Madhuranagarilo July 31st: మధుర దంపతులు సంగీతం ఏర్పాట్ల గురించి ప్రిపేర్ అవుతూ ఉంటారు. రాధ చీర కట్టుకోగా థ్రెడ్ కట్టుకోవడానికి ఇబ్బంది పడటంతో స్వప్న ని పిలుస్తుంది. అప్పుడే అక్కడికి శ్యామ్ వచ్చి రాధ వీపుకు పుట్టుమచ్చ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. వెంటనే స్వప్న ఉన్న డోర్ పెట్టేసి రాధ దగ్గరికి వెళ్లి థ్రెడ్ కడతాడు. ఇక వీపు మీద పుట్టుమచ్చ ఉండటంతో పుట్టుమచ్చ ఉంది అంటూ గట్టిగా అరుస్తాడు.


రాధ వెనక్కి మళ్ళీ చూసి షాక్ అవుతుంది. నీకు పుట్టుమచ్చ ఉంది మనిద్దరికీ పెళ్లి అవుతుంది అని శ్యామ్ అంటాడు. అ సంయుక్త తో పెళ్లి కాదు అని తెగ సంతోషపడతాడు. దాంతో రాధ పుట్టుమచ్చ ఏంటి పెళ్లవటం ఏంటి అని అనటంతో.. తనకు ఒక జ్యోతిష్కుడు చెప్పాడని.. వీపు మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని భార్య అవుతుంది అని.. ఆ పుట్టుమచ్చ నీకే ఉంది అని అంటాడు.


కానీ రాధ మాత్రం తిడుతూ ఉంటుంది. శ్యామ్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తూ సంతోషపడుతూ ఉంటాడు. లోపల ఉన్న సప్న డోర్ తీయమని అరవటంతో అక్కడి నుంచి డోర్ తీసి ఎస్కేప్ అవుతాడు. ఇక రాధ చిరాకుగా ఉండటంతో సప్న ఏం జరిగింది అంటుంది. ఇక జరిగిన విషయం చెప్పటంతో అయితే నువ్వు శ్యామ్ ని ప్రేమిస్తున్నావు అని అంటుంది.


మామూలుగా ఎవరైనా అలా చేస్తే లాగి కొడతారు కానీ నువ్వు తిట్టావు అంటే నీకు ఇష్టం ఉన్నట్లే కదా అని అంటుంది. ఇక వెంటనే స్వప్న రాధే వెనకలో ఉన్న పుట్టుమచ్చ చూసి నిజంగానే ఉంది అనడంతో రాధ షాక్ అవుతుంది. ఇక మీ ఇద్దరికీ పెళ్లి అవుతుంది అని ఒప్పుకుంటావా అని స్వప్న అనటంతో మాకెందుకు అవుతుంది అని చిరాకు పడుతూ కోపంగా అంటుంది.


మరోవైపు మధుర, వాసంతి డాన్స్ ప్రాక్టీస్ కోసం అందర్నీ ఆహ్వానిస్తూ ఉండటంతో గన్నవరం.. ఇలా అందరి ఇంటికి వెళ్లడం కంటే ఒకేసారి అందరికీ మైకు ద్వారా చెబితే సరిపోతుంది అని అంటుంది. దానికి మధుర ఓకే అంటుంది. ఆ తర్వాత రాధ బయటికి రావటంతో శ్యాం కూడా తన వెనుకాలే బయటికి వచ్చి నిలబడతాడు. ఇక శ్యామ్ పుట్టుమచ్చ ఉందని సంతోష పడుతూ ఉండటంతో వెంటనే రాధ ఆ పుట్టుమచ్చ సంయుక్తకు కూడా ఉందేమో అనటంతో ఆలోచనలో పడతాడు.


ఇక అప్పుడే సంయుక్త వాళ్ళు వస్తారు. డాన్స్ మాస్టర్ కూడా రావటంతో అందరికీ ఇంట్లోకి వెళ్ళగా వెంటనే సంయుక్త వాళ్ళ ఫ్రెండ్ శ్యామ్ చాలా బాగున్నాడు అని..  ఇక ఆ పని కూడా పూర్తి చేయు అనటంతో ఈ ప్రాక్టీస్ అయిపోయేలోపు చేస్తాను అని అంటుంది. ఇక ఆ తర్వాత ఇంట్లో అందరూ ఉండగా అదే సమయంలో గన్నవరం మైక్ లో డాన్స్ ప్రాక్టీస్ కోసం అనౌన్స్ చేస్తాడు.


ఇక అక్కడికి వచ్చిన విల్సన్ మైకు ఉన్న సంగతి మర్చిపోయి తన శోభనం గురించి మాట్లాడుతూ తనకు శోభనం కాలేదన్న విషయాన్ని అందరికీ తెలిసేలా చెప్తాడు. ఇక విల్సన్ మాటలు విని అందరు తెగ నవ్వుకుంటారు. ఆ తర్వాత అందరికీ డాన్స్ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు. ఇక సంయుక్త, శ్యామ్ కూడా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా.. సంయుక్త వీపు మీద ఉన్న పుట్టుమచ్చ చూసి శ్యామ్ షాక్ అవుతాడు. వెంటనే రాధ కూడా సంయుక్త విపు మీద పుట్టుమచ్చ ఉంది అని ఊపిరి పీల్చుకుంటుంది. దాంతో శ్యామ్ సంయుక్తను కింద పడేస్తాడు.


 


also read it : Trinayani July 29th: విక్రాంత్ ను కాపాడిన శివ.. ప్లాన్ ఫెయిల్ అయిందని చిరాకులో ఉన్న తిలోత్తమా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial