ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలకు గుడ్‌న్యూస్‌. రాష్ట్రంలోని కడప, చిత్తూరు జిల్లాలోని అంగన్ వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటి ద్వారా మొత్తం 772 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో చిత్తూరు జిల్లాలో 484, కడప జిల్లాలో 288 పోస్టులు ఉన్నాయి. అంగన్ వాడీ కార్యకర్త, అంగన్ వాడీ సహాయకురాలు, మినీ అంగన్ వాడీ కార్యకర్త పోస్టులను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. జిల్లాల  వారీగా వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేశారు. టెన్త్ పాస్ అయిన వివాహిత మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలాగే వీరు స్థానికంగా నివసిస్తుండాలి. 2021 జూలై 2 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

అంగన్‌ వాడీ కేంద్రాల వారీగా భర్తీ చేయనున్న ఖాళీలు, రోస్టర్‌ వివరాలను స్థానిక సీడీపీఓ (CPDO) కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 

వేతనం వివరాలు..అంగన్ వాడీ కార్యకర్త ఉద్యోగాలకు ఎంపికైన వారి వేతనం నెలకు రూ. 11500గా ఉంది. మినీ అంగన్ వాడీ కార్యకర్తకు నెలకు రూ. 7000 వేతనం చెల్లిస్తారు. ఇక సహాయకురాలి వేతనం నెలకు రూ.7000 ఉంటుంది. ఆసక్తి గల వారు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. 

చిత్తూరు జిల్లాలో ఖాళీలు.. చిత్తూరు జిల్లా పరిధిలో మొత్తం 484 పోస్టులు ఉన్నాయి. వీటిలో అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు 110, మినీ అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు- 65, సహాయకులు(ఆయాలు) ఖాళీలు- 309 ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను https://chittoor.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. 

కడప జిల్లాలో ఖాళీలు.. చిత్తూరు జిల్లా పరిధిలో మొత్తం 288 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 50 అంగన్‌ వాడీ కార్యకర్తలు, 225 మంది సహాయకులు, 13 మంది మినీ అంగన్‌ వాడీ కార్యకర్తల పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://kadapa.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 

Also Read: Navy Recruitment 2021: టెన్త్ అర్హతతో నేవీలో 302 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

Also Read: APP Recruitment: తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగాలు.. రూ.50 వేలకు పైగా జీతం.. దరఖాస్తు గడువు ఎప్పటి వరకంటే?