శ్రీకాకుళం జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కె.చంద్రానాయక్‌ పేర్కొ్న్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జనరల్‌ ఫిజీషియన్, సైకియాట్రిస్ట్, ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్, ఎన్‌పీసీడీఎస్‌ కింద కార్డియాలజిస్ట్, మెడికల్‌ ఆఫీసర్, ఎన్‌బీఎస్‌యూసీ కింద మెడికల్‌ ఆఫీసర్, స్టాఫ్‌నర్సులు, సైకియాట్రిస్ట్‌ నర్స్, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫిజియోథెరఫిస్ట్‌లు, ఆడియో మెట్రిషియన్, సోషల్‌ వర్కర్లు, క్వాలిటీ మానిటర్‌ కన్సల్టెంట్, ఆసుపత్రి అటెండెంట్, శానిటరీ అటెండెంట్‌ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 


ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 15వ తేదీ వరకూ అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాల కోసం https://srikakulam.ap.gov.in/ ద్వారా సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు.


Also Read: BRAOU Admissions: విద్యార్థులకు గుడ్ న్యూస్.. డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మళ్లీ పొడిగించారు..


నిరుద్యోగులకు శుభవార్త


ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఉద్యోగ మేళా నిర్వహిస్తుంది. సెప్టెంబర్‌ 3వ తేదీన ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ జాబ్‌ మేళాను కృష్ణా జిల్లా నూజివీడులోని రైతు బజార్‌ రోడ్డులో ఉన్న ధర్మ అప్పారావు కాలేజీలో నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్‌ 3వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ కళాశాలకు వెళ్లవచ్చు. పూర్తి వివరాలం కోసం 8374039719, 9848819682 ఈ ఫోన్‌ నెంబర్లను సంప్రదించండి. 


Also Read: AP SSC Result 2021: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... పదో తరగతి విద్యార్థులకు ఇకపై మార్కులే... గ్రేడింగ్ విధానానికి స్వస్తి


కంపెనీలు, భర్తీ చేయనున్న ఖాళీలు


మోర్‌ రిటైల్‌ ఇండియా (30), ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ (15), రైజింగ్‌ స్టార్స్‌ హైటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎల్‌ఈడీ టీవీ ప్రాజెక్ట్‌) (100), హీరో మోటో కార్పొరేషన్‌లో 50 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ మేళాకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు ముందుగా https://apssdc.in/home/ వెబ్ సైట్‌లో రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. 


 






 Also Read: Neelakurinji Flowers: కొడగు కొండల్లో నీలకురింజి అందాలు ... పన్నెండేళ్ల తర్వాత వికసించిన వనాలు... క్యూ కట్టిన ప్రకృతి ప్రేమికులు