‘బిగ్ బాస్’ సీజన్ 7 మరికొద్ది సేపట్లో మొదలుకానుంది. ఇప్పటికే కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా మంచి ఉత్సాహంతో కంటెస్టులను రిసీవ్ చేసుకుంటూ హౌస్‌లోకి పంపారు. ‘బిగ్ బాస్’ సీజన్ స్టేజ్‌పై హీరో విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి మెరిశారు. అయితే, ఈ షోకు విజయ్ దేవరకొండ ఒక్కడే రావడంపై నాగార్జున సెటైర్ వేయడం చర్చనీయంగా మారింది.
సమంత ఎక్కువ?
‘ఖుషి’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా విజయ్ దేవరకొండ ‘బిగ్ బాస్’ స్టేజ్ మీదకు వచ్చాడు. అయితే ఒక్కడే రావడంతో నాగార్జున వెంటనే ‘‘సమంత ఎక్కడా?’’ అని అడిగారు. అయితే, దీనికి విజయ్ ఏం సమాధానం ఇచ్చాడనేది షోలో చూడాల్సిందే. ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి వచ్చి ఆకట్టుకున్నాడు. నిన్ను భరించడం కష్టమే అన్నట్లుగా నాగార్జున పంచ్‌లు విసిరారు. ఆ తర్వాత హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లను చూపించారు. అయితే, సస్పెన్స్ కోసం ముఖాలు చూపించలేదు.
నిజంగానే ఉల్టాఫల్టా..
సాధారణంగా ‘బిగ్ బాస్’ ఎండింగ్‌లో క్యాష్ బ్యాక్స్ ఇచ్చి బయటకు వెళ్లిపోయేందుకు చివరి 5 సభ్యులు లేదా ముగ్గురు సభ్యులకు ఆఫర్ ఇస్తారు. అయితే, ఈ సారి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ ఐదుగురికే ఆ అవకాశం వచ్చింది. హౌస్‌లోకి వచ్చిన వెంటనే వారికి ‘బిగ్ బాస్’ ఓ సూట్‌కేసు ఇచ్చాడు. ఎవరైనా బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లిపోవాలని అనుకుంటే ఆ సూట్‌కేస్‌తో ఇప్పుడే వెళ్లిపోవచ్చని నాగార్జున షాకిచ్చారు. మరి కంటెస్టెంట్లు ఏ నిర్ణయం తీసుకున్నారనేది షో మొదలయ్యాక చూడాల్సిందే. మొత్తానికి కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఎవరెవరు వెళ్లారో తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. సాయంత్రం 7 గంటల నుంచి ఈ షో ప్రసారం కానుంది. అప్పటి వరకు ఈ ప్రోమోను చూడండి.
ప్రస్తుతం వైరల్ అవుతోన్న కంటెస్ట్‌ల జాబితా ఇదే:
1. శోభా శెట్టి (‘కార్తీక దీపం’ మోనిత)2. అమర్ దీప్ (‘జానకి కలగనలేదు’ నటుడు) 3. ‘ఆట’ సందీప్ (కొరియోగ్రాఫర్), ఆయన భార్య4. అంజలి పవన్5. అబ్బాస్ (హీరో)6. శివాజీ (హీరో)7. షకీలా (నటి)8. నరేష్ (జబర్దస్త్)9. బుల్లెట్ భాస్కర్ (జబర్దస్త్)10. ప్రత్యూష (టీవీ-9 యాంకర్)11. నిఖిల్ (యాంకర్)12. ప్రియాంక జైన్ (‘జానకి కలగనలేదు’ నటి)13. శుభశ్రీ (రుద్రవీణ నటి)14. పల్లవి ప్రశాంత్ (రైతు)15. అన్షు రెడ్డి (నటి)16. దామిని (సింగర్)17. అనీల్ గీలా (మై విలేజ్ షో - యూట్యూబ్ స్టార్)18. కమెడియన్ మహేష్ ( ‘రంగస్థలం’ సహ నటుడు)19. సాగర్ (‘మొగలి రేకులు’ నటుడు)20. అర్జున్ అంబటి (‘అగ్నిసాక్షి’ నటుడు)21. ప్రిన్స్ యవార్ (‘నా పేరు మీనాక్షి’ నటుడు)22. టేస్టీ తేజా (జబర్దస్త్ ఫేమ్)23. గౌతమ్ కృష్ణ (‘ఆకాశవీధిలో’ నటుడు)24. శ్వేతా నాయుడు (సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్)
గమనిక: సోషల్ మీడియా, ఇతరాత్ర విశ్వసనీయ సమాచారం ప్రకారం పై జాబితాలోని సెలబ్రిటీల వివరాలను అందించాం. ఆఖరి క్షణంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. దీన్ని అధికారిక జాబితా భావించవద్దని మనవి.
Also Read: అల్లు అర్జున్‌కు నిర్మాత మండలి లేఖ - సోషల్ మీడియాలో షేర్