భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ.. ఇండియన్ నేవీలో 302 ట్రేడ్స్‌మెన్‌ (స్కిల్డ్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మెషినిస్ట్, ప్లంబర్, పెయింటర్, ట్రెయిలర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, షీట్ మెటల్ వర్కర్, ఫిట్లర్ వంటి డిసిగ్నేటెడ్‌ ట్రేడ్‌, నాన్‌ డిజిగ్నేటెడ్‌ ట్రేడ్స్‌మెన్‌ పోస్టులను భర్తీ చేయనుంది.


ఈ ఉద్యోగ భర్తీ ప్రకటన వెలువడిన 50 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ఆగస్టు 20-27 ఎడిషన్‌లో ప్రచురితమైంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం https://www.indiannavy.nic.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 


ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ వేతనం (పేస్కేల్ లెవల్ 2 ప్రకారం) రూ. 19,900 నుంచి రూ. 63,200 వరకు ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు తమ దరఖాస్తులను పోర్ట్‌‌బ్లెయర్‌లోని నేవల్‌ షిప్‌ రిపేర్‌ యార్డ్‌ అడ్రస్‌కు (ఆఫ్‌లైన్‌ విధానంలో) పంపాల్సి ఉంటుంది. 


విద్యార్హత వివరాలు..
పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్) పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎక్స్‌నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ చేసిన వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొంది. 


విభాగాల వారీగా ఖాళీలు.. 


డిసిగ్నేటెడ్‌ ట్రేడ్‌: 
మెషినిస్ట్‌- 16, ప్లంబర్‌ (ITI) / పైప్‌ ఫిట్టర్‌ - 8, పెయింటర్‌ (జనరల్) - 7, టైలర్‌ (జనరల్) - 6, వెల్డర్‌ (గ్యాస్ & ఎలక్ట్రిక్) - 20, మెకానిక్‌ ఎంటీఎం - 7, వెల్డర్‌ (గ్యాస్ & ఎలక్ట్రిక్) షిప్ ఫిట్టర్ - 3, షీట్‌ మెటల్‌ వర్కర్‌ - 1 పోస్టులు ఉన్నాయి. 
నాన్ డిసిగ్నేటెడ్‌ ట్రేడ్‌: 
ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ (రాడార్ / రేడియో ఫిట్టర్, ఎలక్ట్రిక్ ఫిట్టర్, కంప్యూటర్ ఫిట్టర్ మొదలైనవి) - 33, ఎలక్ట్రానిక్స్ మెకానిక్‌ (గైరో/ మెషినరీ కంట్రోల్ ఫిట్టర్) - 13, ఎలక్ట్రిషన్‌ - 29, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌ - 8, ఫిట్టర్  - 37, మెకానిక్ (డీజిల్) - 42, Ref & ఏసీ మెకానిక్‌ - 11, షీట్‌ మెటల్‌ వర్కర్‌ - 18, కార్పెంటర్‌ - 33, మాసన్‌ (బిల్డింగ్ కన్‌స్ట్రక్టర్) - 7, ఎలక్ట్రిక్ మెకానిక్ - 1 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
ది కమోడోర్ సూపరింటెండెంట్ (ఫర్ Oi/C రిక్రూట్ మెంట్ సెల్), 
నేవల్ షిప్ రిపైర్ యార్డ్ (PBR), 
పోస్ట్ బాక్స్ నంబర్. 705, 
హడ్డో, పోర్ట్‌‌బ్లెయర్‌ – 744102, 
సౌత్ అండమాన్. 


Also Read: APP Recruitment: తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగాలు.. రూ.50 వేలకు పైగా జీతం.. దరఖాస్తు గడువు ఎప్పటి వరకంటే?


Also Read: Army TGC Recruitment: ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఆర్మీలో ఉద్యోగాలు...లక్షా యాభై వేలకుపైగా జీతం..