టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ 'అల.. వైకుంఠపురంలో' సినిమా తరువాత ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. ఈ సినిమా విడుదలై రెండేళ్లు అయిపోయింది. మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనుకున్నారు త్రివిక్రమ్. కానీ వారు వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండడంతో కుదరలేదు. ఇంతలో పవన్ కళ్యాణ్ హీరోగా 'భీమ్లానాయక్' సినిమా మొదలైంది. దీనికి సాగర్ చంద్ర డైరెక్టర్ అయినప్పటికీ.. త్రివిక్రమ్ అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు.
అలానే సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు. ముందుగా మహేష్ బాబు హీరోగా సినిమా చేయనున్నట్లు చెప్పారు త్రివిక్రమ్. కానీ 'సర్కారు వారి పాట' రిలీజ్ ఆలస్యమవుతోంది. ఈ సినిమా విడుదల కాగానే.. రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లాలనుకుంటున్నారు మహేష్. మరోపక్క ఎన్టీఆర్ ముందుగా కొరటాల శివ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు.
కాబట్టి ఇప్పట్లో త్రివిక్రమ్ హీరోలు దొరికే ఛాన్స్ లేదని టాక్. అందుకే ఆయన లేడీ ఓరియెంటెడ్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఓ వింటేజ్ నవలకి చెందిన హక్కులను త్రివిక్రమ్ సొంతం చేసుకున్నారట. ఇదొక ఫిమేల్ సెంట్రిక్ ప్లాట్ అని తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ ఇలా చిన్న బడ్జెట్ లో పెద్ద సినిమాలు తీసిన సందర్భాలు ఉన్నాయి.
ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారట. తక్కువ సమయంలో ఈ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. త్రివిక్రమ్-సమంత కాంబినేషన్ అనగానే బజ్ పెరిగిపోయింది. దీనిపై త్రివిక్రమ్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే 'యశోద' సినిమాలో నటిస్తోన్న ఈ బ్యూటీ దీని తరువాత తాప్సి నిర్మాణంలో బాలీవుడ్ లో ఓ సినిమా చేయబోతుందని సమాచారం. అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో నటించనుంది. ఇది కాకుండా.. ఓ బైలింగ్యువల్ సినిమా కూడా ఆమె లిస్ట్ లో ఉంది.
Also Read: 'అవతార్ 2' రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్.. ఫ్యాన్స్ కు పండగే..
Also Read: మలైకాకి బ్రేకప్ చెప్పేశాడా..? ఇదిగో క్లారిటీ..
Also Read: మెగా హీరో కొత్త సినిమా టైటిల్ ఇదేనా..?
Also Read: సమంతతో విడాకులపై స్పందించిన చైతు.. ఇప్పుడు నేను హ్యాపీ..
Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..
Also Read: ఇలా బెదిరిస్తే వచ్చి కొడతా.. ప్రభాస్ ఫ్యాన్స్ కి 'రాధేశ్యామ్' డైరెక్టర్ వార్నింగ్..