Krishna Mukunda Murari September 16th: ఇల్లంతా సైలెంట్ గా ఉండటంలో భవానీ రేవతిని పిలిచి ఎవరూ నిద్రలేవలేదా అంటుంది. కృష్ణ ఎక్కడ అంటే తను పొద్దున్నే ఏదో ఎమర్జెన్సీ అనేసి హాస్పిటల్ కి వెళ్ళింది. మురారీ నిద్రలేచి ఉంటాడని కాఫీ ఇచ్చి వస్తున్నానని ముకుంద భవానీకి చెప్తుంది. మీకు కూడా కాఫీ తీసుకురమ్మంటారా అంటుంది.


భవానీ: నీకు కాఫీ పెట్టడం కూడా వచ్చా


ముకుంద: ఆయన కోసం ఇప్పటి నుంచి అన్నీ నేర్చుకుంటున్నా


భవానీ: ఇన్నాళ్లకి నీకు జ్ఞానోదయం అయ్యిందా? నీకంటే వెనుక వచ్చిన కృష్ణ చాలా సార్లు రేవతికి హెల్ప్ చేసింది


ఆదర్శ్ కోసం కాదు మురారీ కోసం అన్నీ పనులు చేయాలని అనుకుంటుందని రేవతి మనసులో తిట్టుకుంటుంది. ఇప్పటికైనా ఇంటి బాధ్యతలు తెలుసుకున్నావ్ మంచిదని భవానీ మెచ్చుకుంటుంది. రేవతి వద్దని చెప్పినా కూడా భవానీ మంచి నిర్ణయం తీసుకున్నావ్, ఆదర్శ్ ని త్వరగా తీసుకొచ్చే బాధ్యత తనదని అంటుంది. ఇంటి బాధ్యతలు తనకి అప్పగించమని రేవతికి చెప్తుంది. మురారీకి నేను చేసే సేవలు చూసి కృష్ణ తనంతట తానుగా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని ముకుంద కన్నింగ్ ప్లాన్ వేస్తుంది. కృష్ణ హాస్పిటల్ కి త్వరగా వచ్చేసరికి అందరూ పలకరిస్తూ ఉంటారు. డల్ గా వెళ్ళి తన క్యాబిన్ లో కూర్చుంటుంది.


కృష్ణ గతంలో ముకుంద తన ప్రేమకి సంబంధించి చెప్పిన విషయాలన్నీ గుర్తు చేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు. ఆ ఇంట్లో ఉండాలని అనిపించడం లేదు. కానీ ఎందుకు ఉంటున్నానో అర్థం కావడం లేదు. నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని బాధపడుతూ ఉండగా పరిమళ వచ్చి పలకరించి ఇంట్లో ఏమైనా గొడవ అయ్యిందా అంటుంది.


కృష్ణ: గొడవ పడ్డామని ఏసీపీ సర్ చెప్పారా?


పరిమళ: లేదు


Also Read: రాజ్ ప్రవర్తనకి తల్లడిల్లిన తల్లి హృదయం- స్వప్న ఏమైంది - ఆందోళనలో కనకం


కృష్ణ: మరి మీకు ఎలా అనిపించింది


పరిమళ: పెళ్ళయిన వాళ్ళు ఇంత త్వరగా ఆఫీసుకి వచ్చారని అంటే కారణం ఇంట్లో గొడవ అయితేనే. అసలు విషయం చెప్పలేదే ఇంట్లో ఏదైనా గొడవ పడ్డారా?


కృష్ణ: పరిమళ ఏసీపీ సర్ ఫ్రెండ్స్ కదా ముకుంద మ్యాటర్ తెలిసి ఉంటుంది కదా అనుకుని ఏసీపీ సర్ ఎప్పటి నుంచి తెలుసని అడుగుతుంది


పరిమళ: ఎందుకు తన మీద ఏమైనా డౌట్ గా ఉందా? ప్రేమ ఉన్న వాళ్ళకి అనుమానం కూడ ఉంటుంది. అందులో తప్పేమీ లేదు. మీ వారి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను చెప్తాను


కృష్ణ: డౌట్ కాదు చిన్న క్లారిఫికేషన్


అప్పుడే మురారీ వస్తాడు. మీ ఆయన వచ్చాడు కదా తననే అడుగు అంటుంది. ఏంటి ఏదో క్లారిఫికేషన్ అంటుంది ఏమైందని అంటాడు. కనీసం మెసేజ్ కూడా చేయకుండా ఇలా వచ్చేశావ్ ఏంటని అడుగుతాడు. ఎమర్జెన్సీ కేసు ఉంటే వచ్చేశానని అబద్ధం చెప్పి కవర్ చేయాలని చూస్తుంది.


మురారీ: ఈ మధ్య నువ్వు ఎప్పుడు ఎలా ఉంటున్నావో అర్థం కావడం లేదు. ఎందుకు నేనంటే అంత కోపం


కృష్ణ: నాకు ఎవరి మీద కోపం లేదు


మురారీ: నిజంగా చెప్తున్నావా?


కృష్ణ: నేను ఎప్పుడూ నిజమే చెప్తాను. నిజం దాచను


ముకుంద వల్ల కాపాడగలిగేది నువ్వు ఒక్కదానివేనని మురారీ అనుకుంటాడు.


కృష్ణ: యుద్ధం అయిపోగానే చాలా మంది లీవ్స్ మీద ఇంటికి వచ్చారంట. మరి ఆదర్శ్ ఎందుకు ఇంటికి రావడం లేదు


ముకుంద విషయం కృష్ణకి తెలిసిపోయిందా అని మురారీ అనుమానపడతాడు. కృష్ణ బయటకి వెళ్ళిపోయి కుమిలి కుమిలి ఏడుస్తుంది. అందరి ముందు మురారీకి భార్యలాగా సేవలు చేస్తానని ముకుంద అనుకుంటూ ఉండగా రేవతి వచ్చి తిడుతుంది.


ముకుంద; ఆయన అంటే నా దృష్టిలో మురారీ. ఆదర్శ్ ఎవరో నాకు తెలియదు


Also Read: తారాస్థాయికి చేరిన సవతి పోరు - తులసిని హనీకి దూరంగా ఉండమన్న నందు


రేవతి: ఇలా చెప్పడానికి సిగ్గుగా లేదా? ప్రేమ అనే భ్రమలో నీ కళ్ళు మూసుకుపోయాయి. కృష్ణ విషయంలో నువ్వు చేసేది తప్పని అనిపించడం లేదా? తనని మోసం చేస్తున్నానని అనిపించడం లేదా?


ముకుంద: అనిపించడం లేదు. ఇన్నాళ్ళూ అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పకుండా కృష్ణ వాళ్ళు నిజమైన భార్యాభర్తలుగా నటించడం మోసం కాదా? త్యాగం పేరుతో తన స్వార్థం కోసం నాకు నచ్చని పెళ్లి చేసుకోవడం అన్యాయం కాదా?


తరువాయి భాగంలో..


ముకుంద, మురారీ మాట్లాడుకుంటూ ఉంటారు. 'నువ్వు నన్ను మోసం చేసి నీ జీవితంలో నాకు తప్ప వేరొకరికి స్థానం ఉండదని మాట ఇచ్చి ఇప్పుడు నాకు అన్యాయం చేశావని' ముకుంద అంటుంది. వాళ్ళ మాటలు అటుగా వచ్చిన కృష్ణ ఆగి వింటుంది. 'నువ్వు ఇక ఈ జన్మలో మారవు. నిన్ను మార్చాలని అనుకోవడం నా బుద్దిలేనితనం. ప్లీజ్ ముకుంద నువ్వు నా ప్రాణ స్నేహితుడి భార్యవి, నిన్ను ప్రేమించలేను. నా మనసులో ఎప్పటికీ కృష్ణ ఉంటుందని' తేల్చి చెప్పేస్తాడు. ఆ మాట విని కృష్ణ చాలా సంతోషపడుతుంది.