Trinayani july 28th: నయని ఆఫీస్ పని చేస్తూ ఉండగా దురంధర భర్తతో సహా నయని దగ్గరికి వచ్చి సుమన ప్రవర్తన గురించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి డమ్మక కూడా వస్తుంది. కృష్ణుడి పూజలో సుమన అలా చేసింది కాబట్టి రేపు సీమంతంలో ఇంకెంతలా చేస్తుందో అని దురంధర భయపడుతూ ఉంటుంది. దాంతో నయని జాగ్రత్తగా ఉండాలి అని అనటంతో వెంటనే డమ్మక్క జాగ్రత్తగా ఉండాల్సింది మనం కాదు సుమన అని అంటుంది.
ఎందుకని.. కడుపుతో ఉందా అని దురంధర అనటంతో.. కాదు రేపు పుట్టబోయే బిడ్డకు తను తల్లి అవుతుంది. మరి తండ్రి అని అనటంతో దురంధరకు ఆ మాటలు అర్థం కావు. ఇక నయని కూడా డమ్మక్క చెప్పింది కూడా కరెక్టే అని అనుకుంటుంది. ఇక రేపు జరగబోయే సీమంతం వేడుక కు సిద్ధం చేద్దాం అని డమ్మక్క అంటుంది. ఆ తర్వాత వల్లభ ఎలర్జీ మొత్తం పోయింది అని.. నయని చెప్పిన పూజ చేయటం వల్ల తనకు నయమయింది అని తన తల్లితో అంటాడు.
దాంతో తిలోత్తమా నువ్వు కూడా మంచోడివిగా మారుతున్నట్లు ఉన్నావు అని అనటంతో వల్లభ ఏమీ అనకుండా మౌనంగా ఉంటాడు. ఇదంతా నయని చేస్తున్న నాటకం అని.. నన్ను కూడా టార్గెట్ చేసి షాక్ కొట్టేలా చేసింది అని అంటుంది. ఇక రేపు జరగబోయే సీమంతం ఏర్పాట్లు జరుగుతున్నాయని.. నయని, సుమనకు పడదు కాబట్టి రేపు వారి మధ్య నిప్పు పెట్టేలాగా చేయాలి అని అనుకుంటుంది.
అంతేకాకుండా రేపు ఒకరికి ప్రాణభయం తెలిసేలా చేయాలి అని అంటుంది. దానితో వల్లభ ఎవరికి అని అనటంతో నువ్వే చెప్పు అని తిలోత్తమా అంటుంది. వెంటనే నయని పేరు చెప్పడంతో కాదు అని అంటుంది. సుమన అని అనటంతో తను కూడా కాదు అని అంటుంది. మరెవరు అని అనటంతో విక్రాంత్ అని అంటుంది తిలోత్తమా. దాంతో వల్లభ షాక్ అవుతాడు.
మరుసటి రోజు ఉదయాన్నే సుమన రెడీ అవ్వగా అక్కడికి విక్రాంత్ వచ్చి ఈరోజు తనకు జాతకం ప్రకారం ముప్పు ఉందని.. అది నిజమే అని ఎందుకంటే నిన్ను ఇలా చూస్తుంటే ఏదో జరిగేలా ఉంది అని అపశఖనముగా మాట్లాడుతాడు. ఇక సుమన కాసేపు వెటకారంగా మాట్లాడి తనకు కుంకుమ బొట్టు పెట్టమని అంటుంది. ఇక భార్య కోసం విక్రాంత్ బొట్టు పెట్టడానికి ప్రయత్నించటంతో కుంకుమ జారి కింద పడుతుంది.
దాంతో విక్రాంత్ నాకేమైనా అవుతుందని భయపడుతున్నావా అనటంతో.. అలా ఏమీ లేదు.. ఏదైనా అవుతే బిడ్డ పుట్టాక జరిగిన ఏం కాదు అని భర్త మీద ప్రేమ లేకుండా మాట్లాడుతుంది. దాంతో విక్రాంత్ కు కోపం వచ్చి తను తిట్టేసి అక్కడినుండి వెళ్తాడు. మరోవైపు తిలోత్తమా విక్రాంతను చంపడానికి పాపర్స్ సిద్ధం చేసి ఉంచుతుంది.
ఇక వల్లభతో ఆ పాపర్స్ విక్రాంత్, సుమన పై చల్లమని చెబుతుంది. దాంట్లో వచ్చే రంగురంగుల పేపర్స్ విక్రాంత్ కు తాకడం వల్ల అందులో ఉండే గ్యాస్ వల్ల అస్వస్థకు గురవుతాడని దానివల్ల విక్రాంత్ హాస్పిటల్లో ఉండగా.. సుమన తో సంతకం చేయిస్తారని.. ఇక సుమన ఆ సమయంలో చేసేది హాస్పిటల్ పేపర్స్ పైన కాకుండా రేపు తన ఒక పుట్టబోయే బిడ్డకు వచ్చే ఆస్తి పేపర్ల పై సంతకం చేస్తుందని క్రూరంగా చెబుతుంది.
మరి సుమనకు ఏమీ పాపర్స్ వల్ల ఏమీ కావా అనటంతో.. అక్కడున్న వాళ్లకు ఏమి జరగదని కేవలం తనకు, విక్రాంత్ కు మాత్రమే జరుగుతుందని.. ఎందుకంటే తమ ఇద్దరి బ్లడ్ గ్రూప్ ఒకటే కాబట్టి అని చెబుతుంది. ఇక వల్లభ పాపం తమ్ముడు కదా అనడంతో కన్నతల్లిని ద్వేషించేవాడు కన్న కొడుకు కాదని ఒక మూర్ఖురాలి తల్లిగా మాట్లాడుతుంది. ఆమె మాటలకు వల్లభ కూడా భయపడతాడు.
ఇక ఇంట్లో సీమంతం వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక వల్లభ చేతిలో పాపర్స్ పట్టుకొని రావడంతో హాసిని కాసేపు వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ సమయంలో బయట వర్షం పడుతున్న సందర్భంగా విశాల్ తులసి కోట ను ఇంట్లో తీసుకొచ్చి పెడతాడు. ఇక ఎందుకు ఇంట్లో తెచ్చి పెడుతున్నావు అని ఇంట్లో వాళ్ళు అడగటంతో.. బయట వర్షం పడుతున్నందుకు నయని ఇంట్లోనే తులసి అమ్మవారికి దీపం పెట్టాలని అన్నదని అంటాడు. అప్పుడే సుమన రావటంతో.. సుమనతో దీపం పెట్టించాలి అని అనుకుంటుంది. ఇక సుమనను దీపం పెట్టమని నయని అనడంతో.. సుమన నేనెందుకు పెట్టాలి అన్నట్లు అశుభకారంగా మాట్లాడుతుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial