తనతో పాటూ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ముద్దుగుమ్మలంతా ఓ ఇంటివారైపోవడంతో త్రిష పెళ్లి ఎప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లకు ఆ గుడ్ న్యూస్ చెప్పబోతోందట చెన్నై చంద్రం. పదహారేళ్లకి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రిష కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తోంది. ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంలో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. మణిరత్నం `పొన్నియిన్ సెల్వన్`, `చదురంగ వేట్టై-2`, `రాంగీ`, `గర్జనై` ప్రాజెక్టులున్నాయి. వీటిలో `పొన్నియిన్ సెల్వన్` మినహా మిగిలిన సినిమాల షూటింగ్ తో పాటూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అటు `పొన్నియిన్ సెల్వన్` మూవీలో త్రిషకు సంబంధించిన షూటింగ్ భాగం చివరి దశకు చేరుకుంది.
మరోవైపు తెలుగులో నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేని దర్శకత్వంతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో త్రిష హీరోయిన్. 2015లో వచ్చిన “లయన్” సినిమాలో బాలకృష్ణ, త్రిష జంటగా కన్పించారు. అయితే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తైన వెంటనే చెన్నై చంద్రం సినిమాలకు గుడ్ బై చెప్పేస్తోందనే వార్తలు గుప్పుమంటున్నాయ్. కారణం ఏంటంటారా..ఎంచక్కా పెళ్లి చేసుకుని గృహిణిగా బాధ్యతలు నిర్వహించాలనుకుంటోందట. అయితే ఎప్పటికప్పుడు త్రిష పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే త్రిషకు ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం అయింది. కానీ ఏమైందో ఏమో ఆ బంధం పెళ్లిపీటల వరకూ వెళ్లలేదు. అప్పటి నుంచి అడపాదడపా త్రిష వివాహానికి సంబంధించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. కానీ ఆమె మాత్రం అధికారికంగా స్పందించలేదు.
Also Read: పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. జనంలో ఉంటాడు.. జనంలా ఉంటాడు, ఇదీ పవర్ స్టారంటే!
1999లో వచ్చిన ‘జోడి’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన త్రిష 2003లో ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. వర్షం సినిమాతో జోరందుకున్న ఆమె కెరీర్ అప్పటి నుంచి దాదాపు అగ్రహీరోలందరి సరసనా వరుస ఆఫర్లు దక్కించుకుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 22 ఏళ్ల గడిచినా ఇప్పటికీ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. అయితే ఓ వ్యాపారవేత్తతో ఆమె పెళ్లి నిశ్చయం అయ్యిందని.. అందుకే త్రిష కొత్తగా సినిమాలేవీ అంగీకరించడం లేదని.. త్వరలోనే తన పెళ్లి గురించి త్రిష ప్రకటన చేయనుందని అంటున్నారు. కొత్త ప్రాజెక్టులు అంగీకరించడం లేదంటే పెళ్లి తర్వాత చెన్నై చంద్రం సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందా అనే చర్చ జరుగుతోందిప్పుడు. ఇంతకీ త్రిష ఈ విషయం ఎప్పుడు చెబుతుందో...
Also Read:పవన్ కళ్యాణ్ సేఫ్ జర్నీ.. రిమేక్ సినిమాలే బెటర్ అనుకుంటున్న పవర్ స్టార్?
Also Read: భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్.. 12 నిమిషాల్లోనే లక్షకు పైగా లైక్స్.. ట్రెండ్ సెట్ చేస్తున్న పవర్ స్టార్!