బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్‌న్యూస్ చెప్పింది. ఎస్‌బీఐలో 69 స్పెషలిస్టు కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు రేపటితో (సెప్టెంబర్ 2) ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ (సివిల్), డిప్యూటీ మేనేజర్ (అగ్రికల్చర్ స్పెషల్), రిలేషన్‌షిప్ మేనేజర్ (ఓఎంపీ) సహా పలు విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ (sbi.co.in) నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షను సెప్టెంబర్ 25న నిర్వహించనున్నారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు..
అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ (సివిల్) - 36, డిప్యూటీ మేనేజర్ (అగ్రికల్చర్ స్పెషల్), అసిస్టెంట్ మేనేజర్-ఇంజనీర్ (ఎలక్ట్రికల్) విభాగాల్లో 10 చొప్పున ఖాళీలు ఉన్నాయి. రిలేషన్‌షిప్ మేనేజర్ (ఓఎంపీ) - 6, అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్ & కమ్యూనికేషన్) - 4, ప్రొడక్ట్ మేనేజర్ (ఓఎంపీ) - 2, సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ - 1 పోస్టును భర్తీ చేయనున్నారు.
విద్యార్హత వివరాలు..
అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గుర్తింపు పొందిన విద్యా సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో కనీసం 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో కనీసం 60% మార్కులతో పాస్ అయి ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్ & కమ్యూనికేషన్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. ప్రభుత్వ గుర్తింపు/ ఆమోదం పొందిన సంస్థల నుంచి ఫుల్ టైమ్ ఎంబీఏ (మార్కెటింగ్) లేదా దానితో సమానమైన మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్ చేసి ఉండాలని తెలిపింది.
ఇక డిప్యూటీ మేనేజర్ (అగ్రికల్చర్ స్పెషల్) పోస్టులకు.. రూరల్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ లేదా పీజీడీఎం/ రూరల్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా / అగ్రి బిజినెస్‌లో పీజీడీఎం/ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫుల్ టైం కోర్సుగా అగ్రికల్చర్ పోస్టు గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి.
వయో పరిమితి, దరఖాస్తు ఫీజు..
పోస్టును బట్టి వయోపరిమితిలో తేడాలు ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 30 ఏళ్ల గరిష్ట వయోపరిమితి ఉంది. డిప్యూటీ మేనేజర్, రిలేషన్‌షిప్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్ తదితర పోస్టులకు 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ పోస్టులకు 60 ఏళ్ల వరకు గరిష్ట వయో పరిమితి ఉంది. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా వారు రూ.750 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: AP Anganwadi Posts: టెన్త్ పాస్ అయిన మహిళలకు గుడ్ న్యూస్.. ఏపీలో 772 అంగన్ వాడీ పోస్టులు