని అడ్డు పెట్టుకొని గేమ్ ఆడుదామని మనీషా అంటుంది. 


లక్కీతో ఎమోషనల్ గేమ్ ఆడి లక్ష్మీని ఇంటి నుంచి పంపిస్తానని మనీషా అంటుంది. ఇక డ్రైవర్ సంగతి చూసుకోమని మనీషా సరయుతో చెప్తుంది. ఆ డ్రైవర్ ఇంకా స్టేషన్‌లోనే ఉన్నాడని వాడు నోరు విప్పితే మనం బుక్ అయిపోతామని అంటుంది. సరయు మనసులో మునిగేది నువ్వే నేను కాదు అని అనుకుంటుంది. మరోవైపు మిత్ర లక్కీని పడుకో పెడుతుంటాడు. జున్ను ఇంతలో అక్కడికి వచ్చి నేను కూడా నాన్న గుండెల మీద తల పెట్టుకొని పడుకుంటానని దుప్పటిలో దూరి పడుకుంటాడు. మిత్ర ఏమీ అనడు. లక్కీ, జున్ను ఇద్దరూ నాన్నతో ఇలా పడుకోవడం హ్యాపీగా ఉందని అనుకుంటారు. 


లక్కీ: నాన్న మా అమ్మ ఎవరు ఎక్కడుంటుంది.
మిత్ర: ఆ ప్రశ్నలు అడగొద్దని నీకు చెప్పా కదా లక్కీ.
జున్ను: తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని లక్కీ అనుకుంటుంది నాన్న.
లక్కీ: అవును నాన్న చెప్పండి నాన్న ప్లీజ్
మిత్ర: నేను నిన్ను బాగానే చూసుకుంటున్నా కదా లక్కీ ఇంకా మీ అమ్మ గురించి ఎందుకు. 
లక్కీ: ఊరికే తెలుసుకోవాలని ఉంది నాన్న. 
మిత్ర: భాస్కర్ అంకుల్ వాళ్ల ఇంట్లో ఒకావిడ ఉండేది ఆవిడ కూతురే నువ్వు. మీ అమ్మ దేవత లక్కీ. నాకు నిన్ను వరంగా ఇచ్చింది. నువ్వు నా చేతిలోకి వచ్చాక నా కష్టాలు అన్నీ మర్చిపోయాను మళ్లీ మనిషిని అయ్యాను. నీతో పాటు నాకు అప్పుడప్పుడు ఆమె ఎవరో తెలుసుకోవాలి అని ఉంది కానీ దేవతలు వరాలు ఇస్తారు కానీ కనిపించరు. 


ఇంతలో లక్ష్మీ వస్తుంది. మిత్ర పక్కన ఇద్దరు పిల్లల్ని చూసి సంతోషపడుతుంది. జున్నుని లక్ష్మీ పిలిస్తే నేను ఇక్కడే పడుకుంటా నువ్వు ఇక్కడే పడుకో అని జున్ను అంటాడు. వీడికి ప్లేస్ ఇస్తే వీళ్ల అమ్మకి కూడా పిలుస్తున్నాడేంటి అని మిత్ర అనుకుంటాడు. బెడ్ సరిపోదు ఎవరి గదిలో వాళ్లు పడుకుందామని అంటాడు. నాకు ఇరుకుగా పడుకోవడం ఇష్టం లేదు అని లక్ష్మీ అంటుంది. పిల్లలు మాత్రం ఒప్పుకోరు. ఇక జున్ను తాను రాను అని నాన్న దగ్గరే పడుకుంటా అంటే మిత్ర పిల్లలు ఇద్దర్నీ పడుకోపెడతాడు. 


మరోవైపు వివేక్ జానుకి ఏం గిఫ్ట్ ఇస్తాడా అని దేవయాని తెగ టెన్షన్ పడుతూ తిరుగుతుంది. లక్ష్మీ ఏమైందని జానుని అడిగితే ఈవినింగ్ జలక్ ఇచ్చానని అంటుంది. ఇంతలో వివేక్ మళ్లెపూలు పట్టుకొని వస్తాడు. తల్లిని చూసి పూలు దాచేస్తాడు. పువ్వులు  జానుకి ఎలా ఇవ్వాలా అనుకుంటాడు. వివేక్ చేతులు వెనక ఉండటం చూసిన దేవయాని వివేక్‌ని ప్రశ్నిస్తుంది. చేతిలో ఏముందని అడుగుతుంది. వివేక్ చూపించకుండా పువ్వులను అటుగా వస్తున్న మిత్ర వైపు విసిరేస్తాడు. మిత్ర వాటిని పట్టుకుంటాడు.. అది చూసిన జాను కోపంతో రగిలిపోతుంది. మిత్ర దేవయాని రావడం చూసి వాటిని దాచేస్తాడు. వీడేంటి నాకు మల్లెపూలు ఇచ్చాడని అనుకొని లక్ష్మీకి ఇస్తే లక్ష్మీ జానుకి ఇస్తుందని అనుకొని లక్ష్మీ మీదకు పువ్వులు విసిరేస్తాడు. లక్ష్మీ వాటిని చూసి మురిసిపోతుంది. ఇక మనీషా చూసి మిత్ర లక్ష్మీకి పువ్వులు ఇవ్వడం ఏంటని అనుకుంటుంది. 


లక్ష్మీ: నాకు పువ్వులు ఇచ్చారేంటి ఇందుకేనా పిల్లల్ని పైన పడుకోపెట్టి కిందకి వచ్చారు.
మిత్ర: అంతలేదు వివేక్ నా మీదకు విసిరాడు నేను విసిరేశా అయ్యో మనీషా చూసేసిందే.
లక్ష్మీ: చూస్తే ఏంటి మీ భార్యకి మీరు పువ్వులు ఇస్తే తప్పేంటి.
మిత్ర: మనీషా.. మనీషా.. 
మనీషా: చాలు మిత్ర నేను ఇన్నిరోజులు ఏం చూడకూడదు అనుకున్నానో అది చూశా నీ మనసు మనీషా వైపు మళ్లుతుంది.
మిత్ర: అదేం లేదు మనీషా. అవి వివేక్ జాను కోసం తెచ్చిన పువ్వులు పిన్నికి భయపడి నాకు ఇచ్చేశాడు. నేను లక్ష్మీకి ఇచ్చేశా.
మనీషా: అయితే లక్ష్మీ దగ్గర  తీసుకొని తిరిగి వివేక్‌కి ఇచ్చేయ్. లేదంటే నన్ను వదిలేయ్.
మిత్ర: మల్లెపూలు తిరిగి ఇచ్చేయాలి అంతే కదా ఇప్పుడే ఇస్తా


మరోవైపు జాను అలిగి గదిలో కూర్చొని ఉంటుంది. వివేక్ వస్తే కోప్పడుతుంది. నా కోసం పువ్వులు తెచ్చి నాకు ఇవ్వలేదు అని అంటుంది. వివేక్ సారీ చెప్తాడు. మిత్రకి అడిగి పువ్వులు తెస్తానని వివేక్ అంటే ధైర్యంగా నా తలలో పువ్వులు పెట్టిన రోజే నా కోసం పువ్వులు తీసుకురండి అని చెప్తుంది. మరోవైపు మిత్ర లక్ష్మీ గదిలోకి వెళ్లి పువ్వులు ఇవ్వమని అడుగుతాడు. లక్ష్మీ అప్పటికే తలలో పెట్టుకొని ఇవ్వనని అంటుంది. మీరు నాకు ఇచ్చారు కాబట్టి అవి నా పువ్వులు నేను ఇవ్వను అని అంటుంది. మీరు కట్టిన తాళి అయినా పువ్వులు అయినా నా సొంతమే అని అంటుంది. పిల్లలు పైన పడుకున్నారు మనం కింద పడుకుందామా అంటే దానికి మిత్ర నీకు అంత సీన్ లేదు అని వెళ్లిపోతాడు.


ఇక ఉదయం జున్ను లక్కీని నిద్ర లేపితే లక్కీకి ఫుల్‌గా జ్వరం ఉంటుంది. దాంతో మిత్ర, లక్ష్మీతో పాటు అందరూ వస్తారు. సడెన్‌గా ఫీవరేంటి అనుకుంటారు. లక్కీ తనతల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని టెన్షన్ పడి జ్వరం తెచ్చుకుందని జున్ను అంటాడు. లక్ష్మీ లక్కీని సరిగా చూసుకోకపోవడం వల్లే ఇలా అయిందని మనీషా, దేవయాని అంటారు. లక్ష్మీ సరిగా పట్టించుకోకపోవడం వల్లే లక్కీ కన్న తల్లి గురించి బెంగ పెట్టుకుందని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: యమలోకంలో నయని ఆత్మ.. గుమ్మం వైపు చూస్తూ పాప ఏడుపు.. విశాల్ ఎమోషనల్ మాటలు!