Prema Entha Madhuram August 2nd: అందరూ అనుని ఎందుకిలా దూరంగా ఉన్నావు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అని అంజలి అంటుంది. జిండే కూడా ఒకప్పటి అనుయేనా మీరు అని మీలో చాలా మార్పు వచ్చింది అని అంటాడు. ఇక నీరజ్ ఎందుకిలా చేశావు వదినమ్మ అంటూ బాధపడుతూ అడుగుతాడు.


ఇక ఆర్య కూడా నాకు దూరంగా ఉంటే నన్ను చాలా బాధ పెడుతున్నావు.. పిల్లలని ఎత్తుకొని వారితో ఆడుకోవాలని ఉంది అనడంతో అప్పుడే పిల్లల ఏడుపు వినిపిస్తుంది. ఇక అందరూ పిల్లలు ఉన్నారని సంతోషపడగా ఆర్య లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. వెంటనే అను ఆపుతుంది.  మీరు పిల్లల్ని చూడొద్దు అని అంటుంది. దాంతో ఆర్య తో పాటు అందరు షాక్ అవుతారు.


ఏం మాట్లాడుతున్నావు ఎందుకు చూడొద్దు అని ఆర్య అనడంతో.. తన మనసులో పిల్లలను చూస్తే మీకే ప్రమాదం అని అందుకే మీకు పిల్లల్ని దూరంగా ఉంచుతున్నాను అని బాధపడుతుంది. ఇక ఆర్య ఇకనుంచి మనం వెళ్ళిపోదాం ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను అన్న కూడా అను వినకుండా లోపలికి వెళ్లి డోర్ వేసుకుంటుంది.


ఇక ఆర్య, నీరజ్ ఎంత డోర్ కొట్టినా కూడా తీయకుండా లోపలికి వెళ్లి పిల్లలు దగ్గర కూర్చుంటుంది. కానీ అదంతా అను ఊహ మాత్రమే. దాంతో తనకు బాగా చెమటలు పట్టడంతో వెంటనే ప్రీతి వాళ్ళు వచ్చి వాటర్ తాగిస్తారు. ఏం జరిగింది.. మాన్సీ నిజం చెప్పిందేమో అని అనుకున్నావా అని అంజలి అనటంతో అవును అని అంటుంది అను. తను నిజంగా మారలేదు అని తను ఊసరవెల్లి అని రేష్మ అంటుంది. అనుకూడా తను ఇంట్లో నిజం చెప్పదు తను నేను ఎప్పుడు బయట ఉండాలని చూస్తుంది అని అంటుంది.


ఆ తర్వాత పిల్లలతో సరదాగా ఆడుకుంటూ ఉండగా గతంలో తనతో ఆర్య ఆడుకున్న విషయాలను గుర్తుకు చేసుకొని బాధపడుతుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ప్రీతి యాప్ ఇన్స్టాల్ చేసాము అని, నీ పేరు మీదనే చేయించాము అని అంటుంది. అప్పుడే ప్రీతి నెంబర్ కు ఒక పెద్ద హోటల్ యజమాని ఫోన్ చేసి భాను కి ఇవ్వమని అంటాడు.


ఇక అతడు మా పెద్ద హోటల్స్ డౌన్ అవుతాయి ఆప్ మర్యాదగా అన్ఇన్స్టాల్ చెయ్యి అని బెదిరించడంతో తిరిగి అను అతడికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.  ఆ తర్వాత ఆర్య వాళ్ళు రావడంతో ఆర్య వాళ్ళతో యాప్ ఓపెన్ చేయించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక అంజలిని స్వీట్ చేయమని నీరజ్ ను ఆర్డర్ చేయమని ఆర్య ను రిసీవ్ చేసుకోమని అంటుంది. వెంటనే జిండే నేను టేస్ట్ చేస్తాను అని సరదాగా అంటాడు. ఆ తర్వాత అంజలి స్వీట్ చేస్తూ ఉంటుంది. ఆర్య వాళ్ళు ఒక చోట కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు.


also read it: Trinayani August 1st: విశాలాక్షిని ఘోరంగా అవమానించిన తిలోత్తమా.. సుమనపై చిరాకు పడుతున్న విక్రాంత్,


Join Us on Telegram: https://t.me/abpdesamofficial