ఆ కన్నడ బ్లాక్ బస్టర్ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న 'బ్రో' నిర్మాతలు!
ఈమధ్య కాలంలో ఇతర భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సినిమాలను టాలీవుడ్ మేకర్స్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కన్నడ, మలయాళ ఇండస్ట్రీస్ నుంచి ఈ మధ్యకాలంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు తెలుగులో కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నాయి. వాటిలో 'కాంతారా', 'చార్లీ777', '2018' వంటి సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. ఇప్పుడు మరో కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమైంది. ఇటీవల రక్షిత్ శెట్టి ప్రొడ్యూస్ చేస్తూ హీరోగా నటించిన 'సప్త సాగర దాచే ఎల్లో' అనే చిత్రం కన్నడలో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో రిలీజ్ చేస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మహేష్ బాబు జిమ్ టిప్స్ - ఇలా వర్కవుట్ చేయాలట!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్ నెస్ విషయంలో ఎవడి మాట వినేది లేదంటారు. ఐదు పదుల వయసుకు దగ్గరవుతున్నా, పాతికేళ్ల కుర్రాడిలా ఫిట్ గా కనిపిస్తారు. బాడీని మెయింటెయిన్ చేయడంలో టాలీవుడ్ లో ఆయన తర్వాతే మరెవరైనా అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఆయను మీ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో చెప్పండి అని అడుగుతుంటారు. సింపుల్ గా ఆయన ఓకే మాట చెప్తారు. చక్కటి పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అంటారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'మార్క్ ఆంటోనీ' రివ్యూ : టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో విశాల్ సినిమా - ఎలా ఉందంటే?
విశాల్ (Vishal), ఎస్.జె. సూర్య నటించిన టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ సినిమా 'మార్క్ ఆంటోనీ' (Mark Antony Movie). ఇటీవల ఈ జానర్ సినిమాలు తీసే దర్శక, రచయితలు పెరుగుతున్నారు. తమిళ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ రెట్రో నేపథ్యంలో 'మార్క్ ఆంటోనీ' తీశారు. ఇంతకు ముందు శింబుతో 'ఎఎఎ', ప్రభుదేవా హీరోగా 'భగీర' తీశారు. ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి. మరి, సినిమా (Mark Antony Review) ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఛాంగురే బంగారు రాజా రివ్యూ: రవితేజ నిర్మించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించడంతో పాటు ఈ మధ్య కొత్తవారిని ప్రోత్సహిస్తూ చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు కూడా. అలా నిర్మించిన క్రైమ్ కామెడీ థ్రిల్లరే ‘ఛాంగురే బంగారు రాజా’. సినిమా ప్రమోషన్లలో కూడా రవితేజ పాల్గొన్నారు. ‘ఛాంగురే బంగారు రాజా’ ట్రైలర్‌ను కూడా చాలా ప్రామిసింగ్‌గా కట్ చేశారు. దీనికి తోడు వినాయక చవితి నేపథ్యంలో మంచి రిలీజ్ డేట్ కూడా దొరికింది. మరి ఇంతకీ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
నటుడు నవదీప్ మెడకు డ్రగ్స్ కేసు ఉచ్చు, నోటీసులు జారీ చేసిన పోలీసులు
టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ మరోసారి డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. మాదాపూర్ డ్రగ్స్ వ్యవహారంలో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో దొరికిన డ్రగ్స్ కు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి నవదీప్ స్నేహితుడు రాంచంద్ ను నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనన నుంచి పోలీసులు కీలక విషయాలు సేకరించారు. నవదీప్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు అంచనాకు వచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)