బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పల్లవి ప్రశాంత్ పేరు మార్మోగిపోతోంది. ఒక సాధారణ రైతుబిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. ఇక హౌస్ లో మొదటి వారం లవ్ ట్రాక్ వల్ల ప్రశాంత్ పేరు బాగా వినిపించింది, ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ అతన్ని టార్గెట్ చేయడంతో ఆడియన్స్ అంతా ప్రశాంత్ పై సింపతి చూపిస్తున్నారు. బయట ఇతనికి ఈ రేంజ్ లో సపోర్ట్ వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఇప్పుడు ఈ రైతుబిడ్డ బయట ఓ బ్రాండ్ అయిపోయాడు.


పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రశాంతి తల్లి మాట్లాడుతూ.. ప్రశాంత్ బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చాక పెళ్లి చేస్తామని తెలిపారు. ఈరోజు తన కొడుకు బిగ్ బాస్ లోకి వెళ్లడానికి ఎంతోమంది సపోర్ట్ చేశారని, అందరూ సపోర్ట్ చేయడం వల్ల తన కొడుకు ఇప్పుడు హౌస్ లో ఉన్నాడని పేర్కొన్నారు.


మీ కొడుకు అనుకున్నది సాధించి బిగ్ బాస్ లోకి వెళ్లడం పట్ల మీకేమనిపిస్తుందని? ప్రశాంత్ తల్లిని అడిగితే ఆమె మాట్లాడుతూ.. "నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా కొడుకు తిండి లేకచాలా ఇబ్బందులు పడ్డాడు. నా కొడుకు ఓ పాట తీస్తే వేరే వాళ్లు దాన్ని అమ్ముకున్నారు. ఆ విషయంలో నా కొడుకు చాలా బాధపడ్డాడు. తర్వాత అప్పు చేసి నా కొడుకుకి ఓ ఫోన్ కొనిచ్చాను. ఆ ఫోన్లో తీసిన వీడియోల వల్ల ఈరోజు నా కొడుకుకి బిగ్ బాస్ కి వెళ్ళాడు. ఆ ఒక్క ఫోన్ తోటి నా కొడుకు జీవితం మారింది" అని అన్నారు.


ఆ తర్వాత పెళ్లి గురించి మాట్లాడుతూ.. "నాకు ఆరోగ్యం మంచిగా లేదు పెళ్లి చేసుకో బిడ్డ, కోడలైన ఇంట్లో పని చేస్తది, నాకు అసలు చేతకావడం లేదని చెప్తే, అమ్మ నేను ఇంత కష్టపడ్డా. సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటా, అప్పటివరకు నువ్వు పెళ్లి ముచ్చట మాట్లాడకు. నువ్వు పెళ్లి మాట ఎత్తితే నేను ఇంట్లోకి కూడా రాను అని చెప్పడంతో నేను కూడా ఊరుకున్నా. సరే కష్టపడుతున్నాడు కదా, వాడి భవిష్యత్తు మేమెందుకు నాశనం చేయాలని మేము కూడా అప్పటినుంచి పెళ్లి గురించి అడగడం మానేసాం. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కచ్చితంగా మా కొడుకుకి పెళ్లి చేస్తాం" అని ప్రశాంత్ తల్లి చెప్పింది.


హౌస్ లో రతికతో కలిసి ఉంటున్నాడు. కలిసి తింటున్నాడు. దాని గురించి ఏమంటారని అడిగితే.. "ఆమె మా కొడుకుని వాడుకుంది. నేను పల్లవి ప్రశాంత్‌తో ఉంటే ఆయనకు వచ్చే ఓట్లు కూడా నాకు వస్తాయని వాడుకుంది. అంతే తప్ప వేరే ఏం లేదు. మా కొడుకు కూడా అందరిని అక్కా, చెల్లె అనే ఉద్దేశంతోనే చూస్తాడు. ఇక ఇంట్లో ఎలా ఉంటున్నాడో హౌస్ లో కూడా అలాగే ఉంటున్నాడు. ఎటువంటి మార్పు లేదు. మా కొడుకు బిగ్ బాస్ లో గెలిచినా, గెలవకున్నా అక్కడిదాకా వెళ్లి నాగార్జున సార్ ని కలవడం అదే మాకు గొప్ప" అని పల్లవి ప్రశాంత్ తల్లి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.


Also Read : అందుకే ‘జవాన్’లో గుండుతో కనిపించా, అసలు విషయం చెప్పిన షారుఖ్






Join Us on Telegram: https://t.me/abpdesamofficial