రామ్ పోతినేని (Ram Pothineni) కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సినిమా 'స్కంద' (Skanda Movie). శ్రీ లీల కథానాయికగా నటించారు. సయీ మంజ్రేకర్ ఓ కీలక పాత్ర చేశారు. వీళ్ళిద్దరూ కాకుండా సినిమాలో మరొక అందాల భామ, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఉన్నారు. ఆవిడ స్పెషల్ సాంగ్ చేశారు. 


సెప్టెంబర్ 18న 'కల్ట్ మామ' విడుదల! 
స్పెషల్ సాంగ్స్ చేయడం కోసమే అన్నట్లు గతంలో కొందరు అందాల భామలు ఉండేవారు. అగ్ర కథానాయికలు సైతం ప్రత్యేక గీతాలు చేయడానికి పచ్చ జెండా చూపించడంతో ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్స్ అంటూ లేకుండా పోయారు. మళ్ళీ ఇన్నాళ్ళకు స్పెషల్ సాంగ్స్ అంటే ఊర్వశి రౌతేలా అనేంతగా తెలుగులో ఆమె వరుసగా ప్రత్యేక గీతాలు చేస్తున్నారు. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', పవన్ కళ్యాణ్ & సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో', అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమాల్లో ఊర్వశి సాంగ్స్ చేశారు. 'స్కంద'లో కూడా ఓ పాటలో ఆమె కనువిందు చేయనున్నారు. 


'స్కంద'లో రామ్, ఊర్వశి రౌతేలాపై 'కల్ట్ మామ' సాంగ్ చిత్రీకరించారు. దాని కోసం ఎస్ తమన్ మాంచి మాస్ బీట్ అందించారని సమాచారం. ఆ పాటను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. 


Also Read : రామ్ అంటే అంత అభిమానం - కుమారుడికి కొత్త సినిమా పేరు పెట్టేశారు!






జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఉన్నత సాంకేతిక విలువలు, భారీ నిర్మాణ వ్యయంతో శ్రీనివాస చిట్టూరి 'స్కంద' చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 28న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.


Also Read ఏవయ్యా అట్లీ - నీకు హీరోయిన్లను చంపే శాడిజం ఏంటయ్యా?  



'స్కంద' టీజర్, ట్రైలర్ చూస్తే... ఇదొక మాస్ యాక్షన్ ఫిల్మ్ అని అర్థం అవుతోంది. అయితే... బోయపాటి సినిమాల్లో కుటుంబ సభ్యుల అనుబంధాలు తప్పకుండా ఉంటాయి. 'డుమ్మారే డుమ్మా డుమ్మారే...' పాటలో ఫ్యామిలీ బాండింగ్ చూపించారు. 


రామ్ పోతినేని, శ్రీ లీల జంటగా నటించిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ రెండో కథానాయిక. శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, పృథ్వీరాజ్, ప్రిన్స్ ప్రధాన తారాగణం. 'స్కంద' చిత్రానికి కూర్పు : తమ్మిరాజు, ఛాయాగ్రహణం : సంతోష్ డిటాకే, సమర్పణ : జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, సంగీతం : ఎస్ తమన్, నిర్మాత : శ్రీనివాస చిట్టూరి, రచన - దర్శకత్వం : బోయపాటి శ్రీను.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial