అమెరికాలో తెలుగు అమ్మాయి జాహ్నవి కందుల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అమెరికాలోని సియాటిల్ నగరంలో ఈ ఘటన జరిగింది. పోలీసు వాహనం ఢీకొనడంతో జాహ్నవి అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతి చెందిన సమయంలో ఆ పోలీసు వాహనాన్ని కెవిన్ డేవ్ అనే పోలీస్ అధికారి డ్రైవ్ చేస్తున్నట్లు తేలింది. ఆయన బాడీకామ్ ఫుటేజ్ ను పోలీసులు రిలీజ్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ పోలీసు నడుపుతున్న కారు వేగం గంటకు 119 కిలోమీటర్లు గా ఉంది. కారు ఢీకొన్న తర్వాత జాహ్నవి శరీరం దాదాపు 100 అడుగుల దూరంలో పడింది. క్రాస్ వాక్ వద్ద జాహ్నవి రోడ్డు దాటుతున్న సమయంలో అతి వేగంగా వచ్చిన పోలీస్ కారు ఆమెను ఢీకొట్టింది.
అయితే జీబ్రా క్రాసింగ్ వద్ద కాకుండా మరోచోట నుంచి జాహ్నవి రోడ్డు క్రాస్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. జాహ్నవిని ఢీ కొట్టడానికి ఒక సెకను ముందు డ్రైవర్ బ్రేక్స్ వేసాడని, ఆ సమయంలో కారు 101 కిలోమీటర్ల వేగంతో ఉందని తాజాగా పోలీస్ రిపోర్ట్స్ లో పేర్కొన్నారు. జాహ్నవిని కారు బలంగా తాగడం వల్ల ఆమె శరీరం 100 అడుగుల దూరంలో పడినట్లు రిపోర్ట్ లో తెలిపారు. అయితే జాహ్నని ఢీకొన్న ప్రాంతంలో స్పీడ్ లిమిట్ మాత్రం గంటకు 40 కిలోమీటర్లు మాత్రమే ఉండాలి. కానీ ఆ వాహనం గంటకు 119 కిలోమీటర్లు ఉంది. ఇదిలా ఉంటే తెలుగు అమ్మాయి జాహ్నవి కందుల మృతి పై ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు స్పందించి అమెరికా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా జాహ్నవి మృతి పై స్పందిస్తూ అమెరికా పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యూఎస్ఏ లోని ఎస్పీడీ కి చెందిన పోలీసు అధికారి చర్యను పూర్తిగా ఖండిస్తూ.. 'అతని ప్రవర్తన బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. ఎన్నో ఆశయాలతో జీవితంలో ముందుకు సాగుతున్న యంగ్ స్టర్ జీవితం ఇలా చిన్న భిన్నం కావడం విషాదకరమని అన్నారు. అలాంటి ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టడం మరింత విషాదం, దిగ్భ్రాంతికరమైన విషయమని' కేటీఆర్ ట్విట్టర్ వేదిక తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సైతం జాహ్నవి కందుల మృతి పై తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఈ మేరకు తన ఇన్ స్టా స్టోరీలో సమంత జాహ్నవి కందుల యాక్సిడెంట్ తర్వాత పోలీస్ అధికారి నవ్వడం, అవమానకరంగా మాట్లాడుతున్న వీడియోను షేర్ చేసింది. ఈ జాహ్నవి మరణం, ఆ పోలీస్ అధికారి తీరుపై బాధను వ్యక్తం చేస్తూ "హార్ట్ బ్రేకింగ్"(Heart Breaking) అని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని ఆదోని ఎంఐజి కాలనీకి చెందిన కందుల జాహ్నవి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 2021 లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. ఈ ఏడాది జనవరి 23న కళాశాల నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.
Also Read : చైతూను మిస్ అవుతోన్న సమంత? ఇన్‌స్టాలో మళ్లీ ప్రత్యక్షమైన పెళ్లి ఫొటోలు, ‘సామ్’థింగ్ ఫిషీ!