అనామిక కళ్యాణ్ ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఒక అమ్మాయి ఇంటి వరకు వచ్చిందంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేడా? ఈ ముద్దపప్పు చెప్పేలోపు మనమే ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది. తండ్రి సుబ్బు వచ్చి కూతురు మొహం వెలిగిపోతుందని అంటాడు. ఏంటి ప్రపోజ్ చేయబోతున్నావా? అంటూ అడిగేస్తాడు. డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటానని చెప్పేయ్ అని సలహా ఇస్తాడు. అప్పు కళ్యాణ్ కి ఫోన్ చేసి పని ఉంది రమ్మని పిలుస్తుంది. మొన్నటిలాగా హ్యాండ్ ఇస్తే బాగోదని వార్నింగ్ ఇస్తుంది. అప్పు ఫోన్ పెట్టేయగానే కళ్యాణ్ కి అనామిక మెసేజ్ చేస్తుంది. కలుద్దామని అంటే విషయం ఏంటని అడుగుతాడు. తన లైఫ్ కి సంబంధించిన విషయం మాట్లాడాలని అనేసరికి కళ్యాణ్ తప్పకుండా వస్తానని మాట ఇచ్చేస్తాడు. లైఫ్ కి సంబంధించినది అంటే తప్పకుండా ప్రపోజ్ చేయబోతుందని అనుకుంటాడు.


భోజనం చేయడానికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర అపర్ణ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ తను మాత్రం వచ్చి ఇంట్లో వాళ్ళతో కలిసి కూర్చోకుండా వేరుగా కూర్చుంటుంది.


ఇంద్రాదేవి: ఇక్కడ అన్నీ సిద్ధం చేసి ఉంటే నువ్వు అక్కడ కూర్చున్నావ్ ఏంటి


అపర్ణ: ఇక నుంచి నా వంట నేనే చేసుకుంటా ఎవరో వండింది తినాల్సిన అవసరం నాకు లేదు


ఇంద్రాదేవి: ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు


Also Read: తొలగిపోయిన అడ్డుతెరలు- మురారీ మనసులో తనకే స్థానమని తెలుసుకున్న కృష్ణ


రుద్రాణి: వదిన వేరు కుంపటి పెట్టుకున్నా అని చెప్తుంది. కావ్య చేసిన పనికి వదిన ఈ పని చేసిందని ఆవేశంగా చెప్తుంది


రాజ్: అమ్మని ఎలాగైనా ఆపండి లేదంటే గొడవ పెద్దదై తాతయ్య టెన్షన్ పడతారని మెల్లగా చెప్తాడు


ఇంద్రాదేవి: ఈ ఇంటి పెద్ద కోడలిగా ఈ తరం వాళ్ళకి ఏం చెప్తున్నావ్. గొడవ అయితే విడిపొమ్మని అంటున్నావా?


సీతారామయ్య: ఇంటికి మార్గదర్శివి నువ్వు. గొడవ పెద్దది చేసుకుంటూ పోతే ఎలా


అపర్ణ: నేను తీసుకున్న నిర్ణయం నా కొడుక్కి తప్పుగా అనిపించింది. నేను అందరితో కలిసి తినలేను. ఏవండీ మీకు కూడా కలిపే వండాను రండి కలిసి తిందాం


శుభాష్: వేరు కుంపటి పెట్టి భోజనం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావేమో కానీ ఇంటి పెద్ద కొడుకుగా నేను సిద్ధంగా లేను. కావాలంటే నేను ఇక్కడ భోజనం చేయకుండా ఉంటాను


అపర్ణ: ఎవరు నావైపు ఉన్నా లేకపోయినా నా నిర్ణయం మార్చుకోను


ఇంద్రాదేవి: అయితే దానితో పాటు మరో నిర్ణయం కూడా తీసుకోవాల్సిందే అనేసి కోపంగా లోపలికి వెళ్ళి డాక్యుమెంట్స్ తెచ్చి అపర్ణ ముందు పడేస్తుంది. విడిపోవాలని అనుకున్నప్పుడు వంటింట్లో మాత్రమే ఎందుకు ఇంట్లో కూడా విడిపోవాలి. ఆస్తులు పంచుకుని ఎవరికి వారు విడిపోండి. విడిపోవాలని ఆలోచన క్యాన్సర్ లాంటిది ఒకసారి వస్తే అది శరీరం అంతా పాకినట్టు విడిపోవాలనే ఆలోచన అందరికీ వస్తుంది.


అపర్ణ: నేనేం తప్పు చేశాను. ఈ ఇంట్లో నా మాటకి విలువ లేదని బాధపడటం కూడా తప్పేనా


ఇంద్రాదేవి: తప్పు లేదు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అనేసి అందరూ వెళ్లిపోతారు. రాజ్ తల్లి దగ్గరకి వెళ్ళి మాట్లాడేందుకు చూస్తే కంటి చూపుతోనే బెదిరించేస్తుంది. మనసుకి నచ్చినట్టు కోరుకున్న దాని కంటే బాగా జరిగిందని రుద్రాణి మనసులో తెగ సంబరపడిపోతుంది. ఆస్తి పేపర్స్ చూపిస్తే మనసు మార్చుకుంటానని అనుకుంటున్నారని ఆవేశంగా భోజనం పెట్టుకుని తినబోతూ ఆగిపోయి కావ్యని చూసి చీదరింపుగా వెళ్ళిపోతుంది. రాజ్ ఇంద్రాదేవి దగ్గరకి వెళ్ళి మనసులో బాధ పంచుకుంటాడు. ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా అమ్మ ఎప్పుడు అలా అనుకోలేదు. కానీ ఈరోజు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే ముందు ముందు ఇది ఎక్కడకి దారి తీస్తుందోనని భయంగా ఉందని అంటాడు. వాళ్ళ మాటలు కావ్య వింటుంది.


Also Read: రాజ్ ప్రవర్తనకి తల్లడిల్లిన తల్లి హృదయం- స్వప్న ఏమైంది - ఆందోళనలో కనకం


ఇంద్రాదేవి: కావ్య తప్పు చేసిందని మీ అమ్మ అనుకుంటుంది. ఈ విషయంలో నువ్వు కూడా తనకి వ్యతిరేకంగా మాట్లాడేసరికి తట్టుకోలేకపోతుంది


రాజ్: కళావతి నిజంగా తప్పు చేస్తే సపోర్ట్ చేసేవాడిని కాదు. కానీ తను ఒక మంచి పని చేసింది అది కూడా నన్ను అడిగే చేసింది. అలాంటప్పుడు నేను అమ్మని సపోర్ట్ చేసి ఎలా మాట్లాడతాను. రేపు తను నిజంగా తప్పు చేస్తే నేను నిలదీయగలనా? అలా ఆపితే మీ అమ్మకో నీతి నాకొక నీతి అంటే ఏం చేయను


ఇంద్రాదేవి: ఇది ప్రతి ఇంట్లో జరిగేదే. పాతికేళ్లు ప్రేమగా పెంచుకున్న కొడుకు ఎదురుతిరిగితే తట్టుకోలేకపోతుంది.


రాజ్: ఈ సమస్యని నువ్వే పరిష్కరించాలి నానమ్మ. ఇప్పుడు ఇవి నువ్వే ఆపగలవు


గొడవ తన వల్ల జరిగింది కాబట్టి తనే ఏదో ఒకటి చేయాలని కావ్య అపర్ణ దగ్గరకి మాట్లాడేందుకు వెళ్తుంది. తనని చూడగానే అపర్ణ వెళ్లిపోతుంటే కావ్య ఆపుతుంది.


కావ్య: అత్తయ్య మీరంటే నాకు చాలా గౌరవం. మీరు పనిమనిషి విషయంలో తీసుకున్న నిర్ణయం నాకు తెలియదు. తెలిస్తే అసలు ఆ నిర్ణయం తీసుకునేదాన్ని కాదు


అపర్ణ: జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నాకు నా కొడుక్కి మధ్య దూరం పెంచావ్. అయినా నాతో నీకు పనేంటి


కావ్య: నా వల్ల మీ తల్లీకొడుకుల మధ్య పొరపొచ్చాలు రావడానికి వీల్లేదు. అందుకే మీతో నిజం చెప్పడానికి చూస్తున్నా


అపర్ణ: అవసరం లేదు, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అందరినీ నీవైపు తిప్పుకోవాలని అనుకున్నావ్ తిప్పుకున్నావ్


తరువాయి భాగంలో..


అపర్ణ వినిపించుకోకుండా వెళ్లిపోతుంటే కావ్య తెలివిగా తన మనసు మారుస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని దాటి ఎవరూ నన్ను ఒప్పుకున్నది లేదు ఇప్పుడు మీరు నన్ను దూరం పెడితే మీ కుటుంబానికి వేరు కుంపటి పెడితే వాళ్ళ దగ్గర నాకు కావాల్సిన సానుభూతి దొరుకుతుంది. మీ అబ్బాయి కూడా నా తప్పు లేదని అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయన నాకే దగ్గర అవుతారని చెప్తుంది. పొద్దున్నే అపర్ణ కావ్యని పిలిచి ఇంట్లో ఎవరికీ కాఫీ ఇచ్చావా అని అడుగుతుంది. అపర్ణ మామూలుగా ఉండటం చూసి ఇంట్లో అందరూ సంతోషపడతారు.