Trinayani Serial Today Episode సుమన వచ్చి విక్రాంత్‌ని తన మాటలతో చిరాకు పెట్టిస్తే తన దగ్గర నుంచి వెళ్లకపోతే చితక్కొడతాను అని అంటాడు. దాంతో సుమన వెళ్లిపోతుంది. మరోవైపు ముక్కోటి అత్త కాళ్లు నొక్కుతాడు. నా కాళ్లు నొక్కావు కానీ డబ్బు నొక్కేయొద్దని బామ్మ అంటే మామయ్య చిల్లర నొక్కేస్తాడు కానీ ఆస్తి నొక్కేయడని అంటుంది. ఇక త్రినేత్రి బామ్మకి మందులు ఇచ్చి తన పెళ్లి వరకు బతకాలి అంటే మంచి మందులు వేసుకో అని అంటుంది. ఇక త్రినేత్రి రేపు అడవిలో అమ్మవారి దగ్గరకు వెళ్తానని చెప్తుంది. బామ్మ వద్దని అంటే మామని అత్తని వెంట పెట్టుకొని వెళ్తానని త్రినేత్రి చెప్తుంది. చాటుగా ముక్కోటి, వైకుంఠం మాట్లాడుకుంటారు. రేపు అడవిలో త్రినేత్రిని చంపేయాలని అనుకుంటారు.
అమ్మవారికి ప్రసాదం వండి అందులో విషం కలపమని చెప్తాడు. మరోవైపు హాస్పిటల్‌లో నయని చావు బతుకులతో పోరాడుతుంది. త్రినేత్రిని చంపాల్సిన యమపాశం చిత్ర గుప్తుడి పొరపాటు వల్ల నయనిని చంపడానికి వస్తుంది. ఇక బెడ్ మీద ఉన్న నయని దగ్గరకు యమపాశం వచ్చి తన వెంట రమ్మని నయని ఆత్మని చెప్తుంది. నేను రాను నా భర్తని పిల్లల్ని వదిలి రాను అని నయని ఏడ్చినా వదలకుండా యమపాశం నయనిని తీసుకొని వెళ్లిపోతుంది. మరోవైపు ఇంట్లో విశాల్ గాయత్రీ పాపని పట్టుకొని సోఫా మీదే పడుకుంటాడు. ఇంట్లో అందరూ విశాల్ని లేపుతారు. నయనికి బాగు అయ్యేవరకు తామే చూసుకుంటామని అంటారు.
విశాల్: నయని ఇక్కడ లేదు అమ్మ అయినా నాకు దగ్గరగా ఉంటే నా గుండె ఆగిపోకుండా చూసుకుంటుంది.
హాసిని: విశాల్ నువ్వు అలా మాట్లాడితే తిట్టేస్తా చెప్తున్నా చెల్లి ఏమైనా మనల్ని విడిచిపెట్టి పోయిందా.
తిలోత్తమ: విశాల్ కూడా హాస్పిటల్‌లో ఉండి ఉంటే చూస్తూ ఉండే వాడు.
విక్రాంత్: ఇంకా కళ్లు తెరవని వదినను చూస్తూ బ్రో ఏడుస్తూనే ఉంటే నేనే బలవంతంగా తీసుకొచ్చా.
తిలోత్తమ: నయని ప్రాణాలతో ఉన్నందుకు సంతోషపడాలి.
హాసిని: ఏం నెగిటివ్ మాట్లాడకండి ప్లీజ్.
విశాల్: నయనిని చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేకపోతున్నా.
హాసిని: చెల్లికి ఏం కాదు ఈ గండం నుంచి క్షేమంగా బయట పడుతుంది.
పావనా: నయనమ్మ నిండు నూరేళ్లు సుమంగళిగా ఉంటుంది.
సుమన: ఒకవేళ జరగరానిది జరిగితే.
విక్రాంత్: నువ్వు నోరు మూసుకుంటావా.
సుమన: అన్నింటికి మనసు సిద్ధంగా ఉంచుకోవాలి అనుకుంటున్నా.
విశాల్: నయని శాశ్వతంగా నాకు దూరం అయితే నా బిడ్డల్ని చూసుకునే బాధ్యత హాసిని వదినదే. నయని కోలుకుంటుంది అనే దాకా హాస్పిటల్‌కి కూడా వెళ్లను. ఇక కళ్లు తెరవదు అని తెలిస్తే ఈ జన్మకి నేను కూడా మీ ఎవరికీ కనిపించను. తీసుకో వదిన గాయత్రీ పాపని.
తినేత్రి అత్తమామలతో కలిసి అడవిలో అమ్మవారి దగ్గరకు వెళ్తుంది. నేత్రి అమ్మవారికి చక్కగా రెడీ చేస్తుంది. నీకు పెళ్లి అయితే నువ్వు రాలేవు అని అత్తమామలు అంటారు. నేత్రి అమ్మవారికి హారతి ఇచ్చి నైవేధ్యం పెడుతుంది. మరోవైపు నయని ఆత్మ యమలోకం ప్రయాణిస్తుంది. యమలోకం చూసి నయని ఆత్మ భయపడుతుంది. మొత్తం వింతగా చూస్తుంది. మరోవైపు గాయత్రీ పాప దీనంగా గుమ్మం వైపు చూస్తుంటుంది. గాయత్రీ పాప అలా చూడటం చూస్తే కనీళ్లు ఆగవు. పాపని చూసి పావనా మూర్తి కన్నీళ్లు పెట్టుకుంటాడు. మీ అమ్మ నాకు అమ్మే పాప మీ అమ్మ కొన ఊపిరితో పోరాడుతుందని ఏడుస్తాడు. గాయత్రీ పాప పావనా కనీళ్లు తుడవడంతో పాపని దగ్గరకు తీసుకొని గాయత్రీ అని ఏడుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.