ఓటీటీలో అదరగొడుతున్న గోపిచంద్ డిజాస్టర్ మూవీ - నెట్ ఫ్లిక్స్ టాప్-1 ట్రెండింగ్ లో రామబాణం!
యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా నటించిన 'రామబాణం' ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. చాలా ఆలస్యంగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కి తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు టాప్ ట్రెండింగ్ వన్ లో దూసుకుపోతుంది. రీసెంట్ టైమ్స్ లో థియేటర్స్ లో లాంగ్ రన్ కంటిన్యూ చేయలేకపోయిన 'రామబాణం', 'ఏజెంట్' ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. వీటిల్లో 'ఏజెంట్' ఇప్పటివరకు విడుదల కానప్పటికీ, 'రామబాణం' మాత్రం సెప్టెంబర్ 14న నెట్ ఫ్లిక్స్ లో విడుదలై ఇప్పుడు టాప్ వన్ ట్రెండింగ్ లో ఉంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘హాయ్ నాన్న‘లో ఫస్ట్ సాంగ్ రిలీజ్, మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన అబ్దుల్ వహాబ్
‘దసరా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని.. ‘హాయ్ నాన్న’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ‘దసరా’లో ఊరమాస్ లుక్ లో అలరించిన నాని, ఈ సినిమాలో ఓ పాపకు తండ్రిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ, ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రామ్ అంటే అంత అభిమానం - కుమారుడికి కొత్త సినిమా పేరు పెట్టేశారు!
ప్రేక్షకులందు తెలుగు సినిమా ప్రేక్షకులు వేరయా అని చెప్పాలి! తెలుగు ప్రజలకు ఎవరైనా నచ్చితే వాళ్ళను గుండెల్లో పెట్టుకుంటారు. అభిమానం చూపించడంలో తెలుగు వాళ్ళను మించిన వాళ్ళు లేరని చెప్పాలి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత తరంలో హీరోలకూ డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అభిమానంతో తమ పిల్లలకు తారక రామారావు, చిరంజీవి, పవన్, మహేష్ ఇలా పేర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని వీరాభిమాని ఒకరు చేసిన పని తెలిస్తే... ఆయన అంటే ప్రేక్షకులకు ఎంత అభిమానం అనేది తెలుస్తుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
కల్ట్ మామ - 'స్కంద'లో ఊర్వశి స్పెషల్ సాంగ్!
రామ్ పోతినేని కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సినిమా 'స్కంద'. శ్రీ లీల కథానాయికగా నటించారు. సయీ మంజ్రేకర్ ఓ కీలక పాత్ర చేశారు. వీళ్ళిద్దరూ కాకుండా సినిమాలో మరొక అందాల భామ, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఉన్నారు. ఆవిడ స్పెషల్ సాంగ్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఓటీటీలో అభిషేక్ పిక్చర్స్ 'ప్రేమ విమానం' - రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ ఇండస్ట్రలో పలువురు దర్శక, నిర్మాతలు ఓటీటీల కోసం స్వయంగా వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 'జీ 5', 'ఆహా' ఓటీటీ సంస్థల కోసం తెలుగులో ఎక్కువ ఓటీటీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. సక్సెస్ అవుతున్నారు. త్వరలోనే ప్రముఖ ఓటీటీ 'జీ 5'లో మరో ఇంట్రెస్టింగ్ వెబ్ ఫిల్మ్ రాబోతోంది. ఆ వెబ్ ఫిల్మ్ పేరే 'ప్రేమ విమానం'. 'గూడచారి', 'రావణాసుర' సినిమాలను నిర్మించి, కళ్యాణ్ రామ్ తో 'డెవిల్' సినిమా నిర్మిస్తున్న అభిషేక్ పిక్చర్స్ సంస్థ 'జీ 5' ఓటీటీతో కలిసి 'ప్రేమ విమానం' నిర్మించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)