పెళ్లి పీటలేక్కతున్న టాలీవుడ్ యంగ్ హీరో!
ఈమధ్య చిత్ర పరిశ్రమలో ఉన్న యంగ్ హీరోలు తమ బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మన టాలీవుడ్ లో యంగ్ హీరో శర్వానంద్ ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకొని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ భై చెప్పి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని ఏడేళ్లు ప్రేమించి రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. పెద్దల అంగీకారంతోనే త్వరలోనే చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక ఈ లిస్టులో మరో యంగ్ హీరో కూడా చేరిపోయాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


‘జవాన్‘ దర్శకుడితో చేతులు కలపనున్న ‘పుష్ప‘- త్వరలో పాన్ ఇండియన్ మూవీ షురూ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం దేశంలోనే అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి. ‘పుష్ప: ది రైజ్’ మూవీలో నటనకు గాను ఇటీవలే బన్నీకి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమా తొలి పార్టుకు మించి హిట్ అయ్యేలా సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అటు  ‘పుష్ప’ చిత్రం పాన్ ఇండియా రేంజిలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 2021లో విడుదలైన ఈ మూవీ రూ. 320 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన  కొత్త చరిత్ర లిఖించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


భారీ బడ్జెట్, బాలీవుడ్ డైరెక్టర్ - లక్కీ ఛాన్స్ కొట్టేసిన ‘కాంతార’ హీరో
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాలు ఒకటి తర్వాత ఒకటి కేవలం ఇండియన్ మాత్రమే కాదు ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నాయి. ముందుగా టాలీవుడ్.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేస్తే.. ఆ తర్వాత కోలీవుడ్, మాలీవుడ్ కూడా ఇదే బాటలో నడిచాయి. అయితే వీటన్నింటిని దాటుకుంటూ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ‘కేజీఎఫ్’ లాంటి చిత్రంతో తన మార్కెట్ స్థాయిని పెంచుకున్న శాండిల్‌వుడ్.. ఆ తర్వాత వచ్చిన ‘కాంతార’తో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. అందుకే ‘కాంతార’లో రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిన ఒక టాప్ బాలీవుడ్ డైరెక్టర్.. తనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


సమంత ఎక్కడా? విజయ్ దేవరకొండకు స్టేజ్ మీదే నాగార్జున పంచ్
‘బిగ్ బాస్’ సీజన్ 7 మరికొద్ది సేపట్లో మొదలుకానుంది. ఇప్పటికే కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా మంచి ఉత్సాహంతో కంటెస్టులను రిసీవ్ చేసుకుంటూ హౌస్‌లోకి పంపారు. ‘బిగ్ బాస్’ సీజన్ స్టేజ్‌పై హీరో విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి మెరిశారు. అయితే, ఈ షోకు విజయ్ దేవరకొండ ఒక్కడే రావడంపై నాగార్జున సెటైర్ వేయడం చర్చనీయంగా మారింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


అమెరికాలో సమంతకు చేదు అనుభవం, ఇంతకీ ఆ ఈవెంట్‌లో ఏం జరిగిందంటే?
అందాల తార సమంత ప్రస్తుతం అమెరికాలో ఉంది. మైయోసిటిస్ కు చికిత్స కోసం ఆమె గత కొంత కాలంగా అక్కడే ఉంటుంది. ఓవైపు ట్రీట్మెంట్ తీసుకుంటూనే అక్కడ నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నది. ఆగష్టు 15 సందర్భంగా ఇండియా డే పరేడ్ లో పాల్గొని సందడి చేసింది. రీసెంట్ గా డల్లాస్ లో ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ మీట్ కు హాజరైంది. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి కాసేపు సందడి చేసింది. అభిమానులను కలిసి వారితో ఫోటోలు దిగింది. అయితే, తాజాగా ఆమె పాల్గొన్న ఓ ఈవెంట్ లో చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. నిర్వాహకులు ఆమెకు చిరాకు కలిగించడంతో అనుకున్న సమయానికి కంటే ముందుగానే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయిందట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)