'స్టార్ మా' ఛానల్ (Star Maa Serials)లో టెలికాస్ట్ అవుతున్న సూపర్ హిట్ సీరియళ్లలో 'బ్రహ్మముడి' (Brahmamudi Serial) ఒకటి. మానస్ నాగులపల్లి, దీపికా రంగరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సీరియల్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీని గురించి లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
'బ్రహ్మముడి'లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ!
అవును... 'బ్రహ్మముడి'లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సూపర్ హిట్ సీరియల్ 658 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న తర్వాత కొత్త పాత్రను పరిచయం చేశారు. యామిని పేరుతో ఓ మహిళను తీసుకు వచ్చారు. అదీ సంగతి! మరి, యామిని ఏం చేస్తుంది? ఎవరి పట్ల ఎలా ప్రవర్తిస్తుంది? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
ఎవరీ యామిని? ఆ రోల్ చేస్తున్నది ఎవరు?
'బ్రహ్మముడి'లో కొత్తగా ఎంటరైన క్యారెక్టర్ పేరు యామిని. అయితే, ఆ రోల్ చేస్తున్న మహిళ పేరు యామిని కాదు. ఆ అమ్మాయి అసలు పేరు సౌమ్యా యాదవ్. ఆల్రెడీ తెలుగు బుల్లితెర వీక్షకులకు ఆవిడ కాస్త పరిచయమే.
ఈటీవీ సూపర్ హిట్ సీరియల్, ఆ ఛానల్ టాప్ టీఆర్పీ సాధించే 'రంగుల రాట్నం'లో సౌమ్యా యాదవ్ నటిస్తున్నారు. ఇప్పుడు స్టార్ మా సీరియల్ 'బ్రహ్మముడి'లో చేసే ఛాన్స్ ఆవిడకు వచ్చింది. మరి, ఇందులో ఆవిడ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.
'బ్రహ్మముడి'కి ముందు దీపికా రంగరాజు ఎవరో తెలుగు ప్రేక్షకులకు తెలియదు. ఆ సీరియల్ చేసిన తర్వాత ఆవిడ పాపులర్ అయ్యింది. ఇప్పుడు రియాలిటీ షోలు కూడా చేస్తోంది. తనదైన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో అందర్నీ నవ్విస్తూ ముందుకు వెళుతోంది. మరి, సౌమ్యా యాదవ్ ఎటువంటి గుర్తింపు తెచ్చుకుంటారో చూడాలి.