Brahmamudi July 31st: సేటు కృష్ణమూర్తి ఇంటికి పెద్దమనుషులను తీసుకొని వచ్చి తన వడ్డీ రెండు రోజుల్లో చెల్లించకపోతే తనను కిడ్నాప్ చేసిన వ్యక్తిని సీసీ ఫుటేజ్ లో పట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తాను అని బెదిరిస్తాడు. ఇక పెద్ద మనుషులు లేనిపోని కేసులు ఎందుకు ముందు కొంత డబ్బు కట్టమని కృష్ణమూర్తికి సలహా ఇస్తారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అని కృష్ణమూర్తి టెన్షన్ పడుతూ కనిపిస్తాడు.


మరోవైపు దుగ్గిరాల కుటుంబ సభ్యులందరు కూర్చొని కాఫీ తాగుతున్న సమయంలో కొరియర్ రావడంతో అది కళ్యాణ్ ఓపెన్ చేసి చూడటంతో అందులో తన ఫోటోతో పాటు కవిత ఉండటంతో అది చూసి సంతోషంగా పొంగిపోతాడు. అంతేకాకుండా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక కావ్య దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతూ ఉండటంతో అందరూ టెన్షన్ పడుతూ ఏం జరిగింది అని అడుగుతారు.


దాంతో కావ్య అది ఆనందభాష్పాలు అని చెప్పటంతో.. ఇంట్లో వాళ్ళు కావ్యని ఏం జరిగింది అని అడుగుతారు. ఇక కావ్య విషయం చెప్పడంతో ఇంట్లో వాళ్లంతా తెగ సంతోష పడతారు. ఇక కళ్యాణ్ తన వదిన చేయి పట్టుకొని బాగా ఎమోషనల్ అవుతాడు. ఇక రుద్రాణి, స్వప్న, రాహుల్ మాత్రం తెగ కుళ్ళుకుంటూ ఉంటారు. ఇక కళ్యాణ్ కావ్యను పొగుడుతుండటంతో నేను ఏదో పెద్ద పని చేసినట్లు అలా పొగుడుతున్నారు ఏంటి అని అంటుంది.


ఇక ధాన్యలక్ష్మి అది చిన్నది కాదు సంతోషకరమైనది అంటూ బాగా సంతోషపడుతుంది. మరోవైపు ఒక అమ్మాయి కళ్యాణ్ రాసిన కవిత్వం చదువుతూ తెగ సంతోష పడుతూ పొగుడుతూ ఉంటుంది. అదే సమయంలో అప్పు బైక్ మీద కూర్చుని ఉండగా అక్కడికి కళ్యాణ్ వచ్చి పేపర్లో ప్రింట్ అయిన తన కవితాన్ని చూపిస్తాడు. ఇక అప్పు ఎంత డబ్బు ఇచ్చి వేయించావు అని వెటకారం చేస్తూ ఉంటుంది. దాంతో కళ్యాణ్ తనపై ఫైర్ అవుతాడు.


కష్టపడి కవిత రాస్తే అవమానిస్తావా అని అంటాడు. వెంటనే అప్పు సరేలే తొందరపడ్డాను అని కాస్త చదివి వినిపించు అని అంటుంది. ఇక కళ్యాణ్ మంచి ఫీల్ తో చదువుతూ ఉండగా అప్పుకి ఏమీ అర్థం కాదు. ఇక అప్పుకి ఆ కవిత అర్థం కాకపోయేసరికి అందులో ఏముంది అంటూ అడుగుతుంది. ఇక అప్పుడే ఆ అమ్మాయి వచ్చి ఎంతో గొప్పగా రాశారు సార్ అంటూ కళ్యాణ్ ని పొగుడుతూ ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటుంది.


ఇక ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళాక ఇందాక ఏమన్నావు డబ్బులు ఇచ్చి పబ్లిష్ చేయించాను అన్నావు కదా ఇప్పుడేమంటావ్ అనటంతో ఆ పోరికి ఎంత ఇచ్చావు అని మళ్లీ అదే విధంగా మాట్లాడుతుంది అప్పు. వెంటనే కళ్యాణ్ కు బాగా కోపం వస్తుంది. ఇక మరోవైపు రాజ్ కావ్య దగ్గరికి వచ్చి కళ్యాణ్ కవిత ప్రింట్ చేయించినందుకు థాంక్స్ అని చెబుతాడు. దాంతో మా మరిది సంతోషం కోసం చేశాను అని అంటుంది కావ్య. అలా వారిద్దరి మధ్య కాసేపు అటువంటి వాదన జరుగుతూ ఉంటుంది.


అంతేకాకుండా తనతో పాటు ఆఫీస్ కి కూడా రమ్మని అంటాడు రాజ్. దాంతో కావ్య నేనా అని ఆశ్చర్యపోయి నాతో అంత పెద్ద పని ఏంటో అని అడుగుతుంది. ఇక ఇంట్లో ఏం కారణం చెప్పి రావాలి అని.. నన్ను మా ఆయన వదిలి ఉండలేకపోతున్నాడు అందుకే నేను కూడా వెళ్తున్నానని చెప్పేసి రమ్మంటారా అని అంటుంది. దాంతో తనను కాస్త మెల్లిగా కొట్టి.. ఒక కంపెనీ వాళ్లు మిడిల్ క్లాస్ వాళ్ళను టార్గెట్ చేసి ఒక జ్యువెలరీ డిజైన్ చేయించాలి అనుకుంటున్నారు.


మిడిల్ క్లాస్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో నీకు తెలుసు కదా అందుకే నిన్ను రమ్మంటున్నాను అనటంతో.. నేను మిడిల్ క్లాస్ కాదు మా ఆయన చాలా రిచ్ అంటూ కాస్త అతిగా మాట్లాడుతుంటుంది. ఇక సరే వస్తాను.. సాటి మనిషి అన్నాక ఆ మాత్రం సహాయం చేయకపోతే ఎలా అని అంటుంది. ఇక కృష్ణమూర్తి అప్పు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కనకం సేటుకి ఇవ్వాల్సిన దాని గురించి ఏం ఆలోచించావని అంటుంది.


ఇక ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను అనటంతో కనకం షాక్ అవుతుంది. మరో దారి లేదు అని.. తన భార్యతో చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక ఈ మాటలన్నీ బయట అప్పు వింటుంది. తరువాయి భాగంలో కళ్యాణ్ కావ్య దగ్గరికి వచ్చి.. మీ ఇంట్లో పరిస్థితి బాలేదు 50,000 అర్జెంటుగా కట్టాలి. ఏదో ఇల్లు తాకట్టులో ఉన్న విషయం గురించి టెన్షన్ గా ఉన్నారు అని అంటాడు. దాంతో కావ్య టెన్షన్ పడుతూ చాలా బాధపడుతుంది. ఆ మాటలన్నీ రాజ్ వింటాడు. ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరికి వెళ్లి ఆ విషయం తెలుసుకొని తను కూడా షాక్ అవుతాడు.


also read it : Madhuranagarilo July 29th: రాధ వీపు మీద పుట్టుమచ్చ చూసి సంతోషంలో పొంగిపోతున్న శ్యామ్.. భర్తను పూర్తిగా దూరం పెట్టేసిన శిరోజా?


 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial