టాలీవుడ్ ఇండస్ట్రలో పలువురు దర్శక, నిర్మాతలు ఓటీటీల కోసం స్వయంగా వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 'జీ 5', 'ఆహా' ఓటీటీ సంస్థల కోసం తెలుగులో ఎక్కువ ఓటీటీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. సక్సెస్ అవుతున్నారు. త్వరలోనే ప్రముఖ ఓటీటీ 'జీ 5'లో మరో ఇంట్రెస్టింగ్ వెబ్ ఫిల్మ్ రాబోతోంది. ఆ వెబ్ ఫిల్మ్ పేరే 'ప్రేమ విమానం'. 'గూడచారి', 'రావణాసుర' సినిమాలను నిర్మించి, కళ్యాణ్ రామ్ తో 'డెవిల్' సినిమా నిర్మిస్తున్న అభిషేక్ పిక్చర్స్ సంస్థ 'జీ 5' ఓటీటీతో కలిసి 'ప్రేమ విమానం' నిర్మించింది. 


ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా 'ప్రేమ విమానం' టీజర్ విడుదల చేశారు. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా నటించారు. అతని సరసన 'పుష్పక విమానం' మూవీ ఫేమ్ శాన్వి మేఘన కథానాయిక. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్, బాలనటలు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ కటా దర్శకత్వం వహించారు. అక్టోబర్ 13 నుంచి 'ప్రేమ విమానం' చిత్రాన్ని 'జీ 5' ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే కొన్ని ఫీల్ గుడ్ వెబ్ సిరీస్ లను నిర్మించి సక్సెస్ అందుకున్న 'జీ5' సంస్థ 'ప్రేమ విమానంతో' ఎలాంటి సక్సెస్ ని అందకుంటారో చూడాలి.


Also Read ఏవయ్యా అట్లీ - నీకు హీరోయిన్లను చంపే శాడిజం ఏంటయ్యా?






'ప్రేమ విమానం' విషయానికి వస్తే... ఇందులో ముఖ్యంగా రెండు కథలు ఉన్నాయి. ఒకటి, ఓ పల్లెటూరిలో ఇద్దరు చిన్నారులు విమానం ఎక్కాలని ఆశపడడం.. రెండోది, ఓ జంట ప్రేమ కథ. ఆ రెండిటిని డైరెక్టర్ లింక్ చేస్తూ ఇందులో ఇంట్రెస్టింగ్ గా చూపించబోతున్నారు. ఇటీవలే విమానం కాన్సెప్ట్ తో ఇదే 'జీ5' ఓటీటీలో 'విమానం' అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా కథాంశం కూడా, విమానం ఎకాలని ఓ చిన్నారి కలలు కనడం మీదే ఉంటుంది. అయితే కథాంశం ఒక్కటే అయినా కథా, కథనాలు మాత్రం వేరుగా ఉండనున్నట్లు తెలుస్తోంది.


టీజర్ చూస్తే... ఓ పల్లెటూరులో ఇద్దరు చిన్నారులు కొండ ఎక్కినప్పుడు, ఆకాశంలో విమానం వెళుతూ ఉంటుంది. 'అరే మనం కూడా విమానంలో పోదాం రా' అని ఓ చిన్నారి అంటాడు. ఆ తర్వాత విమానం అంత ఎత్తులో ఎలా ఎగురుతుంది అనే సందేహం ఆ చిన్నారులకు కలుగుతుంది. దాంతోపాటు ఇంకా బోలెడు సందేహాలు వస్తాయి. వాటిని తమ గూడెంలో ఉన్న వ్యక్తి (వెన్నెల కిషోర్) ను అడుగుతారు. తరచూ వాళ్ళు అడిగే సందేహాలకు విసుగు వచ్చి 'విమానం కనిపెట్టిన రైట్ సోదరులకు కూడా ఇన్ని డౌట్స్ వచ్చిండవు, ఏం పీకుతార్రా విమానం గురించి తెలుసుకొని' అంటూ వెన్నెల కిషోర్ తనదైన శైలిలో డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరో, హీరోయిన్ మధ్య లవ్ స్టోరీని కూడా కాస్త ఫన్నీ వేలో చూపించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ వెబ్ ఫిల్మ్ కి జగదీష్ చీకటి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా, అమర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.


Also Read : అందుకే నన్ను 'DJ టిల్లు' సీక్వెల్‌లో హీరోయిన్‌గా తీసుకోలేదు - నేహా శెట్టి




Join Us on Telegram: https://t.me/abpdesamofficial