Madhuranagarilo July 29th: శ్యామ్ కిరణ్ తో తనకు సంయుక్త ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని.. రాధ ని ఎలా పెళ్లి చేసుకోవాలి అని అడుగుతూ ఉంటాడు. వెంటనే కిరణ్ ఒక జ్యోతిష్యుడు ఉండని సలహా ఇచ్చి శ్యామ్ ను అక్కడికి తీసుకొని వెళ్తాడు. ఇక అతడు శ్యామ్ కు మంచి అందమైన భార్య, గుణవంతురాలు లాంటిది దొరుకుతుందని.. అంతేకాకుండా తన వీపుపై అమావాస్య అంతా చందమామ ఉంటుంది అని అంటే తనకు పుట్టుమచ్చ ఉంటుంది అని చెబుతాడు.
ఇక శ్యామ్ వాళ్ళు బయటికి వచ్చి ఆ పుట్టుమచ్చ ఎలా చూడాలి అని ఆలోచనలో పడతాడు. మరోవైపు మధుర ఇంటికి వెళ్ళిన రాధ సంగీత ఫంక్షన్ లో డాన్స్ మాస్టర్ వస్తున్నాడు అని అనటంతో ఇప్పుడెందుకు డాన్స్ మాస్టర్ అని మధుర అడుగుతుంది. ఈ మధ్య సంగీత ఫంక్షన్లలో ఇవన్నీ ట్రెండ్ అని.. డాన్స్ మాస్టర్ వచ్చి పెళ్లికూతురు, పెళ్ళికొడుకు డాన్స్ రిహార్సల్ నేర్పిస్తారు అని చెబుతుంది.
దానికి మధుర కూడా సరే అని ఉంటుంది. అప్పుడే అక్కడికి శ్యామ్ రావడంతో రాధ పెళ్లి కోసం ఇంతలా హెల్ప్ చేస్తుంది కాబట్టి తనకు గిఫ్ట్ తీసుకొచ్చాను అని గిఫ్ట్ ఇస్తాడు. ఇక మధిర అది చూడగా అందులో చీర ఉండటంతో చీర బాగుంది అని అంటుంది. వెంటనే శ్యామ్ ఇప్పుడే కట్టుకో బాగోకపోతే వాపస్ ఇస్తాను అని అంటాడు. దాంతో రాధ పెళ్లికి కట్టుకుంటానంటంతో ఆల్రెడీ పెళ్లి చీర ఉంది కదా అని అంటాడు.
ఆ మాటకు అందరు ఆశ్చర్యపోవటంతో ఆల్రెడీ అమ్మ పెళ్లికి నీకోసం ఒక చీర తీసుకుంది అని అంటాడు. ఇక మధుర కూడా చీర కట్టుకొని రమ్మని అనడంతో సరే అని రాధ చీర కట్టుకోవడానికి వెళుతుంది. ఇక శ్యామ్ పుట్టుమచ్చ చూడటం కోసమే కిటికీల బ్లౌజ్ తీసుకొచ్చాను అని అనుకుంటాడు. రాధ చీర కట్టుకున్న తర్వాత శ్యామ్ సర్ టేస్ట్ బాగుంది అని.. సంయుక్త అదృష్టవంతురాలు అని అంటుంది. ఇక వెనుక వైపు చూసుకొని కిటికీల బ్లౌజ్ చూసి దీని వెనకాల శ్యామ్ సార్ ఏదైనా ప్లాన్ చేశాడా అని అనుమానం పడుతుంది.
ఇక రాధ కిందికి రాగానే మధురవాళ్ళు చూసి బాగుందని అంటారు. శ్యామ్ వెనకాల వైపు వెళ్లి చూస్తూ ఉండటంతో వెంటనే చీరను కప్పుకుంటుంది. ఇక డాన్స్ మాస్టర్ వస్తాడు అని సంయుక్త కూడా చెప్పి రమ్మని చెప్పి రాధ అక్కడ నుంచి వెళ్తుంది. ఇక తన ప్లాన్ సక్సెస్ కాలేదు అని బాధపడతాడు. మరోవైపు విల్సన్ తన భార్య శిరోజను తప్పయింది అని బ్రతిమాలుతూ ఉంటాడు.
అదంతా తను చేసిన తప్పు కాదు అని అంటుండగా.. వాసంతి గన్నవరం తీసుకొచ్చి తప్పంతా ఈయనదే అని చెబుతుంది. గన్నవరం కూడా క్షమాపణలు చెబుతాడు. కానీ శిరోజ మాత్రం అస్సలు ఊరుకోదు. ఇక తన భర్తను పూర్తిగా దగ్గరికి రావద్దని గట్టిగా కండిషన్ పెడుతుంది. వాసంతి కూడా గన్నవరం ను ఇంటికి రావద్దు అని కండిషన్ పెడుతుంది. ఆ తర్వాత గన్నవరం ను ఎలాగైనా నా భార్యను కలిపేటట్టు చేయాలి అని విల్సన్ అంటాడు. దానికి గన్నవరం సరే అంటాడు.
రాధ ఇంటికి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ స్వప్న చీరతో వచ్చావ్ ఏంటి అని అడగడంతో.. శ్యామ్ గిఫ్ట్ ఇచ్చాడు అని అంటుంది. ఇక లోపలికి వెళ్లి అద్దంలో తన వీపు చూసుకుంటూ ఉండగా ఏం జరిగింది అని స్వప్న అంటుంది. ఆ తర్వాత స్వప్నను సంగీత ఫంక్షన్ కి రమ్మని చెప్పి అక్కడ శ్యాం సర్ ఎలా చూస్తున్నాడో అబ్జర్వ్ చేయమని అంటుంది. దానికి స్వప్న సరే అంటుంది.
తర్వాయి భాగంలో రాధ మరో చీర కట్టుకొని ఉండగా.. బ్లౌజ్ కి ఉన్న ముడి వెయ్యమని స్వప్నతో అంటుంది. అక్కడ స్వప్న లేకపోయేసరికి శ్యామ్ వచ్చి కడతాడు. వీపు మీద ఉన్న పుట్టుమచ్చ చూసి సంతోషంలో ఎగురుతాడు. రాధ చూసి షాక్ అవుతుంది. ఇక వీపు మీద పుట్టుమచ్చ ఉందంటూ ఎగురుతాడు.
also read it : Trinayani July 28th: నయని ఇంట్లో సుమన సీమంతం వేడుకలు.. రక్తం పంచుకున్న కొడుకుని చంపడానికి సిద్ధమైన తిలోత్తమా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial