Shashi Tharoor Memes: శశి థరూర్ పై ఈ ఫన్నీ మీమ్స్ చూశారా..? పొట్ట చెక్కలవ్వాల్సిందే

కాంగ్రెస్ నేత శశిథరూర్ పై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వీటిపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ.. చమత్కారంగా ట్వీట్ చేశారు.

Continues below advertisement

కాంగ్రెస్ నేత శశి థరూర్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. అయితే ఇందుకు ఆయన ఏం చేయలేదు. కానీ కొంతమంది ఆయన ఫొటోతో చేసిన మీమ్స్ ట్విట్టర్, ఫేస్ బుక్ ను షేక్ చేస్తున్నాయి. 

Continues below advertisement

ఆయన ఓ గుడిలో కొబ్బిరికాయ కొడుతోన్న ఫొటోను వివిధ రకాలుకా మీమ్స్ లా మార్చారు. డబ్ల్యూడబ్ల్యూఈలో రెజ్లర్ ను కొడుతున్నట్లు, క్రికెట్ ఫీల్డ్ లో బంతి విసురుతున్నట్లు, టీ వడకడుతున్నట్లు.. ఇలా వివిధ రకాల మీమ్స్ తయారు చేశారు. ఇవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ట్విట్టర్ 8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఈ తిరువనంతపురం ఎంపీ.. ఈ మీమ్స్ ను రీట్వీట్ చేశారు. ఇవి చేసిన ఎడిటర్ కు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ పెట్టారు.

Also Read: Afganisthan Crisis: అఫ్గాన్ పరిస్థితులపై అఖిలపక్ష భేటీ.. హాజరైన పలువురు నేతలు

Continues below advertisement