బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో షారుక్ డిఫరెంట్ గెటప్స్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా మునుపెన్నడూ కనిపించిన విధంగా జవాన్ లో గుండుతో కనిపించి షాప్ ఇచ్చాడు. అయితే సినిమాలో ఈ గుండు లుక్ గురించి, కొన్ని సన్నివేశాల్లో ఆంటీ హీరోగా నటించడం, గర్ల్ స్క్వాడ్ ఉంటడం తదితర అంశాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 'జవాన్'లో గుండుతో నటించాలని తెలియగానే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అని అడిగిన ప్రశ్నకు ‘‘కేవలం సోమరితనం కారణంగానే సినిమాలో ఆ లుక్‌ను ఎంచుకున్నా’’ అని షారుక్ చెప్పారు.


"ఈ లుక్ స్క్రిప్ట్ లో భాగమే కాదు. స్క్రిప్ట్ లో ఉన్న గెటప్స్‌లో ఒక భాగం మాత్రమే. బద్ధకం వల్లే నేను ఈ గుండు లుక్‌ను ఎంచుకున్నాను. ఎందుకంటే ఇలాంటి లుక్ సెలెక్ట్ చేసుకుంటే నేను రెండు గంటలు మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆ లుక్ లోనే కొన్ని సీన్స్ చేశాను. ఈ లుక్ కి సంబంధించిన కొన్ని ప్రోమోస్‌ను మా ఫ్రెండ్స్ కి చూపించాను. అది చూసి ఈ లుక్ చాలా భయంకరంగా ఉంది. అమ్మాయిలైతే నిన్ను అస్సలు లైక్ చేయరు అని చెప్పడంతో, కచ్చితంగా ఈ లుక్ లో అమ్మాయిలు నన్ను ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. నన్నే కాదు గుండుతో ఉన్న మగాళ్లను అమ్మాయిలు ఇష్టపడతారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా గుండుతో ఉన్న అమ్మాయిలు అంటే ఇష్టం" అని సరదాగా తన ఫ్రెండ్స్ తో చెప్పానని అన్నారు.


సినిమాలో మెట్రో ట్రైన్ హైజాక్ ఎపిసోడ్లో షారుక్ గుండుతో కనిపించాడు. మళ్లీ క్లైమాక్స్ లో ఓటింగ్ మిషన్ దొంగిలించిన తర్వాత సంజయ్ దత్ తో డీల్ చేస్తున్నప్పుడు మళ్ళీ అదే లుక్ ని రిపీట్ చేశాడు. ఇక యాంటీ హీరోగా నటించడం గురించి షారుక్ మాట్లాడుతూ.. "నిజానికి నేను హీరోగా నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. నాకు హీరోలు చాలా బోరింగ్ అనిపిస్తారు. ఎందుకంటే వాళ్లు అన్ని మంచి పనులే చేస్తారు. ఈ మంచిని చేయడానికి దాన్ని అర్థం చేసుకోవడానికి నేను వెంటనే చెడుగా మారాల్సి ఉంటుంది. దానివల్ల నేను మళ్ళీ మంచి వ్యక్తిగా మారి మంచి పనులు చేస్తాను. మంచిగా ఉండడం కొన్నిసార్లు బోర్ కొడుతుంది. పర్సనల్ గా యాంటీ హీరో రోల్స్ చేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే 'ఐ లవ్ బ్యాడ్ గాయ్స్'(I Love Bad Guys) " అని తెలిపారు.


ఇక ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న 'జవాన్' కలెక్షన్స్ ఇప్పటికే ఇండియా వైడ్ గా రూ 400 కోట్ల మార్క్ కి చేరువలో ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నయనతార హీరోయిన్గా నటించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్ రోల్ లో ఆకట్టుకున్నారు. దీపికా పదుకొనే, సంజయ్ దత్ కామియో రోల్స్ లో కనిపించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ మూవీలో సానియా మల్హోత్రా, ప్రియమణి, యోగి బాబు, సునీల్ గ్రోవర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.


Also Read : గౌతమ్‌తో ఫైటింగ్ - ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వెళ్లిపోతానంటూ యావర్ రచ్చ, రతికానే విలన్?





Join Us on Telegram: https://t.me/abpdesamofficial