తెలంగాణలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టుల నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీపీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ప్రకటించింది. దీనికి సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న 151 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ గడువు సెప్టెంబర్ 4వ తేదీతో ముగియనుంది.


ఈ 155 పోస్టుల్లో మల్టీ జోన్‌ - 1 పరిధిలో 68, మల్టీ జోన్‌ -2 పరిధిలో 83 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారి వేతనం నెలకు (RPS 2020 ప్రకారం) రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు ఉంటుంది. కొత్త జోనల్‌ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన తొలి నోటిఫికేషన్‌ ఇదే కావడం విశేషం. రాత పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


Also Read: NIT Warangal Jobs: 50ఏళ్ల వయసున్న వాళ్లు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.. మీరు ట్రై చేశారా?


విద్యార్హత వివరాలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ/ బీఎల్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్ తర్వాత ఐదేళ్ల లా కోర్సు పూర్తి చేసిన వారు కూడా ఈ ఏపీపీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2021 జూలై 4 నాటికి రాష్ట్రంలోని ఏదైనా క్రిమినల్‌ కోర్టులో మూడేళ్లకు తగ్గకుండా అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ చేసి ఉండాలని రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో పాటు శారీరకంగా ఆరోగ్యవంతులై ఉండాలని పేర్కొంది. 


వయోపరిమితి..
అభ్యర్థులు 2021, జూలై 1 నాటికి 34 ఏళ్ల లోపువారై ఉండాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.750 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా కేటగిరీల వారు రూ.1500 ఫీజు చెల్లించాలి. రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 


మొత్తం పోస్టులు: 151
మల్టీ జోన్ - 1లో 68 పోస్టులు ఉన్నాయి. (జనరల్‌ అభ్యర్థులు: 27, బీసీ- ఏ : 5, బీసీ- బీ: 5, బీసీ- సీ: 1, బీసీ- డీ: 5, బీసీ- ఈ: 2, ఎస్సీ- 10, ఎస్టీ- 4, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు- 7, ఇతరులు- 2) 
మల్టీ జోన్‌ - 2లో 83 పోస్టులు ఉన్నాయి. (జనరల్‌ అభ్యర్థులు: 32, బీసీ-ఏ: 7, బీసీ-బీ: 7, బీసీ-సీ: 1, బీసీ- డీ: 5, బీసీ -ఈ: 3, ఎస్సీ- 12, ఎస్టీ- 6, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు- 8, ఇతరులు- 2) 


Also Read: Army TGC Recruitment: ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఆర్మీలో ఉద్యోగాలు...లక్షా యాభై వేలకుపైగా జీతం..


Also Read: BECIL Recruitment 2021: బీఈసీఐఎల్‌లో 162 ఉద్యోగాలు.. రూ.1.23 లక్షల వరకు జీతం..