Trinayani August 1st: దురంధర సుమనను టిఫిన్ చేయమని అనడంతో అప్పుడే డమక్క ప్రసాదం తినమని అంటుంది. ప్రసాదం ఎక్కడిది అని అనగా అప్పుడే విశాలాక్షి చేతులో ప్రసాదం పట్టుకొని ఇంట్లోకి వస్తుంది. ఇక విశాలాక్షిని చూసి నయని దంపతులు సంతోషంతో పొంగిపోవటమే కాకుండా అమ్మవారు వచ్చినట్లు ట్రీట్ చేయడంతో వెంటనే తిలోత్తమా దేవత వచ్చినట్లు అలా చేస్తున్నారేంటి అని వెటకారంగా మాట్లాడుతుంది.


దానితో విశాల్ అమ్మవారి పెట్టుకున్నందుకు తన అమ్మవారి లాగానే ఉంటుందని అంటాడు. కానీ తిలోత్తమా మాత్రం వెటకారం చేస్తూ కోపం తెచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ప్రసాదం పెట్టమని ఆకలేస్తుంది అని మిగతావాళ్లు అనటంతో మొదట విశాల్ కు ప్రసాదం పెడుతుంది. ఆ తర్వాత నయని ఇప్పుడు ఈ అమ్మకు అనడంతో.. నాకా నీకా అని అంటుంది. పర్వాలేదు తినమని నయని అనటంతో నేను తిన్నాకే మిగిలింది మీకు తీసుకొచ్చాను అని అంటుంది.


దాంతో సుమన, తిలోత్తమా వాళ్ళు ఆ ప్రసాదం ఎంగిలిది అన్నట్లుగా ముఖం పెడతారు. ఇక సుమన కు ప్రసాదం పెట్టబోతుండగా వద్దు అని నువ్వు తిన్నది మిగిలింది మాకు తీసుకొస్తావా అని కోపంగా ఉంటుంది. ఇక వెటకారం చేసి బాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక జలంధర, డమ్మక్క, ఎద్దులయ్య ప్రసాదం తీసుకోగా తిలోత్తమా దగ్గరికి వెళ్తుంది. ఇక తిలోత్తమా తనకు వద్దు అని అనటమే కాకుండా ప్రసాదం చేతులో పట్టుకొని ఉన్న విశాలాక్షిని బిచ్చగతి అంటూ ఘోరంగా అవమానిస్తుంది.


దాంతో విశాల్, నయని కోప్పడతారు. కానీ తిలోత్తమా మాత్రం అలాగే మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ ప్రసాదం తనకే కాకుండా మరి ఎవరికి ఉండకూడదు అని కింద పడేస్తుంది. వెంటనే ఇంట్లో వాళ్ళు మరింత ఫైర్ అవుతారు. అయినా కూడా విశాలాక్షి కోపడకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఆ తర్వాత విక్రాంత్ బాడీ స్ప్రే కొట్టుకుంటూ ఉండగా ఆ వాసన బాలేదు అంటూ సుమన చిరాకు పడుతుంది.


ఇక సుమన విశాలాక్షి విషయంలో ప్రవర్తించిన దాని తనను బాగా తిడతాడు. విశాలాక్షి పట్ల అలాగేనా మాట్లాడేది అంటూ కోపడతాడు. తెచ్చిన ప్రసాదం తీసుకోకుండా అలా ఎలా ప్రవర్తిస్తావు అని.. ఒకప్పుడు  అదే తిని బతికావు గుర్తుకు తెచ్చుకో అని అంటాడు.  ఇప్పుడు ఆ పాత విషయాలన్నీ ఎందుకు త్వరలో నేను కోటీశ్వరులిని అవుతున్నాను అంటూ అప్పుడు ఇంట్లో నేను నువ్వు మన బిడ్డ సంతోషంగా ఉండొచ్చు అని అంటుంది.


దాంతో విక్రాంత్ మన ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంది అని చూస్తుంటే ఏం జరుగుతుందో అని అంటాడు. ఇక కాసేపు తనకు అలాగే చిరాకు పడతాడు. మరోవైపు వల్లభ హ్యాండ్సమ్ గా రెడీ అవ్వగా తిలోత్తమా కూడా అందంగా రెడీ అవుతూ నేను ఎలా ఉన్నాను అని అంటుంది. అప్పుడే అక్కడికి విక్రాంత్ వచ్చి వాళ్ళని చూసి ఆశ్చర్యపోతాడు.


also read it : Madhuranagarilo July 31st: 'మధురానగరిలో' సీరియల్: సంతోషంగా సాగుతున్న సంగీత్ పార్టీ ప్రిపరేషన్



Join Us on Telegram: https://t.me/abpdesamofficial