‘దసరా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని.. ‘హాయ్ నాన్న’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ‘దసరా’లో ఊరమాస్ లుక్ లో అలరించిన నాని, ఈ సినిమాలో ఓ పాపకు తండ్రిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ, ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టింది.   


‘హాయ్ నాన్న’ మ్యూజిక్ మ్యాజిక్ షురూ


త్వరలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో మ్యూజిక్ మ్యాజిక్ షురూ అయ్యింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా తొలి లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నట్లు హీరో నాని ఇప్పటికే వెళ్లడించారు. అందులో భాగంగానే ‘సమయమా..‘ అంటూ సాగే పాటకు సంబంధించిన గ్లింప్స్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌ లో  నాని, మృణాల్.. ఇద్దరూ మరింత క్యూట్‌గా కనిపించారు. ప్రేక్షకులను కూడా ఈ గ్లింప్స్ బాగా ఆకట్టుకుంది.


మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తున్న లిరికల్ సాంగ్


తాజాగా ఈ సినిమాకు సంబంధించి తొలి లిరికల్ వీడియోను విడుదల చేశారు. ‘సమయమా..భలే సాయం చేసావమ్మా ఒట్టుగా..కనులకే తన రూపాన్ని అందించావు గుట్టుగా..’ అంటూ సాగే ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి, సితార కృష్ణ కుమార్ అద్భుతంగా పాడారు. ఈ పాట వింటున్నా కొద్దీ వినాలి అనిపించేలా ఉంది. ఈ లిరికల్ వీడియోలో నాని, మృణాల్ ఠాకూర్ మరింత అందంగా కనిపించారు. మలయాళీ సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ఈ పాట ఆకట్టుకుంటోంది. యంగ్ డైరెక్టర్ శౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం హిస్తున్నాడు.  అబ్దుల్ వహాబ్  తాజాగా సంగీతం అందించిన ‘ఖుషి’ చిత్రం మ్యూజిక్ పరంగా అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ‘హాయ్ నాన్న’ మ్యూజిక్ పైనా భారీగా అంచనాలు నెలకొన్నాయి.



‘హాయ్ నాన్న‘ ఆడియో రైట్స్ దక్కించుకున్న టీ సిరీస్


ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్ ను టీ సిరీస్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అన్ని భాషల్లో ఆడియో రైట్స్ కోసం రూ. 9 కోట్లతో డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.  ఇక ఈ సినిమాను మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల కలిసి వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.  


డిసెంబర్ 21న  ప్రపంచ వ్యాప్తంగా విడుదల


‘హాయ్ నాన్న‘ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, నాని కూతురిగా బేబి కైరా ఖన్నా కనిపించనుంది. స్టార్ హీరోయిన్ శృతి హాసన్  ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమాను డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు.


Read Also: ప్రభాస్ సినిమాలో భారీ ఫైట్, విలన్లను ఉతికి ఆరేస్తున్న హీరోయిన్ - అరెరే వీడియో లీక్ అయ్యిందే!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial