బిగ్ బాస్ (Bigg Boss Telugu Season 7) రియాలిటీ షోలో ఏ సీజన్‌లో అయినా సామ, దాన, భేద, దండోపాయాలను ఉపయోగించి గెలవాలని చూస్తారు కంటెస్టెంట్స్. అదే క్రమంలో వారి మధ్య గొడవలు జరుగుతాయి, మనస్పర్థలు వస్తాయి. అవే బిగ్ బాస్ (Bigg Boss Telugu Season 7) షోలో హైలెట్‌గా నిలుస్తాయి. చాలామంది ప్రేక్షకులు ఈ గొడవల్లో ఉండే మజా కోసమే ఈ షోను చూస్తారు. అంతే కాకుండా కంటెస్టెంట్స్ వేసే ఎత్తులు, పైఎత్తులకు కూడా కొందరు ప్రేక్షకులు ఫిదా అవుతారు. తాజాగా బిగ్ బాస్ (Bigg Boss Telugu Season 7)లో ప్రసారమయిన ఎపిసోడ్‌లో కూడా శారీరిక బలంతో అవతల టీమ్‌తో పోటీపడలేని కంటెస్టెంట్స్ బుద్ధిబలం చూపించాలని అనుకున్నారు.


ఫిజికల్ టాస్కులు గెలవలేక..
రణధీర, మహాబలి.. ఇలా రెండు టీమ్స్‌గా విడిపోయిన బిగ్ బాస్ (Bigg Boss Telugu Season 7) కంటెస్టెంట్స్ మాయాస్త్రం కోసం పోటీపడ్డారు. రణధీర టీమ్‌లో అమర్‌దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, శివాజీ, షకీలా ఉన్నారు. మహాబలి టీమ్‌లో టేస్టీ తేజ, దామిని, శుభశ్రీ, రతిక, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ ఉన్నారు. రణధీర టీమ్‌లో మహాబలితో పోలిస్తే.. శారీరికంగా బలమైన కంటెస్టెంట్స్ ఉన్నారు. దీంతో వారికి ఇచ్చిన రెండు ఫిజికల్ ఛాలెంజ్‌లలో వారే విన్నర్స్‌గా నిలిచారు. దాని ద్వారా మాయాస్త్రాన్ని పొందడం కోసం వారికి రెండు తాళంచెవులు దొరికాయి. ఫిజికల్ టాస్కుల విషయంలో రణధీర టీమ్ చేతిలో ఓడిపోయిన మహాబలి.. బుద్ధి బలం ఉపయోగించి ఆ తాళంచెవులను కొట్టేయాలని చూశారు.


యావర్‌కు పనిష్మెంట్..
మహాబలి టీమ్ తాళంచెవులను కొట్టేయాలని గ్రహించిన రణధీర టీమ్.. అసలు తాళంచెవులను ఎక్కడ పెడుతున్నారో తెలియకుండా దాచిపెట్టడం మొదలుపెట్టారు. రణధీర టీమ్‌కు చెందిన యావర్.. అసలు తెలుగు సరిగా మాట్లాడడం లేదని బిగ్ బాస్ తనకు ఒక పనిష్మెంట్ ఇచ్చారు. తాళంచెవులు యావర్ దగ్గర ఉన్నాయని అనుకొని మహాబలి టీమ్ అంతా తనను పనిష్మెంట్ చేయకుండా అడ్డుకోవడం మొదలుపెట్టారు. అసలైతే ఆ తాళంచెవులు శివాజీ దగ్గర ఉన్నాయన్న విషయం ఆ టీమ్ మెంబర్స్‌కు, ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. అయినా యావర్ దగ్గర ఉన్నాయని మహాబలి టీమ్ అనుకుంటుంది కాబట్టి రణధీర టీమ్ కూడా దానికి తగినట్టుగా యాక్టింగ్ చేశారు.


మాయాస్త్రం నుండి పవరస్త్రాకు ప్రయాణం..
ఒకవైపు రణధీర, మహాబలి టీమ్స్‌కు ఛాలెంజ్ నడుస్తున్న సమయంలోనే శుభశ్రీ వెళ్లి పవర్ అస్త్రాను దొంగిలించి బాత్రూమ్‌లో దాచింది. ఈ దొంగతనంలో శుభశ్రీకి దామిని కూడా సహకరించింది. అసలు వారు పవర్ అస్త్రాను ఎందుకు దొంగిలించారు, వారి ప్లాన్ ఏంటి అని చాలామంది ప్రేక్షకులకు సైతం అర్థం కాలేదు. ఓవైపు మహాబలి టీమ్‌లోని సభ్యులు పవర్ అస్త్రాను దొంగిలించే పనిలో బిజీగా ఉంటే రణధీర టీమ్ మాత్రం రెండు ఛాలెంజ్‌లలో విజేతలుగా నిలిచి మాయాస్త్రాన్ని సాధించారని బిగ్ బాస్  ప్రకటించారు. మాయాస్త్రాన్ని అందుకోవడం కోసం యాక్టివిటీ ఏరియాలోకి రమ్మని బిగ్ బాస్.. రణధీర టీమ్ సభ్యులను పిలిచారు. దీంతో అమర్‌దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, శివాజీ, షకీలా యాక్టవిటీ ఏరియాలోకి వెళ్లారు. అక్కడ వాతావరణం అంతా చూసి ఉత్సాహంతో అరిచారు. ఆ తర్వాత మాయాస్త్రంలోని ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్కరు తీసుకున్నారు. ఈ ఆరుగురు తరువాత ఎపిసోడ్స్‌లో పవర్ అస్త్రా కోసం పోటీపడబోతారని బిగ్ బాస్  క్లారిటీ ఇచ్చారు. (Bigg Boss Telugu Season 7)


Also Read: మాయాస్త్రం కోసం దొంగల్లా మారిన కంటెస్టెంట్స్ - గౌతమ్, శుభశ్రీల ప్లాన్స్ మామూలుగా లేవు!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial