ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2‘ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి బన్నీ, అట్లీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడైన అట్లీ చేసింది తక్కువ సినిమాలే అయినా సౌత్ టు నార్త్ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ‘రాజా రాణి’ మొదలుకొని ‘జవాన్’ వరకు అద్భుత విజయాలు అందుకున్నారు. సినిమాల్లో హీరో పాత్రను అట్లీ ఎలివేట్ చేసే విధానం అద్భుతంగా ఉంటుంది. అందుకే ఆయనతో కలిసి సినిమాలు చేసేందుకు హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తారు.  


అట్లీతో బన్నీ మూవీ- మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్?


తాజాగా ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అట్లీ, అద్భుత విజయాన్ని అందుకున్నారు. తొలి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక అట్లీ నెక్ట్స్ సినిమా ఎవరితో చేస్తారు? అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అట్లీ బన్నీతో తదుపరి చిత్రం చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే  ఈ సినిమాకు సంబంధించి అట్లీ కొన్ని విషయాలను వెల్లడించారు. ఇప్పటికే తాను బన్నీకి కథ చెప్పినట్లు చెప్పారు. ప్రస్తుతం స్టోరీ గురించి చర్చలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఈ సినిమాపై ఓ క్లారిటీ వస్తుందన్నారు. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఓకే అయినట్లు తెలుస్తోంది. తాజాగా అనిరుధ్ ను బన్నీ పాటలు అడిగారు. దీంతో ఆయన తదుపరి చిత్రానికి అనిరుధ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక బన్నీ డిమాండ్ కు అనిరుధ్ రెడీ అంటూ రిప్లై ఇచ్చారు. 


Also Read : దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్ - 'ఆర్ఆర్ఆర్'కు బెస్ట్ యాక్టర్‌గా అవార్డు










‘జవాన్’ టీమ్ పై బన్నీ ప్రశంసలు


ఇక తాజాగా అల్లు అర్జున్ ‘జవాన్’ టీమ్ పై ప్రశంసలు కురిపిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘జవాన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో చిత్రబృందంపై అభినందనలు కురిపించారు. షారుఖ్ ఖాన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించింది. విజయ్ సేతుపతి నెగెటివ్ పాత్ర పోషించారు.  దీపికా పదుకొనె అతిథి పాత్రలో నటించింది. ఈ చిత్రానికి అనిరుధ్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పటికే ‘జవాన్’ చిత్రంపై పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. తాజాగా బన్నీ సైతం చిత్రబృందాన్ని అభినందిస్తూ ట్వీట్ పెట్టారు. ‘జవాన్’ షారుఖ్ మాస్ అవతార్ కు నిదర్శనం అన్నారు. ఈ చిత్రంలో  షారుఖ్ స్వాగ్ చూసి మెస్మరైజ్ అయినట్లు వెల్లడించారు. ఇక ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, దీపికా నటన, అనిరుధ్ మ్యూజిక్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కు అనిరుధ్ స్పందించారు. ‘థాంక్యూ మై బ్రో‘ అని రిప్లై ఇచ్చారు. సింపుల్‌గా థాంక్స్ చెప్పడం కాదు, నాక్కూడా మంచి పాటలు ఇవ్వాలన్నారు. దీంతో అల్లు అర్జున్ మూవీకి అనిరుధ్ ఫిక్స్ అయినట్లు అర్థం అవుతోంది. 


‘పుష్ప 2’లో నటిస్తున్న అల్లు అర్జున్


ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప2’లో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత సందీప్ వంగ, త్రివిక్రమ్ తో సినిమాలు చేయనున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక అట్లీతో మూవీ చేసే అవకాశం ఉంది.





Read Also: అమ్రీష్ పూరి మాంత్రికుడి గెటప్‌లో 'హైపర్' ఆది - కంట తడి పెట్టిన పూర్ణ



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial