Tummala : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రేతో పాటు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సలహా పలువురు నేతలు హైదరాబాద్‌లోని తుమ్మల ఇంటికి వెళ్లారు. పదిహేడో తేదీన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో విజయభేరి బహిరంగసభ నిర్వహిస్తోంది. ఆ సభలో తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో చేరే అవకాశం ఉంది.
ఈ నెల 16, 17 తేదీలలో జరుగనున్న సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర అగ్రనేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మలతో కాంగ్రెస్ నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశాలలోనే తుమ్మలను కాంగ్రెస్‌లో చేరేలా ఒప్పించినట్లుగా తెలుస్తోంది. పాలేరు టికెట్ తుమ్మలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పిందని తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే ఆమె స్థానం ఏంటి అనేది క్లారిటీ లేదు. పైగా ఆమె ఎక్కడ నుంచి పోటీ చేస్తుందనేది క్లారిటీ లేదు. ఇప్పటికే ఆమె పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ అక్కడ తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. దీంతో సీటు ఆయనకే దక్కే ఛాన్స్ ఉంది. ఒకవేళ షర్మిల తెలంగాణ ఎన్నికల బరిలో ఉంటే..ఆంధ్రా పెత్తనం అంటూ బీఆర్‌ఎస్ నాయకులు ప్రచారం చేసి..కాంగ్రెస్‌కి డ్యామేజ్ చేయవచ్చు అనేది తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్‌ని కేవిపి రామచంద్రరావు నడిపిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్‌కు నష్టం. అందుకే ఆమెకి జాతీయ స్థాయిలో కీలక పదవి ఇస్తారని అంటున్నారు.
వరుసగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేసి.. ఉమ్మడి ఖమ్మం జిల్లా, సత్తుపల్లికి గుర్తింపు తెచ్చారు. ఆ తర్వాత 2004లో జలగం వెంకటరావుపై ఓడిపోయారు. ఇక 2009లో సత్తుపల్లి ఎస్సీకి రిజర్వ్ కావటంతో ఖమ్మం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసిన జలగం వెంకటరావుపై స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అలాగే 2014లో కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయకుమార్ పైపోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2016లో పాలేరు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయం సాధించిన.. ఆయన ఇక్కడి నుంచే 2018 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తుమ్మలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాలలో గట్టి క్యాడర్ సంపాదించుకున్నారు.
ఆర్ఎస్ అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తుమ్మల పేరు లేకపోవడంతో బీఆర్ఎస్ లో మనుగడా కష్టమని భావించిన తుమ్మల కాంగ్రెస్ లో చేరుతున్నారు.