బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu Season 7)లో మొదటిగా అడుగుపెట్టిన అందరు కంటెస్టెంట్స్ ప్రేక్షకులకు అంతగా సుపరిచితమేమీ కాదు. అందులో కొందరు సీనియర్లు మాత్రమే చాలామంది ప్రేక్షకులకు తెలుసు. కానీ ఒక్కొక్కరుగా ఆ సీనియర్ కంటెస్టెంట్స్ అంతా వెళ్లిపోతున్నారు. ముందుగా మొదటి వారంలో సీనియర్ నటి కిరణ్ రాథోడ్.. హౌజ్‌ను విడిచి వెళ్లిపోగా.. రెండోవారంలో మరో సీనియర్ నటి షకీలా బిగ్ బాస్‌ను వదిలి వెళ్లిపోయారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. హౌజ్‌లో ఉన్నంత వరకు దాదాపుగా అందరు కంటెస్టెంట్స్‌తో బాగానే ఉన్న షకీలా.. బయటికి వచ్చిన తర్వాత మాత్రం ప్రశాంత్, రతికపై షాకింగ్ కామెంట్స్ చేసింది.


షకీలా.. బిగ్ బాస్ సీజన్ 7లో ఒక గోల్‌తో అడుగుపెట్టానని అన్నారు. అది సాధించుకోవడానికి కష్టపడు అని తన సన్నిహితులు కూడా చెప్పి పంపారు. కానీ అక్కడ ఉన్న జూనియర్ కంటెస్టెంట్స్‌కు షకీలా.. అమ్మలాగా మారగలిగింది తప్పా.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే విషయంలో ఫెయిల్ అయ్యింది. హౌజ్‌లో ఉన్న ఈ రెండు వారాలు కంటెస్టెంట్స్‌తో షకీలాకు పెద్దగా గొడవలు లేవు. అందుకే వెళ్లేముందు కూడా అందరి గురించి మంచిగానే చెప్తూ వెళ్లిపోయింది. కంటెస్టెంట్స్ అందరిలో ఫ్రెండ్లీ ఎవరు అంటూ ప్రియాంక అని చెప్పింది షకీలా. అందరిలో ఎక్కువగా అసూయ ఎవరికి ఉంది అని అడగగా.. అందరికీ ఉంది అంటూ సమాధానమిచ్చింది. పొగరు అనే ట్యాగ్ ఎవరికి ఇస్తారు అంటే యావర్ అని చెప్పింది. యావర్‌కు, షకీలాకు ముందు నుండే మనస్పర్థలు వచ్చాయి. హౌజ్‌లో షకీలా ఎవరితో అంత చనువుగా ఉండరు అంటే బిగ్ బాస్ ఫాలో అయ్యే ప్రేక్షకులు.. టక్కున యావర్ అని చెప్పేయగలరు. కంటెస్టెంట్స్‌లో అందరికంటే పల్లవి ప్రశాంత్‌కే ఆవేశం అని ముద్రవేసింది. అందరిలో తను దామినినే ఎక్కువగా నమ్ముతానని చెప్పింది. రతికకు స్టోన్ హార్ట్ అని ట్యాగ్ ఇచ్చింది. షకీలా వెళ్లిపోతుందని హౌజ్‌లో అందరూ ఎమోషనల్ అవ్వగా.. పెదవే పలికిన అనే పాట పాడి షకీలాను ఎమోషనల్ చేసింది దామిని.


బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లగానే షకీలా ‘బిగ్ బాస్’ బజ్‌ ఇంటర్వ్యూ‌లో పాల్గొంది. ఈ సందర్భంగా తనతోపాటు హౌస్‌లో ఉన్నసభ్యుల మనస్తత్వాల గురించి చెప్పారు.  ‘‘మీరు ఆశ్రమానికి వెళ్లానని అనుకుంటున్నారా? బిగ్ బాస్ హౌజ్‌కు వెళ్లానని అనుకుంటున్నారా?’’ అంటూ గీతూ అడిగిన ప్రశ్నకు షకీలా సీరియస్ అయ్యింది. ‘‘శివాజీ బ్యాచా? సీరియల్ బ్యాచా’’ అన్న ప్రశ్నకు కూడా సీరియస్ అయ్యింది. ‘‘షకీలా హౌజ్‌లో రియల్‌గా ఉన్నారా? ఫేక్‌గా ఉన్నారా’’ అని అడగగా.. తానేం ప్లాన్ చేయలేదని చెప్పింది. ‘‘అసలు బిగ్ బాస్ హౌజ్‌కు ఎందుకు వచ్చారు’’ అంటే.. ‘‘వారు పిలిచారు, నేను వచ్చాను’’ అంటూ సూటిగా సమాధానమిచ్చింది. గోల్ అంటూ ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది.


ఆ తర్వాత హౌజ్‌లో ఉన్న ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి తన అభిప్రాయం బయటపెట్టింది షకీలా. శోభా శెట్టి.. హౌజ్‌లో ఒక మాస్క్‌తో ఉందని చెప్పింది. అమర్‌దీప్.. ఏదైనా చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేడు అంటూ కామెంట్ చేసింది. ప్రిన్స్ యావర్‌ను వెధవ అని, బాడీ పెట్టుకొని ఎక్కడికో వెళ్లిపోతాను అనుకోవడం కరెక్ట్ కాదంటూ సూటిగా తన అభిప్రాయాన్ని చెప్పేసింది. పల్లవి ప్రశాంత్ యాటిట్యూడ్‌ను తప్పుబట్టింది. పాపులారిటీ అనే డ్రగ్‌కు తన అలవాటు పడ్డాడని చెప్పింది. సందీప్ మాత్రమే అక్కడ ఉండాల్సిన అర్హుడు అని స్టేట్మెంట్ ఇచ్చింది. శివాజీని తన సొంత అన్నలాగా భావిస్తున్నాను అని చెప్పింది షకీలా. రతికను పాముతో పోల్చింది. తను కళ్లలో కళ్లు పెట్టి ఎవరినీ చూడదని, అలా చూస్తే దొరికిపోతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. షకీలాను సేఫ్ గేమ్ అని గీతూ కామెంట్ చేయగా.. ‘‘నేను చస్తే వీరంతా రావాలి’’ అంటూ చివరిగా స్టేట్‌మెంట్ ఇచ్చింది షకీలా.


Also Read: నేనే కొంచెం ఎక్కువ అర్హుడిని అంటూ యావర్ వ్యాఖ్యలు - సీరియస్ అయిన నాగార్జున