గుప్పెడంతమనసు సెప్టెంబరు 14 ఎపిసోడ్
ఏంజెల్ ఓవైపు, విశ్వనాథం మరోవైపు రిషిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు. మీ భార్య ఎవరు, ఎక్కడుందని అడుగుతారు. చెప్పి తీరాల్సిందే అంటారు...
రిషి: మనుషులు విడిపోయినంత మాత్రాన మనసులు విడిపోవు..మా మధ్య దూరం ఉండొచ్చు కానీ బంధం అలాగే ఉంది
ఇది విని వసుధార సంతోషిస్తుంది
ఏంజెల్: నీకు దూరంగా ఉందంటే అర్థం ఏంటి..ఇలా అర్థంకాని మాటలు చెప్పి తప్పించుకోవాలని చూడకు..తనెక్కడుందో చెప్పు రిషి. నువ్వు చెప్పడం లేదంటే నీ దగ్గర సమాధానం లేదనే కదా..అంటే నీకు పెళ్లి కాలేదనే కదా
రిషి: నాకు పెళ్లైంది
ఏంజెల్: నీ భార్య ఎక్కడుంది
రిషి: ఇక్కడే ఉంది..
ఏంజెల్: ఇక్కడంటే...వసుధార నీ భార్యా? రిషి అడుగుతోంది నిన్నే చెప్పు...
జగతి, రిషి, వసు, మహేంద్ర...అందరూ సైలెంట్ గా ఉండిపోతారు...
రిషి: వసుధార నా భార్య అని చెప్పానా
ఏంజెల్: ఇక్కడే ఉందంటే ఏంటి అర్థం..ఈ సిటీలో ఉందా, మన గల్లీలో ఉందా..ఇక్కడంటే ఎక్కడుంది..అడుగుతోంది నిన్నే చెప్పు..
రిషి: నా గుండెల్లోనే ఉంది
ఏంజెల్: నీకు పదిహేను రోజులు టైమ్ ఇస్తున్నా..ఈలోగా చెప్పి తీరాలి అని గడువు పెడుతుంది...లేదంటే నన్ను పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడుతుంది..
Also Read: DBST కాలేజీలోకి రిషి రీ ఎంట్రీ , శైలేంద్ర కుట్రకు జగతి చెప్పే సమాధానం ఇదేనా!
ఇంతలో ఫణీంద్ర పదే పదే కాల్ చేస్తుండడంతో లిఫ్ చేస్తుంది జగతి... అప్పుడు MSR కుట్ర మొత్తం చెబుతాడు. కాల్ కట్ చేసిన వెంటనే జగతి విశ్వనాథం వాళ్లకి చెప్పేసి వెంటనే బయలుదేరుతారు.. ఏదైనా సమస్యా అని విశ్వనాథం అడిగినా మేం చూసుకుంటాం సార్ అని చెప్పేస్తారు.
ఏంజెల్-విశ్వనాథం
రిషి పెళ్లికి ఒప్పుకున్నాడని ఆనందపడ్డాను,బంగారం లాంటి మనిషి ఈ ఇంటికి అల్లుడిగా వస్తున్నాడని సంబరపడ్డాను చివరి నిముషంలో నా ఆశలు అడియాశలు అయ్యాయని విశ్వనాథం బాధపడతాడు. ఇన్ని రోజులుగా లేనిది ఇప్పుడు తనకు పెళ్లైందని చెప్పడం నాకు ఆశ్చర్యంగా ఉందంటాడు. ఇలా జరిగినందుకు నీకు బాధగా లేదా అని ఏంజెల్ ను అడిగితే...లేదు నాకు మనసు తేలిగ్గా ఉందని చెబుతుంది. నేను రిషిని ప్రేమించలేదు, పెళ్లి చేసుకోవాలి అనుకున్నానంతే...రిషి మన దగ్గరకు వచ్చినప్పటి నుంచీ చూస్తున్నా ప్రతిక్షణం మూడీగా ఉండేవాడు, అడిగితే మాట దాటేస్తూ వచ్చాడు..రిషి చాలా మంచి మనిషి, తనని గౌరవిస్తాను...స్నేహాన్ని మించింది ప్రేమ అవుతుందేమో తెలీదు కానీ నేను నిజాయితీగా స్వచ్ఛమైన స్నేహాన్ని చూపించాలి అనుకున్నాను, తన గతం తనే బయటపెట్టాలని అనుకున్నాను...అందుకే రిషిని పెళ్లి అనే ఒత్తిడిలోకి తీసుకొచ్చాను...తనంతట తనే బంధాన్ని బయటపెట్టేలా చేశాను..నేను ఎప్పుటకీ రిషికి మంచి ఫ్రెండ్ ని అంతకు మించి ఏమీ ఆశించడం లేదు..తన జీవితం బాగుచేయాలని తప్ప ఇంకే బాధా నాకు లేదంటుంది ఏంజెల్. అయినా రిషి నా స్నేహాన్ని కాదనలేదు పెళ్లి వద్దన్నాడంతే...నేనే స్నేహితురాలిగా ఇద్దర్నీ కలపాలి...నాకోసం నువ్వు దిగులుపడొద్దు విశ్వం ...నీది చాలా గొప్ప మనసు తల్లీ..నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందంటాడు విశ్వం..
Also Read: ఏంజెల్ కి షాక్ ఇచ్చిన రిషి, టెన్షన్లో వసు - కొడుకు నిజస్వరూపం తెలుసుకున్న ఫణీంద్ర!
బయటకు వచ్చిన జగతి-మహేంద్ర వెనుకే వచ్చిన రిషి..ఏం జరిగిందని అడుగుతాడు. అప్పుడు మహేంద్ర శైలేంద్ర డబ్బులు తీసుకొచ్చిన విషయం, MSR కాలేజీని లాక్కోవాలి అనుకుంటున్న విషయం చెబుతాడు. అప్పుడు జగతి MSR తో మాట్లాడుతుంటుంది. మరోవైపు మహేంద్ర నిజం చెప్పేందుకు ప్రయత్నించినా రిషి మాత్రం శైలేంద్ర మంచివాడు, ఆ గుంటనక్క ఆలోచన పసిగట్టలేకపోయాడంటూ ఏదేదో మాట్లాడతాడు. మరోవైపు MSR మాత్రం మీతో ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం లేదు..ఇక్కడకు వచ్చి మాట్లాడండి అని కాల్ కట్ చేస్తాడు. ఆ MSR మనల్ని ఇరకాటంలో పెట్టేశాడు, మనం త్వరగా వెళ్లకపోతే కాలేజీని తన సొంతం చేసుకుంటాడని జగతి చెబుతుంది... సమస్య చేతులు దాటింది నువ్వు కూడా మాతో రావాలి రిషి అని మహేంద్ర అడుగుతాడు. జగతి కూడా బతిమలాడుతుంది..మాకోసం కాదు స్టూడెంట్స్ భవిష్యత్ కోసం రావాలని అడుగుతారు. రిషి మాత్రం నన్ను ఇబ్బంది పెట్టొద్దు మేడం..మీరు చేయాల్సింది చేయండి అంటాడు
వసు: అంత బతిమలాడుతున్నా మీ మనసు కరగడం లేదా..అక్కడ పరిస్థితి గురించి ఆలోచించరా
రిషి: అక్కడకు వెళ్లడం ఇష్టం లేదు
వసు: మీకు ఈగోనా సెల్ఫ్ రెస్పెక్టా...మీపై అభాండం పడిందని కోపంగా ఫీలవుతున్నారా..పోనీ బాధపడుతున్నారా..
రిషి: మీకు తెలీదా మేడం..
వసు: మీ ఫీలింగ్స్ మిమ్మల్ని బాధపెట్టి ఉండొచ్చు కానీ కాలేజీపై పగ ఎందుకు..మీకు అవమానం జరిగింది మా వల్ల కాలేజీ ఏం చేసింది
రిషి: మీరే నాపై నింద వేసి బయటకు వెళ్లగొట్టారు. బాధల్లోకి నెట్టేసి నన్ను ప్రశ్నలు అడిగితే ఏం చెప్పాలి
మహేంద్ర: నీ బాధ అర్థం చేసుకున్నాం అందుకే ఇంతకుముందుకన్నా కఠినమైన పరిస్థితులు ఎదురైనా బంధం బయటపెట్టలేదు
రిషి: మీరు ఏం చేసినా నా బాధ తీరదు..
ఎపిసోడ్ ముగిసింది..