కథానాయికలలో నిత్యా మీనన్ (Nithya Menon)ది భిన్నమైన ప్రయాణం! నటిగా ప్రతి రోజూ నలుగురి ముందు ఉండాలని ఆమె కోరుకోరు. ఓ నాలుగు పాటలు, ఓ ఐదారు సన్నివేశాలకు పరిమితం అయ్యే కమర్షియల్ కథానాయిక పాత్రల వెంట పరుగులు తీయరు. మనసుకు నచ్చిన కథలు, క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులలో తనకు అంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మరో కొత్త కథతో ఓటీటీ వీక్షకుల ముందుకు రానున్నారు.


'కుమారి శ్రీమతి'గా నిత్యా మీనన్!
నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఓటీటీ ప్రాజెక్ట్ 'కుమారి శ్రీమతి' (Kumari Srimathi). దీనికి శ్రీనివాస్ అవసరాల రైటర్ అండ్ క్రియేటర్ (Srinivas Avasarala). తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. 


ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం 'కుమారి శ్రీమతి' వెబ్ సిరీస్ రూపొందించారు. వెబ్ ప్రాజెక్ట్స్ నిర్మించడం కోసం ప్రముఖ నిర్మాత సంస్థ కొత్త బ్యానర్ 'ఎర్లీ మూన్ సూన్ టేల్స్' ప్రారంభించింది వైజయంతి మూవీస్. ఆ సంస్థతో కలిసి స్వప్న సినిమా ప్రొడ్యూస్ చేసిన వెబ్ సిరీస్ ఇది. దీనికి గోమటేష్ ఉపాధ్యాయు దర్శకత్వం వహించారు. ఇవాళ 'కుమారి శ్రీమతి' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అలాగే, మోషన్ పోస్టర్ కూడా! పల్లెటూరి నేపథ్యంలో కథతో 'కుమారి శ్రీమతి' రూపొందుతోందని అర్థం అవుతుంది. అమ్మాయి పేరు శ్రీమతి. ఆమెకు పెళ్లి కాలేదు కనుక... 'కుమారి శ్రీమతి' అంటున్నారు. ఇది శ్రీనివాస్ అవసరాల మార్క్ అన్నమాట. 


Also Read ఏవయ్యా అట్లీ - నీకు హీరోయిన్లను చంపే శాడిజం ఏంటయ్యా?






'అబ్దుల్ కలాం అంట... రజనీకాంత్ అంట... తర్వాత ఈవిడే నంట... ఉద్యోగం సద్యోగం చేయదంట... బిజినెస్సే చేస్తాదంట... కుటుంబాన్ని మొత్తం ఈవిడే లాక్కోస్తుందట. పెళ్లి గిళ్లీ వద్దంట వదిన. ఇట్టానే ఉండిపోదట' అని ఓ మహిళ మాటలు 'కుమారి శ్రీమతి' మోషన్ పోస్టర్ మొదలైన తర్వాత వినిపిస్తాయి. 'ఎవరి గురించి వదినా నువ్వు మాట్లాడేది?' అని మరో మహిళ అడిగితే... 'ఉందిగా ఆ దేవికమ్మ పెద్ద కూతురు' అని సమాధానం చెబుతుంది. అప్పుడు అర్థం అవుతుంది. దాంతో 'ఓహో! శ్రీమతా...' అని తెలిసినట్టు చెబుతుంది. అవును... 'కుమారి శ్రీమతి' అని ఆన్సర్! అప్పుడు నిత్యా మీనన్ ఫేస్ చూపించారు.  


Also Read  నా ప్రతి కన్నీటి చుక్కకూ బాధ పడ్డారు, ఫ్యాన్స్‌కు పాదాభివందనం - 'సైమా'లో ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్


తెలుగు తెరకు పరిచయమైన 'అలా మొదలైంది' నుంచి మొదలు పెడితే... 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే', 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'జనతా గ్యారేజ్' వంటి పలు హిట్ సినిమాల్లో నిత్యా మీనన్ నటించారు. ఇతర భాషల్లో కూడా ఆమె సినిమాలు చేశారు. ఆవిడ ఓటీటీకి కొత్త ఏమీ కాదు. 


అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ 'బ్రీత్' రెండు, మూడు సీజన్లలో నిత్యా మీనన్ నటించారు. 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' యాంథాలజీలో కూడా ఉన్నారు.    




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial