Brahmamudi Serial Today Episode:   ఆఫీసుకు వచ్చిన సీతారామయ్య ఫ్రెండ్ జగదీష్‌ చంద్ర ప్రసాద్‌ ను గుర్తు పట్టి సాదరంగా ఆహ్వానిస్తుంది కావ్య. దీంతో ఆయన ఆశ్చర్యపోతారు. సంవత్సరం తర్వాత వచ్చిన నన్ను గుర్తు పెట్టుకున్నావంటే నువ్వు చాలా గ్రేట్ అంటాడు. కావ్య ఎందుకు వచ్చారని అడుగుతుంది. గుడికి చెందిన నగలు చేయించాలని వచ్చానని డీటెయిల్స్‌ చెప్పి వెళ్లిపోతారు. ఇంతల శృతి వచ్చి రాజ్‌ సార్‌ ఫైల్‌ తీసుకుని ఇంటికి వెళ్లారని చెప్పడంతో కావ్య ఇంటికి వెళ్తుంది.


కావ్య: అమ్మమ్మ గారు మీ మనవడు ఎక్కుడున్నారు.


ఇందిర: ఏమైందమ్మా..


కావ్య: నేను ఆయనతోనే తేల్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మీరు పిలుస్తారా..? నన్ను పిలవమంటారా..?


ఇందిర: రాజ్‌.. రాజ్‌…


రాజ్: ఏంటి..?


కావ్య: మీ ఉద్దేశ్యం ఏంటి…


రాజ్‌: నీ విషయంలోనా..? నా విషయంలోనా..?


కావ్య: కంపెనీ విషయంలో.. సుగుణ కంపెనీ వాళ్లకు డిజైన్స్‌ పంపించకుండా ఆ ఫైల్‌ పట్టుకుని ఇంటికి ఎందుకు వచ్చారు.


రాజ్‌: ఆ కంపెనీతో డీల్‌ చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి.


కావ్య: మీ ఇష్టా ఇష్టాలు ఎవరికి కావాలి ఇక్కడ.. నాకు ఒక మాట చెప్పాలి కదా..? ఎందుకు చెప్పలేదు.


రాజ్‌: నేను నిన్ను ఒక సుపీరియర్‌ గా గుర్తించలేదు కాబట్టి.


కావ్య: అక్కడ నేను ఉన్నానా..? ఇంకొకరు ఉన్నారా..? అన్నది కాదు. ఆ సీటు ఇవ్వాల్సిన గౌరవం మీరు ఇవ్వాలి.


రాజ్‌: నువ్వు నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చావా..? నా ఒపీనియన్‌ కనుక్కున్నావా..? నాతో డిస్కషన్‌ చేశావా..?


అని రాజ్‌ అడగ్గానే నేను ఏది చేయాలనుకున్నా కింది ఉద్యోగులతో చర్చించాల్సిన అవసరం లేదు మిస్టర్‌ మేనేజర్‌ అంటుంది. దీంతో ఈ అహంకారమే నాకు నచ్చదు అంటూ తిడతాడు రాజ్‌.  దీంతో సీతారామయ్య రాజ్‌ను తిడతాడు. కావ్యకు చెప్పకుండా ఆ ఫైల్‌ ఎందుకు తీసుకొచ్చావని అడుగుతాడు. దీంతో రాజ్‌ ఉలకడుపలకడు. ఇంతలో సీతారామయ్య.. కావ్యను ఏమైందని అడుగుతాడు. రాజ్ ఇగో అడ్డొస్తుంది. నన్ను అడగకుండా కావ్యను అడుగుతారేంటి..? అంటాడు. ఇంతలో అందరి మధ్య గొడవ జరగుతుంది. జగదీశ్‌ చంద్ర ప్రసాద్‌ ఆఫీసుకు వచ్చిన విషయం చెప్తుంది కావ్య. రాజ్‌ తానే ఎక్కువ టాలెంట్‌ ఉన్నోడిని అని బిల్డప్‌ ఇచ్చుకుంటాడు.


సీతారామయ్య: సరేరా నువ్వు ఇంతగా నీ గురించి డబ్బా కొట్టుకుంటున్నావు. కావ్య కూడా నీ గురించి మంచి సర్టిఫికెట్‌ ఇస్తుంది కాబట్టి. జగదీశ్‌ చంద్ర ప్రసాద్‌ ప్రాజెక్టు మీద ఇద్దరు విడివిడిగా పని చేయండి. ఎవరి సమర్థత ఏంటో తేలిపోతుంది కదా..?


రాజ్‌: తాతయ్య ఈ డీల్‌ బాగుంది. నాకు నచ్చింది నాకు ఓకే. మీ సీఈవో గారు ఏమంటారో


ఇందిరి: నువ్వేంటి సరే అని చెప్పకుండా సైలెంట్‌ గా నిలబడ్డావు ఏం ఆలోచిస్తున్నావు.


కావ్య: మీ మనవడు నా చేతిలో ఘోరంగా అపజయం పాలైతే ఆయన ఫేస్‌ అనామిక ఫేస్‌ లా మాడిపోతే ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నాను అమ్మమ్మ.


అని చెప్పగానే రాజ్‌ షాక్‌ అవుతాడు. మరీ అంతలా ఊహించుకోకు. నీ సామర్థ్యం ఏంటో నువ్వు ఇంటికి వచ్చి నా టాలెంట్‌ గురించి చెప్పినప్పుడే అర్థం అయింది. అంటాడు రాజ్‌. దీంతో కావ్య కూడా చాలెంజ్‌ చేస్తుంది. నేను ఎవరి సాయం లేకుండా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాను అంటుంది.


సుభాష్‌: ఉత్త పందేమే అయితే కిక్‌ ఏముంది. ఇద్దరిలో గెలిచేవారెవరో వారికి ఏదైనా బహుమతి ఉండాలి కదా..?


సీతారామయ్య: తప్పకుండా ఉంటుంది సుభాష్‌. ఆ ప్రసాద్‌ కాంట్రాక్ట్ ను ఎవరైతే మన కంపెనీకి వచ్చేటట్టు చేస్తారో వారినే సీఈవో గా కూర్చోబెడతాను.


అనగానే అందరూ చప్పట్లు కొడతారు. ఇంతలో రాజ్‌ నేను ఓడిపోతే కళావతిని భార్యగా ఒప్పుకుని ఇంటికి తీసుకొస్తాను అంటాడు. మరి కళావతి ఓడిపోతే ఏం చేస్తుంది. అని అడుగుతాడు. దీంతో అది కూడా నువ్వు చెప్పు అంటారు. కళావతి ఓడిపోతే జీవితంలో ఆఫీసు ముఖం చూడకూడదు అంటాడు రాజ్‌. సరేనని అందరూ వెళ్లిపోతారు. తర్వాత కావ్య ఈ పందెం తనకు నచ్చడం లేదని ఇందిరకు చెప్తుంది. ఆయన ఓడపోయినా నేను ఓడిపోయినట్టేనని అంటుంది. దీంతో సీతారామయ్య, ఇందిర, అపర్ణ ముగ్గురు కలసిఇ కావ్యను కన్వీన్స్‌ చేస్తారు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!