'పుష్ప' మూవీని మూడు సార్లు చూశాను, నీ నుంచి చాలా నేర్చుకోవాలి - బన్నీపై షారుఖ్ ప్రశంసలు
బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' ప్రస్తుతం బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ నార్త్, సౌత్ ఆడియన్స్‌ని తెగ ఆకట్టుకుంటుంది. ఆడియన్స్ తో పాటు సినీ సెలెబ్రిటీలు కూడా ప్రెజెంట్ 'జవాన్' ఫీవర్ లోనే ఉన్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్ మూవీ పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మన టాలీవుడ్ తరఫునుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'జవాన్'ని ప్రశంసిస్తూ ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్స్ చేశాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


నాని, మృణాల్ ఠాకూర్‌ల ‘హాయ్ నాన్న‘ మూవీ ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్ డేట్ ఫిక్స్!
‘దసరా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని.. ‘హాయ్ నాన్న’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ‘దసరా’లో ఊరమాస్ లుక్ లో అలరించిన నాని, ఈ సినిమాలో ఓ పాపకు తండ్రిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ, ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ప్రౌడ్ సే సింగిల్, ఇది భీమ్స్ బీట్ - ఎన్టీఆర్ బావమరిది నితిన్ 'మ్యాడ్'లో సాంగ్!
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది, పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాస రావు తనయుడు నార్నే నితిన్ ఓ కథానాయకుడిగా నటించిన చిత్రం 'మ్యాడ్' (MAD Movie). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్న చిత్రమిది. ఇందులో తొలి పాట 'ప్రౌడ్ సే సింగిల్' విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


థాంక్స్ చాలదు, సాంగ్స్ అదరగొట్టాలి - అల్లు అర్జున్, అట్లీ సినిమాకు అనిరుధ్ ఫిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2‘ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి బన్నీ, అట్లీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడైన అట్లీ చేసింది తక్కువ సినిమాలే అయినా సౌత్ టు నార్త్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ‘రాజా రాణి’ మొదలుకొని ‘జవాన్’ వరకు అద్భుత విజయాలు అందుకున్నారు. సినిమాల్లో హీరో పాత్రను అట్లీ ఎలివేట్ చేసే విధానం అద్భుతంగా ఉంటుంది. అందుకే ఆయనతో కలిసి సినిమాలు చేసేందుకు హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తారు.   (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్ - 'ఆర్ఆర్ఆర్'కు బెస్ట్ యాక్టర్‌గా అవార్డు
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ జూనియర్ (Jr NTR) ఉదయం దుబాయ్ వెళ్లారు. గురువారం బయలు దేరారు. పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ సైతం ఆయన వెంట ఉన్నారు. ఫ్యామిలీ అంతా కలిసి దుబాయ్ వెళ్లినప్పటికీ... ఇది హాలిడే ట్రిప్ కాదు! ఓ అవార్డు వేడుకలో పాల్గొనడానికి ఆయన వెళ్లినట్లు తెలిసింది. ఈ నెల 15, 16వ తేదీల్లో... శుక్రవారం, శనివారం నాడు సైమా (SIIMa Awards 2023) - సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలు దుబాయ్ (Dubai)లో జరుగుతాయి. వాటిలో పాల్గొనడానికి ఎన్టీఆర్ వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలో నటనకు గాను ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోనున్నారని సమాచారం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)