Krishna Mukunda Murari September 14th: ముకుంద కృష్ణని ఎక్కడికి తీసుకెళ్లింది, ఎందుకు తీసుకెళ్లిందని మురారీ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ముకుంద వస్తుంది. కృష్ణని ఎక్కడికి తీసుకెళ్లావ్ అంటే పైకి రా చెప్తానని అంటుంది. దీంతో తన వెనుకాలే వెళతాడు. కృష్ణ కూడా అప్పుడే ఇంటికి వస్తుంది.


మురారీ: కృష్ణ ఎక్కడ ఉందో చెప్పు, తనని ఎక్కడికి తీసుకెళ్లావ్ ఎందుకు తీసుకెళ్లావ్. తనతో మన మ్యాటర్ చెప్పావా?


ముకుంద: అంటే నేను ఏమైపోయినా నీకు పర్వాలేదా? నా ప్రేమ నీకు ఎందుకు అర్థం కావడం లేదు


మురారీ: నువ్వు చెప్పకపోయిన కృష్ణ ఎక్కడ ఉందో నేను వెతికి తీసుకొచ్చుకుంటాను


ముకుంద: నీ కంటికి నేను క్రిమినల్ లాగా కనిపిస్తున్నానా? ఇదేనా నువ్వు అర్థం చేసుకుంది


మురారీ: నేను అలా అనలేదు. మీరిద్దరూ వెళ్ళేసరికి మన గురించి చెప్పావ్ అనుకుంటున్నా


Also Read: కావ్యపై చేయెత్తిన అపర్ణ- తల్లికి ఎదురుతిరిగిన రాజ్, రుద్రాణి పైశాచికానందం


ముకుంద: అవును కృష్ణకి మన ప్రేమ విషయం మొత్తం చెప్పేశాను


కృష్ణ మురారీ కోసం వెతుకుతూ వాళ్ళు ఉన్న ప్లేస్ దగ్గరకి వెళ్తుంది.


మురారీ: కృష్ణ దగ్గర విషయం దాచినందుకు క్షమించమని అడుగుతాను. తన దగ్గర నాకు ఎలాంటి ఇగో ఫీలింగ్స్ లేవు అని వెళ్లబోతుంటే ముకుంద అడ్డుపడుతుంది.


ముకుంద: నాకు నువ్వు కావాలి నా ప్రేమని రిజెక్ట్ చేయకు అనేసి హగ్ చేసుకుని ఏడుస్తుంది. మురారీ వదిలించుకోవాలని ట్రై చేస్తాడు. తనని వదిలేయమని గట్టిగా అరుస్తాడు. తనని వదలకపోతే ఇంకెప్పుడు నీ మొహం కూడ చూడనని అంటాడు. నువ్వు లేని లైఫ్ నేను ఊహించుకోలేను నువ్వు లేకుండా నేను బతకలేను


మురారీ ముకుందని తోసేసినా కూడా వదలకుండా హగ్ చేసుకుని ఉంటుంది. సరిగ్గా ఆ టైమ్ కి కృష్ణ వాళ్ళని చూసి షాక్ అవుతుంది. వాళ్ళని చూసి కుప్పకూలిపోతుంది.


ముకుంద: కృష్ణని వెంటనే ఇంట్లో నుంచి పంపించేయ్. నా భర్తగా నేను నిన్ను తప్ప ఎవరినీ ఊహించుకోలేను. నువ్వు కాదంటే చావడం తప్ప వేరే దారి కనిపించడం లేదు. ఇంక ఎన్నాళ్ళు నాకు ఓపిక నశించింది ప్లీజ్ అత్తయ్యకి నిజం చెప్పేసి మన పెళ్లి చేయమని అడుగుదాం. ఏం జరిగితే అది జరిగింది. ఈ దాగుడు మూతలు ఇక చాలు.


మురారీ: నువ్వు ఎన్ని చెప్పినా నీ మాట నేను వినను


కృష్ణకి అప్పుడు ముకుంద చెప్పిన ప్రేమ విషయం గుర్తు చేసుకుని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. మురారీ ముకుందని తోసేయడంతో తను కూలబడిపోతుంది.


ముకుంద: ఇన్నాళ్ళూ ఎన్ని అవమానాలు జరిగినా సహించాను. ఇక నా వల్ల కాదు నన్ను అర్థం చేసుకో ప్లీజ్ పెళ్లి చేసుకుందాం అని బతిమలాడుతుంది. మురారీ కోపంగా వెళ్ళిపోతాడు. కృష్ణ గదిలోకి వెళ్ళి  ముకుంద మాటలు తలుచుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది.


Also Read: తులసిపై ఒంటికాలి మీద లేచిన నందు- సామ్రాట్ కంపెనీ బాధ్యతలు తీసుకోమన్న పెద్దాయన


కృష్ణ: మా నాన్న కన్నా మిమ్మల్నే ఎక్కువ నమ్మాను. ఎందుకు నాకు ఇంత అన్యాయం చేశారు. నా దగ్గర నిజం ఎందుకు చేశారు. అన్ని అబద్ధాలు ఎందుకు చెప్పారు అని బాధపడుతుంది. అందరూ కలిసి నన్ను మోసం చేశారు. తప్పంతా నాదే అందరినీ గుడ్డిగా నమ్మి నేనే మోసపోయాను. తప్పు నాదే. ముకుంద నా ఫ్రెండ్ అని నిన్ను నమ్మితే వెన్నుపోటు పొడుస్తావా? ఇంత మోసమా? మనసులో ఇంత పెట్టుకుని ఎంత కపట నాటకాలు ఆడావ్. నేనేం ద్రోహం చేశాను నీకు


తరువాయి భాగంలో..


కృష్ణ కింద పడుకుంటుంటే బెడ్ మీద పడుకోవచ్చు కదా అని మురారీ అడుగుతాడు. కృష్ణ మౌనంగా ఉంటుంది. మీ రూమ్ లో పడుకోవడం ప్రాబ్లం అయితే చెప్పండి వెళ్ళి బయట పడుకుంటాను అని కోపంగా అంటుంది.