మామూలుగా ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో ఇద్దరు కంటెస్టెంట్స్‌తో లవ్ ట్రాక్‌ను నడిపించే ప్రయత్నం చేస్తారు బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యి దాదాపు రెండు వారాలు అవుతున్నా.. ఇంకా ఆ కపుల్ ఎవరు అనేది ప్రేక్షకులకు క్లారిటీ రావడం లేదు. మొదటి కొన్నిరోజుల పాటు రతిక, పల్లవి ప్రశాంత్ ఒక పెయిర్ అనిపించేలా చేస్తున్నారు అనుకున్నారు ప్రేక్షకులు. కానీ రెండోవారం నామినేషన్స్‌లో వీరిద్దరి మధ్య జరిగిన గొడవ వల్ల పూర్తిగా వీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. ఇక తాజాగా విడుదలయిన బిగ్ బాస్ ప్రోమోలో ప్రిన్స్ యావర్.. రతికతో కనెక్ట్ అయినట్టుగా చూపించారు. దీంతో మరో లవ్ ట్రాక్ సిద్ధమవుతుందా? లేదా డ్రామానా అని ప్రేక్షకులు సందేహపడుతున్నారు.


రతిక, యావర్ మధ్య ప్రేమ సంభాషణ..
తాజాగా విడుదలయిన బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో.. రతిక, ప్రిన్స్ యావర్ మధ్య సంభాషణతో మొదలయ్యింది. బిగ్ బాస్‌తో మాట్లాడిన తర్వాత కూల్ అయ్యాడు అని యావర్‌ను ఉద్దేశించి చెప్పింది రతిక. ఆ మాటకు ‘ఐ లైక్ యూ రతిక’ అన్నాడు అన్నాడు యావర్. రతిక కూడా ‘ఐ లైక్ యూ టూ’ చెప్పింది. యావర్‌ను అన్వర్ అని పిలుస్తూ ఏమవుతుంది అని అడిగింది రతిక. దానికి సమాధానంగా ‘ప్రేమ బయటికొస్తుంది’ అన్నాడు యావర్. ఈ సంభాషణ అంతా శివాజీ, పల్లవి ప్రశాంత్ ముందే జరిగింది. పైగా ఈ ప్రోమోకు ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేసి.. మామూలుగా ఉన్న ప్రోమోను లవ్ ఫీల్‌తో నింపేశారు. ఆ తర్వాత ప్రోమో అంతా మళ్లీ గొడవలతో నిండిపోయింది.


సందీప్ చేతికి పవర్..
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా కిచెన్‌లో ఉంది వంట చేస్తుండగా.. ‘రోజూ నేను ఒక్కడినే 25, 30 చపాతీలు చేస్తున్నా’ అన్నాడు సందీప్. దానికి యావర్ రియాక్ట్ అయ్యాడు. ‘నేను నీకు చెప్పానా నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు’ అని సీరియస్ అయ్యాడు సందీప్. ‘నా ఇష్టం’ అంటూ గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ‘నువ్వు నన్ను వేలెత్తి చూపించావు’ అని యావర్ కూడా సీరియస్ అయ్యాడు. ‘నీతో చెప్పట్లేదు, నీకు తెలుగు అర్థం కాదు, నీతో నాకు వర్కవుట్ అవ్వదు’ అని ముక్కుసూటిగా చెప్పేశాడు సందీప్. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన రెండు ప్రోమోలలో ప్రిన్స్ యావర్ ఎవరో ఒకరితో గొడవపడుతూ ప్రేక్షకుల దృష్టిలో పడాలని చూస్తున్నట్టు అర్థమవుతోంది. 
ఇంతలోనే రెండో పవర్ అస్త్రా కోసం పోటీ గురించి బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌కు వివరించడం మొదలుపెట్టారు. మాయాస్త్రం సాధించి పవర్ అస్త్రా కోసం పోటీపడుతున్న వారి లిస్ట్‌లో శివాజీ, షకీలా ఉన్నారు. అయితే ఆ ఇద్దరిలో ఒకరు పవర్ అస్త్రాను సొంతం చేసుకుంటారని ఫిక్స్ అయిపోయి ఉండగా.. ఇంతలోనే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చారు. పవర్ అస్త్రా కోసం మరో కంటెస్టెంట్ కూడా పోటీపడవచ్చని, ఎవరు పోటీపడాలి అనే విషయం సందీప్ నిర్ణయించాలని బిగ్ బాస్ తెలిపారు. ఇలాంటి ట్విస్ట్ అసలు ఊహించని కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇద్దరే పోటీపడాలని ఫిక్స్ అయిన తర్వాత మూడోవాడు ఏంటి అని శివాజీ కూడా అసహనం వ్యక్తం చేశాడు. 


తలుపులు తీయండి వెళ్లిపోతాను..
సందీప్.. తన నిర్ణయాన్ని బిగ్ బాస్‌తో చెప్పాడు. అది నచ్చని శివాజీ.. ‘ఆ నలుగురు కలిసి ఆడుతున్నారు. తలుపు తీయండి నేను వెళ్లిపోతాను’ అని షకీలాతో అన్నాడు. ఎవరు గట్టిగా అరుస్తారో పవర్ అస్త్రా వారికే దక్కుతుంది అనే టాస్క్‌ను కంటెస్టెంట్స్‌కు ఇచ్చినట్టు ప్రోమోలో తెలుస్తోంది. మొత్తంగా ఈరోజు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో రెండో పవర్ అస్త్రా ఎవరికి దక్కుతుంది అనే విషయం బయటపడుతుంది. 



Also Read: అందుకే ‘లియో’ మూవీని రిజెక్ట్ చేశా, విజయ్‌ సినిమాకు దర్శకత్వం వహిస్తా: విశాల్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial