'నిన్నుకోరి' వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నాని - శివ నిర్వాణ కాంబినేషన్లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన సినిమా ‘టక్ జగదీశ్’. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతోంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌లో నాని మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
నాని మాట్లాడుతూ.. 'నిన్నుకోరి’ సినిమాతో ఇదివరకే శివ నిర్వాణతో కలిసి పని చేశాను. రీతూ వర్మతో 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో కలిసి చేశాను. ప్రవీణ్‌తో నా కెరీర్ ప్రారంభం నుంచి సినిమాలు చేస్తూనే ఉన్నాం. సినిమాలు చేయకపోయినా కూడా టచ్ లోనే ఉంటారు. తిరువూర్ అయితే అద్భుతమైన నటుడు. ఇంతవరకు ఆయన నటించిన సినిమాలు చూడలేదు. ఆయన చూడటానికి ఎంతో సింపుల్ స్వీట్ గా ఉన్నారు. కానీ ఆయన పాత్ర మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆయన నటనను చూసి నాకు భయం వేసింది. సినిమాను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించడం లేదనే సమస్యే ఉండదు. ఒక్కో సినిమా ఒక్కో లెక్క ఉంటుంది. అన్ని కోణాల్లో సినిమా గురించి ఆలోచించాలి. నిర్మాత దర్శకులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమిది. థియేటర్లో అందరితో కలిసి చూడాలని ఎంతో అనుకున్నాను. కానీ బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకున్నాం. బయటి పరిస్థితులు త్వరగా చక్కబడాలి. మళ్లీ ఆ పూర్వ వైభవం రావాలి. బ్రేకుల్లేకుండా ఇకపై మీ అందరినీ కలుసుకోవాలని అనుకుంటున్నాను అని అన్నారు. ఇక్కడితో ఆగితే సరే కానీ నాని ఆ తర్వాత మాట్లాడిన మాటలే చర్చకు దారితీశాయి.
Also Read:భీమ్లానాయక్ జోష్ తగ్గకముందే ‘హరి హర వీరమల్లు’ రిలీజ్.. 3 నెలల గ్యాప్‌లోనే వస్తోన్న పవన్ కళ్యాణ్
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ‘టక్ జగదీష్’ విడుదల కావడంపై వచ్చిన కామెంట్స్‌పై నాని స్పందించాడు. ‘‘వాళ్లందరికీ ఇదే నా సమాధానం. వాళ్లంటే నాకు చాలా గౌరవం. వాళ్లున్న పరిస్థితుల్లో వాళ్లు అలా రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదు. కాకపోతే జగదీష్‌నాయుడు (‘టక్ జగదీష్’లో నాని పాత్ర), నేనూ వాళ్ల ఫ్యామిలీయే. నన్ను బయటివాడిగా చూడటం బాధ అనిపించింది. నా సినిమాను ఆపేస్తామని కూడా అన్నారట. నిజంగా బయట ఇలాంటి పరిస్థితులు లేనప్పుడు సినిమా థియేటర్స్‌లో విడుదల కాకుండా ఓటీటీలో విడుదలైతే అప్పుడు ఎవరో బ్యాన్ చేయాలనుకోవడం కాదు. నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా“ అని నాని భావోద్వేగంగా మాట్లాడాడు.
అటు దర్శకుడు శివ నిర్వాణ కూడా ‘‘థియేటర్లో మా సినిమా విడుదల కావడం లేదని తెలిసినప్పుడు కలిగిన బాధ నాకు, నానీకి మాత్రమే తెలుసు. థియేటర్లో విడుదల చేసి, ఏమైనా తేడా వస్తే మా (నాని, శివ నిర్వాణ) పారితోషికంలోంచి కట్ చేసుకోమని చెప్పాం కూడా. ఐదు నెలలు రిలీజ్ కోసం వెయిట్ చేశారు నిర్మాతలు. పరిస్థితులు ఇంకా మారడం లేదు. అందుకే ఓటీటీ రిలీజ్ నిర్ణయం తీసుకున్నారు’’ అని అన్నాడు శివనిర్వాణ. మొత్తంమీద నాని మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
Also Read: పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్.. జనంలో ఉంటాడు.. జనంలా ఉంటాడు, ఇదీ పవర్ స్టారంటే!
Also Read:పవన్ కళ్యాణ్ సేఫ్ జర్నీ.. రిమేక్ సినిమాలే బెటర్ అనుకుంటున్న పవర్ స్టార్?
Also Read:సినిమాకే కాదు ఓటీటీకి కూడా సేమ్ ఫార్ములా అంటున్న విక్టరీ వెంకటేష్